అన్వేషించండి

NEET Re-Exam: నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబి సెంటర్ వేయడానికి కారణాలు ఇవే.. ప్రాబ్లం క్లియర్ చేసిన NTA

నాగపూర్ విద్యార్థికి NEET Re Exam 2026 సెంటర్ అబుదాబిలో కేటాయించిన వివాదంపై ఎన్టీఏ వివరణ ఇచ్చింది. అభ్యర్థి నుంచే ఆ రిక్వెస్ట్ వచ్చిందని, చివరగా అతడికి సాయం చేసినట్లు తెలిపింది.

న్యూఢిల్లీ: నాగ్‌పూర్‌కు చెందిన ఒక అభ్యర్థికి NEET UG 2026 ఎగ్జామ్ సెంటర్ అబుదాబిలో కేటాయించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. నీట్ రీఎగ్జామ్‌ నిర్వహణపై తలెత్తిన ప్రశ్నలు, విమర్శలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) స్పందించింది. NEET UG 2026 పరీక్షను జూన్ 21న నిర్వహించనున్నారు. అభ్యర్థుల సౌలభ్యం కోసం పరీక్షా కేంద్రాలు (Exam City)లో సవరణ చేసుకునే అవకాశం మళ్లీ ఇచ్చారు. దాంతో సుమారు 3.2 లక్షల మంది అభ్యర్థులు ఈ ఎడిట్ విండోను ఉపయోగించుకున్నారు. వారిలో 99.5 శాతం కంటే ఎక్కువ మంది అభ్యర్థులకు వారు కోరుకున్న నగరంలోనే ఎగ్జామ్ రాసేలా సెంటర్లు కేటాయించినట్లు ఎన్టీఏ తెలిపింది.

అసలు వివాదం ఏంటీ.. ఎందుకీ విమర్శలు

నీట్ రీఎగ్జామ్ కోసం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన అబ్దుల్లా మహ్మద్ తాలిబ్ అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోగా, అతనికి ఊహించని షాక్ తగిలింది. అతడికి ఎగ్జామ్ సెంటర్ అబుదాబిలో వేశారు. ఈ విషయం వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ఎగ్జామ్ నిర్వహణపై NTAపై చాలా ప్రశ్నలు తలెత్తాయి. ఈ విమర్శలు, ఆరోపణలపై NTA శనివారం (జూన్ 20న) మధ్యాహ్నం స్పందించింది.

అభ్యర్థి లాగిన్ నుండే అబుదాబి ఎంపిక 

NTA రికార్డుల ప్రకారం, సంబంధిత అభ్యర్థి విషయంలో ఎగ్జామ్ సిటీని అబుదాబికి మార్చే ప్రక్రియ అభ్యర్థి తన రిజిస్టర్డ్ లాగిన్ ద్వారా కోరారు. సిస్టమ్‌లో నమోదు అయిన దాని ప్రకారం, ఈ మార్పు ఒకే యూజర్ ద్వారా జరిగిందని ఏజెన్సీ తెలిపింది.

Also Read: NEET Re-Exam 2026: నాగపూర్ విద్యార్థికి అబుదాబిలో సెంటర్‌! నీట్ రీ ఎగ్జామ్‌కు ముందు ఎన్‌టిఎ నిర్లక్ష్యం!

చివరి నిమిషంలో నాగ్‌పూర్ కేంద్రం కోసం డిమాండ్

నీట్ యూజీ రీఎగ్జామ్ నిర్వహణకు కేవలం 48 గంటల ముందు, జూన్ 19 సాయంత్రం అబుదాబి నుంచి నాగ్‌పూర్‌కు ఎగ్జామ్ సెంటర్ మార్చాలని అనధికారికంగా అభ్యర్థన అందినట్లు ఎన్టీఏ తెలిపింది. అదే సాయంత్రం అభ్యర్థి తండ్రిని సంప్రదించి, వారి కోరిక మేరకు నాగ్‌పూర్‌లో సెంటర్ వేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 

మూడుసార్లు కనిపించిన అబుదాబి కేంద్రం

NTA ప్రకారం, రికార్డుల ప్రకారం అభ్యర్థి ఐడీ నుంచి ఎగ్జామ్ సెంటర్‌ను అబుదాబికి మార్చుకున్నారు. మరో రెండు సందర్భాలలో కూడా ప్రివ్యూలో అబుదాబిగా కనిపించింది. అయినప్పటికీ, విద్యార్థి అభ్యర్థనను అంగీకరించి ఎన్టీఏ ఎగ్జామ్ సెంటర్ మార్చే ప్రక్రియను పూర్తి చేసింది.

స్టూడెంట్ ఫస్ట్ విధానంపై ఫోకస్ 

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రాధాన్యత ఎల్లప్పుడూ విద్యార్థుల ప్రయోజనాలను కాపాడటమే అని పేర్కొంది. పరీక్ష రాయనున్న ఏ అభ్యర్థికి ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవడం, అవసరమైన సహాయాన్ని అందించడం ఏజెన్సీ లక్ష్యంగా ఎక్స్ ఖాతాలో పేర్కొంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
NEET SUPREME COURT:నీట్-యూజీ విధానంలో భారీ మార్పులు!మెయిన్, అడ్వాన్స్‌డ్ మోడల్‌లో చేయనున్నట్టు సుప్రీంకోర్టు చెప్పిన కేంద్రం!
నీట్-యూజీ విధానంలో భారీ మార్పులు!మెయిన్, అడ్వాన్స్‌డ్ మోడల్‌లో చేయనున్నట్టు సుప్రీంకోర్టు చెప్పిన కేంద్రం!
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
Career Options After MBBS in Telugu: ఎంబిబిఎస్ తర్వాత  ఏ కోర్స్‌ చేయాలి? ఎంత ఖర్చు అవుతుంది?
ఎంబిబిఎస్ తర్వాత  ఏ కోర్స్‌ చేయాలి? ఎంత ఖర్చు అవుతుంది?
Advertisement

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget