అన్వేషించండి

Fine Arts College: బీసీ ఫైన్‌ఆర్ట్స్‌ కాలేజీల్లో ప్రవేశాల గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

Fine Arts College Applications: బీసీ గురుకుల ఆధ్వర్యంలోని ఫైన్‌ఆర్ట్స్‌ కళాశాలల్లో ప్రవేశాల దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. ఇప్పటికవరకు దరఖాస్తు చేసుకోనివారు ఆగస్టు 24లోపు అప్లయ్ చేసుకోవచ్చు.

MJPTBCWR Fine Arts College Admissions: తెలంగాణ బీసీ గురుకుల ఆధ్వర్యంలోని ఫైన్‌ఆర్ట్స్‌ కళాశాలల్లో బీఏ యానిమేషన్, వీఎఫ్‌క్స్‌ కోర్సులో 2024-25 ఏడాదికి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. వాస్తవానికి ఆగస్టు 17తో గడువు ముగియగా.. ఆగస్టు 24 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. ఇంటర్‌ పూర్తిచేసిన బాల, బాలికలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దీనిద్వారా బీఏ కోర్సుల్లో మొత్తం 60 సీట్లలో ప్రవేశాలు కల్పిస్తారు. బాలురకు, బాలికలకు వేర్వేరుగా క్యాంపస్‌లు ఉంటాయి. సరైన అర్హతలు, ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 17 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి. అలాగే ఈమెయిల్: mjpanimation45@gmail.com ద్వారా పూర్తిచేసిన దరఖాస్తు స్కానింగ్ కాపీని పంపాల్సి ఉంటుంది. ఏమైనా సందేహాలుంటే 9032644463, 9063242329 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.1.50 లక్షలకు, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.2 లక్షలకు మించకూడదు. సీట్లు పొందినవారికి ఉచిత వసతి సౌకర్యాలు కల్పిస్తారు. క్యాంపస్‌లోకి మొబైల్ ఫోన్లను అనుమతించరు.

వివరాలు..

* బీఏ (యానిమేషన్, వీఎఫ్‌క్స్‌) కోర్సులో ప్రవేశాలు

కళాశాలలు: బీసీ గురుకుల ఫైన్‌ఆర్ట్స్‌ కళాశాల (బాలురు), బీసీ గురుకుల ఫైన్‌ఆర్ట్స్‌ కళాశాల (బాలికలు) 

అర్హత: ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే (వార్షిక పరీక్షల్లో) ఉత్తీర్ణులై ఉండాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.1.50 లక్షలకు, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.2 లక్షలకు మించకూడదు.

సీట్ల సంఖ్య: 60. (30 + 30).

ఫీజు వివరాలు: సీట్లు పొందిన విద్యార్థులు రిపోర్టింగ్ సమయంలో మెయింటెనెన్స్ ఫీజు కింద రూ.2000, కాజన్ డిపాజిట్ కింద మరో రూ.2000 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో కాజన్ డిపాజిట్ మొత్తాన్ని కోర్సుల పూర్తయిన వెంటనే తిరిగి చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్, ఈమెయిల్ ద్వారా.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: 
MJPTBCWR Fine Arts College, 
Vikarabad, Located at MJPTBCWRS(G), 
H.No. 11-53/1/100, Vikarabad Road, Model Colony, 
Chevella(M) Ranga Reddy District-501503.

దరఖాస్తు స్కాన్ కాపీ పంపాల్సిన ఈమెయిల్: mjpanimation45@gmail.com 

రిపోర్టింగ్ సమయంలో సమర్పించాల్సిన సర్టిఫికేట్లు..

➥ పూరించిన దరఖాస్తు కాపీ

➥ ఇంటర్ ఒరిజినల్ పాస్ సర్టిఫికేట్లు, మార్కుల మెమో

➥ పదోతరగతి ఒరిజనల్ పాస్ సర్టిఫికేట్లు, మార్కుల మెమో

➥ మైగ్రేషన్ సర్టిఫికేట్ (TSBIE నుంచి ఇంటర్ చదవనివారు)

➥ ఇంటర్ కండక్ట్ సర్టిఫికేట్/స్టడీ సర్టిఫికేట్ (సంబంధిత కాలేజీ నుంచి )

➥ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (T.C) (సంబంధిత కాలేజీ నుంచి)

➥ క్యాస్ట్ సర్టిఫికేట్ (తహసీల్దార్ జారీచేసినది)

➥ ఇన్‌కమ్ సర్టిఫికేట్ (తహసీల్దార్ జారీచేసినది) 

➥ స్థానిక నివాస ధ్రవీకరణ పత్రం ( తహసీల్దార్ జారీచేసిన ఒరిజినల్ సర్టిఫికేట్)

➥ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ (డాక్టర్ ద్వారా - అసిస్టెంట్ సివిల్ సర్జన్ ర్యాంకుకు తగ్గని వారినుంది) 

➥ దివ్యాంగులకు సంబంధించిన సర్టిఫికేట్ 

➥ బ్లడ్ గ్రూప్ సర్టిఫికేట్

➥ అనాధలు అయితే తల్లిదండ్రుల డెత్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.  

➥ 15 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు

➥ తల్లిదండ్రులు, విజిటింగ్ గార్డియన్స్ ఫొటోలు

➥ ఆధార్ కార్డు

➥ అన్ని సర్టిఫికేట్లను 3 జతలు జిరాక్స్ కాపీలు సమర్పించాలి.

➥ దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 17.08.2024. (24.08.2024 వరకు పొడిగించారు)

Notification & Application

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi in US: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ కీలక భేటీ - ఉక్రెయిన్ యుద్ధం సహా పలు అంశాలపై చర్చ
అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ కీలక భేటీ - ఉక్రెయిన్ యుద్ధం సహా పలు అంశాలపై చర్చ
Telugu Indian Idol Season 3 Winner: ఆహా ఇండియన్ ఐడల్ 3 విన్నర్‌గా ఏపీ మెకానిక్ కొడుకు... 'ఓజీ'లో పాడే గోల్డెన్ ఛాన్స్ కూడా
ఆహా ఇండియన్ ఐడల్ 3 విన్నర్‌గా ఏపీ మెకానిక్ కొడుకు... 'ఓజీ'లో పాడే గోల్డెన్ ఛాన్స్ కూడా
Hyderabad Weather Alert: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం, పిడుగులు పడుతున్నాయా అన్నట్లు ఉరుములు, మెరుపులు
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం, పిడుగులు పడుతున్నాయా అన్నట్లు ఉరుములు, మెరుపులు
Bigg Boss 8 Telugu Elimination 3rd week: బిగ్ బాస్‌ని తిడితే ఊరుకుంటారా... నిజంగా బయటకు గెంటేస్తున్నారు, ఈ వారం ఎలిమినేషన్ ఇతడిదే!
బిగ్ బాస్‌ని తిడితే ఊరుకుంటారా... నిజంగా బయటకు గెంటేస్తున్నారు, ఈ వారం ఎలిమినేషన్ ఇతడిదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pant Equals MS Dhoni Test Centuries | ఎంఎస్ ధోని సెంచరీల రికార్డును సమం చేసిన పంత్ | ABP DesamAP Govt Permission Devara Special Shows | ఏపీలో దేవర స్పెషల్ షోలకు స్పెషల్ పర్మిషన్ | ABP Desamఅయోధ్య ఉత్సవంలోనూ అపచారం, రామయ్య వేడుకల్లో తిరుమల లడ్డూలుమైసూరు ప్యాలెస్‌లో ఏనుగుల బీభత్సం, ఉన్నట్టుండి బయటకు పరుగులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi in US: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ కీలక భేటీ - ఉక్రెయిన్ యుద్ధం సహా పలు అంశాలపై చర్చ
అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ప్రధాని మోదీ కీలక భేటీ - ఉక్రెయిన్ యుద్ధం సహా పలు అంశాలపై చర్చ
Telugu Indian Idol Season 3 Winner: ఆహా ఇండియన్ ఐడల్ 3 విన్నర్‌గా ఏపీ మెకానిక్ కొడుకు... 'ఓజీ'లో పాడే గోల్డెన్ ఛాన్స్ కూడా
ఆహా ఇండియన్ ఐడల్ 3 విన్నర్‌గా ఏపీ మెకానిక్ కొడుకు... 'ఓజీ'లో పాడే గోల్డెన్ ఛాన్స్ కూడా
Hyderabad Weather Alert: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం, పిడుగులు పడుతున్నాయా అన్నట్లు ఉరుములు, మెరుపులు
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం, పిడుగులు పడుతున్నాయా అన్నట్లు ఉరుములు, మెరుపులు
Bigg Boss 8 Telugu Elimination 3rd week: బిగ్ బాస్‌ని తిడితే ఊరుకుంటారా... నిజంగా బయటకు గెంటేస్తున్నారు, ఈ వారం ఎలిమినేషన్ ఇతడిదే!
బిగ్ బాస్‌ని తిడితే ఊరుకుంటారా... నిజంగా బయటకు గెంటేస్తున్నారు, ఈ వారం ఎలిమినేషన్ ఇతడిదే!
Pawan Kalyan Deeksha: భగవంతుడా మమ్మల్ని క్షమించు! పవన్ కళ్యాణ్ 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష
భగవంతుడా మమ్మల్ని క్షమించు! పవన్ కళ్యాణ్ 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష
Tirumala Laddu: గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ - ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Duleep Trophy 2024: దులీప్‌ ట్రోఫీలో తెలుగు తేజం దూకుడు, రెండో సెంచరీకి అడుగు దూరంలో రికీ భుయ్
దులీప్‌ ట్రోఫీలో తెలుగు తేజం దూకుడు, రెండో సెంచరీకి అడుగు దూరంలో రికీ భుయ్
Embed widget