MJPAPBC Admissions: మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్, వివరాలు ఇలా
విజయవాడలోని మహాత్మా జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ 2025-26 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది.

MJPAPBC Admission Notification: విజయవాడలోని మహాత్మా జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే 18 బీసీ జూనియర్ కళాశాలల్లో 2025-26 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్మీడియట్(ఇంగ్లిష్ మీడియం) మొదటిసంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 15న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులు మార్చి 15 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
⋆ మహాత్మా జ్యోతిబా ఫూలే ఏపీ బీసీడబ్ల్యూ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ - 2025.
⋆ ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలు
మొత్తం సీట్ల సంఖ్య: 2680.
⏩ జూనియర్ ఇంటర్మీడియట్(బాలురు): 1340 సీట్లు
➥ సింహాచలం, విశాఖపట్నం: 180 సీట్లు
కోర్సులు: ఎంపీసీ- 60, బైపీసీ- 40, ఎంఈసీ- 40, సీఈసీ- 40.
➥ మోపిదేవి, కృష్ణ: 140 సీట్లు
కోర్సులు: ఎంపీసీ- 60, బైపీసీ- 40, ఎంఈసీ- 00, సీఈసీ- 40.
➥ నిజాంపట్నం, గుంటూరు: 140 సీట్లు
కోర్సులు: ఎంపీసీ- 60, బైపీసీ- 40, ఎంఈసీ- 00, సీఈసీ- 40.
➥ కోట SPSR నెల్లూరు: 180 సీట్లు
కోర్సులు: ఎంపీసీ- 60, బైపీసీ- 40, ఎంఈసీ- 40, సీఈసీ- 40.
➥ దొరవారిసత్రం, SPSR నెల్లూరు: 180 సీట్లు
కోర్సులు: ఎంపీసీ- 60, బైపీసీ- 40, ఎంఈసీ- 40, సీఈసీ- 40.
➥ సోడం.చిత్తూరు: 80 సీట్లు
కోర్సులు: ఎంపీసీ- 40, బైపీసీ- 40, ఎంఈసీ- 00, సీఈసీ- 00.
➥ బేతంచర్ల, కర్నూలు: 80 సీట్లు
కోర్సులు: ఎంపీసీ- 40, బైపీసీ- 40, ఎంఈసీ- 00, సీఈసీ- 00.
➥ లేపాక్షి, అనంతపురము: 180 సీట్లు
కోర్సులు: ఎంపీసీ- 60, బైపీసీ- 40, ఎంఈసీ- 40, సీఈసీ- 40.
➥ గుండుమల, అనంతపురము: 180 సీట్లు
కోర్సులు: ఎంపీసీ- 60, బైపీసీ- 40, ఎంఈసీ- 40, సీఈసీ- 40.
⏩ జూనియర్ ఇంటర్మీడియట్(బాలికలు): 1340 సీట్లు
➥ అముదాలవలస, శ్రీకాకుళం: 80 సీట్లు
కోర్సులు: ఎంపీసీ- 40, బైపీసీ- 40, ఎంఈసీ- 00, సీఈసీ- 00.
➥ నెల్లిమర్ల, విజయనగరం: 180 సీట్లు
కోర్సులు: ఎంపీసీ- 60, బైపీసీ- 40, ఎంఈసీ- 40, సీఈసీ- 40.
➥ థానం, విశాఖపట్నం: 180 సీట్లు
కోర్సులు: ఎంపీసీ- 60, బైపీసీ- 40, ఎంఈసీ- 40, సీఈసీ- 40.
➥ నందలూరు, వైఎస్ఆర్ కడప: 180 సీట్లు
కోర్సులు: ఎంపీసీ- 60, బైపీసీ- 40, ఎంఈసీ- 40, సీఈసీ- 40.
➥ అరెకల్, కర్నూలు: 180 సీట్లు
కోర్సులు: ఎంపీసీ- 60, బైపీసీ- 40, ఎంఈసీ- 40, సీఈసీ- 40.
➥ నెరవాడ.కర్నూలు: 140 సీట్లు
కోర్సులు: ఎంపీసీ- 60, బైపీసీ- 40, ఎంఈసీ- 00, సీఈసీ- 40.
➥ ధోనే,కర్నూల్: 80 సీట్లు
కోర్సులు: ఎంపీసీ- 40, బైపీసీ- 40, ఎంఈసీ- 00, సీఈసీ- 00.
➥ గుడిబండ.అనంతపురము: 140 సీట్లు
కోర్సులు: ఎంపీసీ- 60, బైపీసీ- 40, ఎంఈసీ- 00, సీఈసీ- 40.
➥ టేకులోడు, అనంతపురము: 180 సీట్లు
కోర్సులు: ఎంపీసీ- 60, బైపీసీ- 40, ఎంఈసీ- 40, సీఈసీ- 40.
అర్హత: విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో పదోతరగతి చదువుతుండాలి. 2025 మార్చిలో నిర్వహించనున్న పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది.
వయసు: 31.08.2025 నాటికి 17 సంవత్సరాలు మించకూడదు. 01.09.2008- 31.08.2025 మధ్య జన్మించి ఉండాలి.
ఆదాయ పరిమితి: విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.250.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ఎంపిక విధానం: అర్హులైన అభ్యర్థులకు ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ (అనాథ/ మత్స్యకార) ఆధారంగా సీటు కేటాయిస్తారు.
ప్రవేశ పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఓఎంఆర్ షీట్ విధానంలో 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమాల్లో ఉంటుంది. ప్రతి ఒప్పు సమాధానానికి ఒక మార్కు ఉంటుంది, తప్పు సమాధానానికి మార్కులో నాలుగో వంతు కోత విధిస్తారు. తీసుకునే గ్రూపును అనుసరించి సబ్జెక్టుల వారిగా మార్కులు ఉంటాయి.
ముఖ్యమైన తేదీలు...
✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.02.2025.
✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.03.2025.
✦ పరీక్ష తేదీ: 20.04.2025.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు