Miss Universe: మన ముగ్గురు విశ్వ సుందరుల చదువేంటో తెలుసా?
21 ఏళ్ల తర్వాత.. మిస్ యూనివర్స్ కిరీటం భారత్ సొంతమైంది. హర్నాజ్ కౌర్ సంధు.. దేశం మెుత్తం గర్వపడేలా చేస్తోంది. ఆమెతోపాటుగా అంతకుమందు మిస్ యూనివర్స్ గెలుచుకున్న సుందరీమణుల చదువు ఏంటో తెలుసా?
21 ఏళ్ల తర్వాత.. మిస్ యూనివర్స్ కిరీటం భారత్ సొంతమైంది. 21 ఏళ్ల చండీగఢ్‌కు చెందిన హర్నాజ్ కౌర్ సంధు దేశం మొత్తం గర్వపడేలా చేస్తోంది. లారా దత్తా, సుస్మితా సేన్ తర్వాత కిరీటాన్ని గెలుచుకున్న మూడో భారతీయురాలు హర్నాజ్.
India's #HarnaazSandhu crowned Miss Universe 2021, two decades after Lara Dutta won the title in 2000. #Harnaaz edged out contestants from Paraguay and South Africa to bag the crown. #MissUniverse pic.twitter.com/SfLdREJpDO
— All India Radio News (@airnewsalerts) December 13, 2021
పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో జన్మించింది హర్నాజ్ కౌర్. ఆమె కుటుంబం చండీగఢ్‌కు వెళ్లి స్థిరపడింది. 17 సంవత్సరాల వయస్సులో మోడలింగ్ వృత్తిని ప్రారంభించింది.. హర్నాజ్. అయితే ఓ వైపు మోడలింగ్ చేస్తూనే.. మరోవైపు చదువును కొనసాగించింది. చండీగఢ్‌లోని శివాలిక్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకుంది. ప్రభుత్వ బాలికల కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్‌ను అభ్యసించింది. ప్రస్తుతం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసిస్తోంది.
హర్నాజ్ కౌర్.. టైమ్స్ ఫ్రెష్ ఫేస్ మిస్ చండీగఢ్ 2017, మిస్ మాక్స్ ఎమర్జింగ్ స్టార్ ఇండియా 2018, ఫెమినా మిస్ ఇండియా పంజాబ్ 2019 మరియు LIVA మిస్ దివా యూనివర్స్ 2021 వంటి అనేక పోటీల్లో టైటిల్‌లను గెలుచుకుంది.
2000లో, లారా దత్తా మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకుంది. ఘజియాబాద్‌లో జన్మించింది. ఆమె తండ్రి పంజాబీ, తల్లి ఆంగ్లో-ఇండియన్. లారా పుట్టిన సమయంలోనే వారి కుటుంబం బెంగళూరుకు వెళ్లింది. అక్కడ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ బాలికల ఉన్నత పాఠశాల, ఫ్రాంక్ ఆంథోనీ పబ్లిక్ స్కూల్ లోనూ చదువుకుంది. ఆమె ముంబై విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో డిగ్రీ చదువుకుంది. లారా ఇంగ్లీష్, హిందీ, పంజాబీ, కన్నడలో అనర్గళంగా మాట్లాడగలదు. ఆమె 1997లో మిస్ ఇంటర్‌కాంటినెంటల్‌గా కిరీటాన్ని గెలుచుకుంది.
భారతదేశానికి మొట్టమొదటి మిస్ యూనివర్స్ కిరీటాన్ని 1994లో సుస్మితా సేన్ అందించింది. ఈమె హైదరాబాద్‌లోని బెంగాలీ కుటుంబంలో జన్మించింది. న్యూఢిల్లీలోని ఎయిర్‌ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇన్‌స్టిట్యూట్ మరియు సికింద్రాబాద్ హైదరాబాద్‌లోని సెయింట్ ఆన్స్ హైస్కూల్‌లో చదివింది. తర్వాత ఉన్నత విద్యను అభ్యసించలేదు. ఆమె 18 సంవత్సరాల వయస్సులో ఫెమినా మిస్ ఇండియా 1994 కిరీటాన్ని గెలుచుకుంది.
Also Read: Harnaaz Sandhu: విశ్వ సుందరి హర్నాజ్ ముద్దు పేరేంటో తెలుసా? ఆ పేరు పెట్టింది అతడేనట...