MBBS: ఎంబీబీఎస్ విద్యార్థులకు గుడ్‌న్యూస్, పరీక్షలు రాసేందుకు మరో అవకాశం
MBBS Students News: దేశంలోని వైద్యకళాశాల్లో 2020-21 విద్యాసంవత్సరంలో ఎంబీబీఎస్ ప్రవేశాలు పొంది, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులకు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) శుభవార్త తెలిపింది.
MBBS Exams: దేశంలోని వైద్యకళాశాల్లో 2020-21 విద్యాసంవత్సరంలో ఎంబీబీఎస్ ప్రవేశాలు పొంది, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులకు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) శుభవార్త తెలిపింది. 2020-21 ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు పరీక్ష రాసేందుకు మరో ప్రయత్నానికి అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు డిసెంబరు 11న ఎన్‌ఎంసీ ఒక ప్రకటన విడుదల చేసింది. 2020-21 విద్యాసంవత్సరంలో వైద్య కళాశాలల్లో ప్రవేశాలు పొంది తమ మొదటి ప్రొఫెషనల్ ఎంబీబీఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులను మాత్రమే మరో ప్రయత్నం (5వ సారి పరీక్ష)కు అనుమతిస్తున్నట్లు స్పష్టంచేసింది. ఈ బ్యాచ్‌పై కొవిడ్ ప్రభావం పడినందున వారికి మాత్రమే అదనపు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆ ప్రకటనలో తెలిపింది. ఇదే చివరి అవకాశమని, ఇకపై ఇలాంటి అవకాశం ఉండబోదని ఎన్ఎంసీ తేల్చి చెప్పింది.
వారు ఇకపై నేరుగా విదేశాల్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు..
భారత్‌లో వైద్య విద్య అభ్యసించినవారు నేరుగా అమెరికా, కెనడా, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో వైద్యసేవలు అందించేందుకు మార్గం సుగమమైంది. భారత్‌లో వైద్య విద్యను నియంత్రించే నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ)కు వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ (డబ్ల్యూఫ్‌ఎంఈ) గుర్తింపు లభించింది. దీంతో ఎన్‌ఎంసీ గుర్తింపు ఉన్న భారత్‌లోని 706 మెడికల్ కాలేజీలకు కూడా ఆటోమెటిక్‌గా డబ్ల్యూఎఫ్‌ఎంఈ గుర్తింపు లభించింది. వచ్చే పదేండ్లలో దేశంలో ప్రారంభించబోయే మెడికల్ కాలేజీలకు కూడా డబ్ల్యూఎఫ్‌ఎంఈ గుర్తింపు లభిస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ ఇటీవల ప్రకటించింది. ఎన్‌ఎంసీ గుర్తింపు ఉన్న విద్యా సంస్థల్లో ఎంబీబీఎస్ చదివినవారు విదేశాల్లో నేరుగా ప్రాక్టీస్ చేసుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. విదేశాల్లో మెడికల్ పీజీ కోర్సులు చదవటానికి కూడా సమస్యలు తొలగిపోతాయి.
ALSO READ:
జేఈఈ అడ్వాన్స్‌డ్ దరఖాస్తు ఫీజు పెంపు, కేటగిరీల వారీగా ఫీజు వివరాలు ఇలా
జేఈఈ అడ్వాన్స్‌డ్ దరఖాస్తు ఫీజును అధికారులు మరోసారి పెంచారు. ఇలా ఫీజులు పెంచడం వరుసగా ఇది రెండోసారి. గతేడాది దరఖాస్తు ఫీజు అమ్మాయిలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1450 ఉండేది. అయితే దాన్ని ప్రస్తుతం రూ.1600లకు, ఇతరులకు రూ.2,900 నుంచి రూ.3,200కి పెంచినట్లు ఐఐటీ మద్రాస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సారి కూడా బాలికలకు 20 శాతం సీట్లు సూపర్‌న్యూమరరీ కోటా కింద కేటాయించనున్నారు. జేఈఈ మెయిన్‌లో కటాఫ్ మార్కులు పొంది ఉత్తీర్ణులైన 2.50 లక్షల మందే అడ్వాన్స్‌డ్ రాయడానికి అర్హులు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఏటా సుమారు 40 వేల మంది అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధిస్తూ వస్తున్నారు.
ఫీజుకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
గేట్ - 2024 పరీక్షల షెడ్యూల్ విడుదల, పేపర్లవారీగా తేదీలివే
దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE)-2024 పరీక్షల పూర్తిస్థాయి షెడ్యూల్‌ను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగళూరు(IISc) డిసెంబరు 5న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో దేశ వ్యాప్తంగా 200 నగరాల్లో రెండు షిఫ్టుల్లో 'గేట్' పరీక్ష నిర్వహించనున్నారు. ఏ రోజు ఏ పరీక్ష నిర్వహిస్తారనే షెడ్యూల్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ పరీక్ష షెడ్యూలులో మారే అవకాశం ఉంది.
గేట్-2024 పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..