అన్వేషించండి

LIC Scholarship: పేద విద్యార్థులకు వరం, ఎల్‌ఐసీ ఉపకారం- 'గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్' నోటిఫికేషన్ విడుదల

Golden Jubilee Scholarship Scheme- 2023: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(LIC) 2023 సంవత్సరానికి సంబంధించి గోల్డెన్‌ జూబ్లీ స్కాలర్‌షిప్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Golden Jubilee Scholarship Scheme- 2023: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(LIC) 2023 సంవత్సరానికి సంబంధించి గోల్డెన్‌ జూబ్లీ స్కాలర్‌షిప్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయం అందిస్తారు. అర్హులైన విద్యార్థులు జనవరి 14 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. కనీస అర్హతగా పేర్కొన్న టెన్త్ లేదా ఇంటర్‌లో పొందిన మార్కుల మెరిట్, కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆధారంగా అభ్యర్థులను స్కాలర్ షిష్‌న‌కు ఎంపిక చేస్తారు. 

వివరాలు..

* గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీం-2023

⏩ జనరల్‌ స్కాలర్‌షిప్‌

⏩ స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్‌

అర్హత: 
➔ జనరల్‌ స్కాలర్‌షిప్‌‌కు దరఖాస్తు చేసుకొనే విద్యార్ధులు 2022-23 విద్యా సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్‌/ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు/ సంస్థల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఐటిఐ, డిప్లొమా, పాలిటెక్నిక్, ఏదైనా డిగ్రీ, మెడిసిన్, ఇంజినీరింగ్, ఇంటిగ్రేటెడ్, వృత్తి విద్య లేదా తత్సమానమైన కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉపకార వేతనం అందుతుంది. విద్యార్థి తల్లిదండ్రుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలు మించకూడదు. వితంతువు/ఒంటరి మహిళలైతే కుటుంబ వార్షికాదాయం రూ,4 లక్షలు మించకూడదు.

➔ స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్‌‌కు దరఖాస్తు చేసుకొనే విద్యార్ధినులు 2022-23 విద్యా సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతి తర్వాత బాలికల ఉన్నత విద్యను ప్రోత్సహించడమే ఈ పథక ఉద్దేశ్యం. అభ్యర్థి తల్లిదండ్రుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలు మించకూడదు. ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు/సంస్థల్లో ఇంటర్మీడియట్, ఒకేషనల్‌, డిప్లొమా, ఐటీఐ కోర్సు అభ్యసిస్తున్న బాలికలకు ఉపకారవేతనం అందుతుంది. అభ్యర్థి తల్లిదండ్రుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలు మించకూడదు. యూజీ కోర్సులకు మాత్రమే ఈ ఉపకార వేతనాలను అందిస్తారు. పీజీ కోర్సులకు ఇవ్వరు. 

సహాయం:

➤ జనరల్‌ స్కాలర్‌షిప్‌నకు మెడిసిన్‌ విద్యార్థులకైతే ఏటా రూ.40వేలు ఇస్తారు. మూడు విడతలు (రూ.12000/ రూ.12000/ రూ.16000) చొప్పున అందుతుంది. ఇంజినీరింగ్‌ విద్యార్థులైతే  ఏడాదికి రూ.30వేలు ఇస్తారు. మూడు విడతల్లో (రూ.9000/ రూ.9000/ రూ.12000) చెల్లిస్తారు. డిగ్రీ, ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు, డిప్లొమా, ఒకేషనల్‌ కోర్సులు చేసేవారికైతే ఆ కోర్సు పూర్తయ్యేవరకు  ఏటా రూ.20వేలు చొప్పున ఇస్తారు.  ఈ మొత్తాన్ని మూడు విడతల్లో (రూ.6000/ రూ.6000/ రూ.8000)బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.

➤ స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కీమ్ కింద ఎంపికైన విద్యార్థినులకు ఏడాదికి రూ.15వేలు చొప్పున ఇస్తారు. పదో తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్‌, ఒకేషనల్‌/ డిప్లొమా కోర్సులను పూర్తి చేసేందుకు ఈ మొత్తాన్ని మూడు విడతల్లో (రూ.4500/ రూ.4500/ రూ.6000) చెల్లిస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: కనీస అర్హతగా పేర్కొన్న టెన్త్ లేదా ఇంటర్‌లో పొందిన మార్కుల మెరిట్, కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆధారంగా అభ్యర్థులను స్కాలర్ షిష్‌న‌కు ఎంపిక చేస్తారు. తక్కువ ఆదాయ వర్గాలకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఒక్కో ఎల్‌ఐసీ డివిజన్‌కు 30 మందిని షార్ట్‌లిస్ట్ చేస్తారు. అందులో  20 మంది( బాలురు- 10, బాలికలు- 10)ని జనరల్‌ స్కాలర్‌షిప్‌నకు, మిగతా వారిని స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కీమ్‌కు ఎంపిక చేస్తారు.  

స్కాలర్‌షిప్ కోసం నిబంధనలు..

➥ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సెస్ లేదా పార్ట్‌టైం తరగతుల్లో చేరే విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌ వర్తించదు. అలాగే, సీఏ/సీఎస్‌/ఐసీడబ్ల్యూఏ లేదా సెల్ఫ్-ఎడ్యుకేషన్ కోర్సెస్ చేసేవారూ ఈ స్కాలర్‌షిప్‌నకు అనర్హులు.

➥ మెడిసిన్‌, ఇంజినీరింగ్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు, సాధారణ డిగ్రీ కోర్సుల్లో చేరిన వారు నిర్దేశించిన మార్కులను పొందితేనే వచ్చే సంవత్సరానికి స్కాలర్ షిప్ కొనసాగుతుంది. రెగ్యులర్ హాజరు శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

➥ స్పె షల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన విద్యా ర్థినులు ఇంటర్‌మొదటి సంవత్సరంలో 50శాతం మార్కులు సాధిస్తేనేస్తే తర్వాతి ఏడాదికి రెన్యువల్‌ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది.

➥ ఏవైనా ఇతర ట్రస్టులు/ సంస్థల నుంచి ఇప్పటికే స్కాలర్‌షిప్‌ పొందుతున్న వారైతే ఈ స్కాలర్‌షిప్‌నకు పరిగణనలోకి తీసుకోరు.

➥ కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌ అందిస్తారు. ఒకవేళ కుటుంబంలో గర్ల్‌ చైల్డ్‌ ఉంటే ఇద్దరికీ అనుమతిస్తారు.

➥ ఎల్‌ఐసీ విధించిన ఏ ఒక్క నిబంధనను ఉల్లంఘించినా సరే స్కాలర్‌షిప్‌ రద్దు చేయబడుతుంది. తప్పుడు సమాచారం /నకిలీ సర్టిఫికెట్లతో ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైనట్లు రుజువైతే అతడు/ఆమె స్కాలర్‌షిప్‌ను రద్దుచేయడంతో పాటు వారి నుంచి ఆమొత్తాన్ని రికవరీ చేస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14.01.2024.

Golden Jubilee Scholarship Scheme- 2023

Instructions To Candidates

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
Kadiyam Srihari: కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
Bengalore One Side Love: మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?

వీడియోలు

గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్
James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
Kadiyam Srihari: కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
కడియం శ్రీహరి కూడా - దానమే మిగులుతారు - రాజీనామా తప్పదా ?
Bengalore One Side Love: మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
మహిళ వన్ సైడ్ లవ్ - తట్టుకోలేకపోయిన పోలీస్ - చివరికి ఏం జరిగింది?
Upcoming Movies 2027: మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
మహేష్ 'వారణాసి' to ప్రభాస్ 'స్పిరిట్', AA22xA6... నెక్స్ట్ ఇయర్ కాదు, 2027లో దుమ్ము రేపే సినిమాలు
Revanth Reddy: పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం కాంగ్రెస్ గెలుపు - క్రియాశీలక రాజకీయాల్లో లేని కేసీఆర్ - రేవంత్ కీలక వ్యాఖ్యలు
పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం కాంగ్రెస్ గెలుపు - క్రియాశీలక రాజకీయాల్లో లేని కేసీఆర్ - రేవంత్ కీలక వ్యాఖ్యలు
Avatar 3 Piracy : 'అవతార్ 3' మూవీకి బిగ్ షాక్ - రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో HD ప్రింట్
'అవతార్ 3' మూవీకి బిగ్ షాక్ - రిలీజ్‌కు ముందే ఆన్‌లైన్‌లో HD ప్రింట్
US Crime News: అమెరికాలో తండ్రిని చంపిన భారతీయ యువకుడు - మతపరమైన బాధ్యత తీర్చాడట - ఇలా ఉన్నారేంటి?
అమెరికాలో తండ్రిని చంపిన భారతీయ యువకుడు - మతపరమైన బాధ్యత తీర్చాడట - ఇలా ఉన్నారేంటి?
Embed widget