By: ABP Desam | Updated at : 27 Nov 2022 07:55 AM (IST)
Edited By: omeprakash
KNRUHS - ఎంబీబీఎస్, బీడీఎస్ వెబ్ ఆప్షన్లు
బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నవంబరు 27, 28వ తేదీల్లో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. ఈ మేరకు హెల్త్ యూనివర్సిటీ నవంబరు 26న రెండో విడత ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ కాళాశాలల్లోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్ధులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. కళాశాల వారీగా సీట్ల ఖాళీల వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. నవంబరు 27న ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 28న సోమవారం సాయంత్రం 4 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఒకప్రకటనలో కోరారు.
ఎంబీబీఎస్ రెండో విడత ప్రవేశాలు, 28 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశం
ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నవంబరు 26న వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభమైన సంగతి తెలిసిందే. నవంబరు 26 నుంచి 28 వరకు వెబ్‌ఆప్షన్లు నిర్వహించనున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. ఈ మేరకు హెల్త్ యూనివర్సిటీ శనివారం రెండో విడత ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కాళోజీ విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్దులు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. కళాశాలలోని కన్వీనర్ కోటా సీట్ల ఖాళీల వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. నవంబరు 28న మధ్యాహ్నం 1 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్‌ఆపన్లు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది.
Also Read:
వెబ్‌సైట్‌లో ఓయూ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లు, పరీక్ష షెడ్యూలు ఇదే!
ఉస్మానియా వర్సిటీ పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షల హాల్‌టికెట్లు అందబాటులోకి వచ్చాయి. ఉస్మానియా యూనివర్సిటీ పరీక్ష హాల్‌టికెట్లను నవంబరు 26న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. పీహెచ్‌డీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ, ప్రవేశ పరీక్ష సబ్జెక్టు వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
పరీక్షల హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..
డిసెంబరు 1 నుంచి పరీక్షలు..
ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం డిసెంబర్ 1 నుంచి 3 వరకు పీహెచ్‌డీ పరీక్షలు నిర్వహించనున్నారు. తొలిసారి ఆన్‌లైన్‌లో పీహెచ్‌డీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో మూడు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహించనున్నారు. మొదటి సెషనల్‌లో ఉదయం 9.30 - 11.00 గంటల వరకు, రెండో సెషన్‌లో మధ్యాహ్నం 12.30 - 2.00 గంటల వరకు, మూడో సెషన్‌లో మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
పరీక్ష విధానం, షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
FAPCCI: ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సు, వివరాలివే!
ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫ్యాప్సి) ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంపై ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సును నిర్వహిస్తోంది. డిసెంబరు 1 నుంచి ఆన్‌లైన్ కోర్సులు ప్రారంభించనున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫ్యాప్సీ) ఆధ్వర్యంలో ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్‌పై 10 రోజులపాటు ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సును నిర్వహించనున్నారు.డిసెంబర్ 1 నుండి 12 వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. శిక్షణ పూర్తైన తర్వాత అభ్యర్థులకు ఫ్యాప్సీ సర్టిఫికేట్ అందజేస్తారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 9182927627, 9391422821 నెంబర్లలో సంప్రదించవచ్చు.
కోర్సు పూర్తి వివరాలు, అర్హతల కోసం క్లిక్ చేయండి..
TTWREIS Admissions: తెలంగాణ ఎస్టీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు, నోటిఫికేషన్ వెల్లడి! వివరాలివే!
సంపన్నులు చదువుకునే స్కూళ్లలో కూడా ఇటువంటి ట్యాబ్ లు లేవు, విద్యార్థులకు క్లాస్ తీసుకున్న ప్రవీణ్ ప్రకాష్
Indian Navy B.Tech Course: నేవీలో ఉచితంగా 'ఇంజినీరింగ్' విద్య, ఆపై ఉన్నత హోదా ఉద్యోగం!
KNRUHS: ఎండీ హోమియో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు, చివరితేది ఎప్పుడంటే?
TS Teachers Transfers: నేడు ఉపాధ్యాయ ఖాళీలు, సీనియారిటీ జాబితా వెల్లడి!
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
CCL 2023: మూడేళ్ల తర్వాత జరగనున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ - క్రికెటర్లుగా మారనున్న హీరోలు!
Jagan To Delhi : అమరావతిలోనే సీఎం జగన్ -మరి టూర్లు ఎందుకు క్యాన్సిల్ ? ఢిల్లీకి ఎప్పుడు ?
Australian Open 2023: చరిత్ర సృష్టించిన సబలెంకా - మొదటి గ్రాండ్స్లామ్ విజేతగా నిలిచిన బెలారస్ ప్లేయర్!