FAPCCI: ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సు, వివరాలివే!
ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫ్యాప్సీ) ఆధ్వర్యంలో ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్‌పై ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సు నిర్వహించనున్నారు.

ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫ్యాప్సి) ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంపై ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సును నిర్వహిస్తోంది. డిసెంబరు 1 నుంచి ఆన్‌లైన్ కోర్సులు ప్రారంభించనున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫ్యాప్సీ) ఆధ్వర్యంలో ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్‌పై 10 రోజులపాటు ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సును నిర్వహించనున్నారు.
డిసెంబర్ 1 నుండి 12 వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. శిక్షణ పూర్తైన తర్వాత అభ్యర్థులకు ఫ్యాప్సీ సర్టిఫికేట్ అందజేస్తారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 9182927627, 9391422821 నెంబర్లలో సంప్రదించవచ్చు.
ఎవరు అర్హులు..?
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మరింత నైపుణ్యవంతులను చేసే ఉద్దేశంతో ఈ ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సును రూపొందించారు. ఈ ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సులో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, మహిళలు, యువతీ, యువకులు చేరవచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్‌లో తయారీ రంగంలో, సేవా సంస్థలు, ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈలను స్థాపించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. బ్యాంకింగ్ రంగంలోని ఎంఎస్‌ఎంఈ విభాగానికి చెందిన నిపుణులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ప్రాక్టీస్ చేస్తున్న లీగల్ ఇంప్లిమెంటర్లు, మార్కెటింగ్ నిపుణులు, ప్రభుత్వ అధికారులు తమ నిజ జీవిత అనుభవాలను ట్రైనీలతో పంచుకోవడంతో పాటు సలహాలు, సూచనలు ఇస్తారు.
నిపుణల పర్యవేక్షణ..
వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులకు విలువలను జోడించడం ద్వారా పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి అవసరమైన అన్ని విషయాలను నిపుణులు వివరిస్తారు. భవిష్యత్ వ్యాపార ప్రణాళికలను అవసరమైన అవగాహనతోపాటు నిపుణులతో నేరుగా చర్చించడానికి అవకాశం కల్పిస్తారు. ఈ కార్యక్రమం మార్కెట్‌ను గుర్తించే పద్ధతులు, ముడి పదార్థాల సేకరణ, ప్రాజెక్ట్ నివేదిక తయారీ, బ్యాంకు నుండి రుణాలు, ప్యాకేజింగ్ బ్రాండింగ్, చట్టపరమైన అంశాలు, ఫ్యాప్సీ లైసెన్స్ రిజిస్ట్రేష్రన్ సిస్టమ్, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీలు సేవలు, ఎగుమతి అవకాశాలు, పథకాలు, విధానాలు, ప్రమాద నిర్వహణ వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు.
ముఖ్యమైన తేదీలు...
🔰 కోర్సు ప్రారంభం: 01.12.2022.
🔰 కోర్సు ముగింపు: 12.12.2022.
సంప్రదించాల్సిన నెంబర్లు-ఈమెయిల్: 9182927627, jeevan@fapcci.in; 9391422821, srikanth@fapcci.in
Also Read:
ట్రిపుల్‌ఐటీ 'ఫేజ్-4' ఎంపిక జాబితా విడుదల, కౌన్సెలింగ్ ఎప్పుడంటే?
ఏపీలో రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో ప్రవేశానికి సంబంధించి 'ఫేజ్-3' కౌన్సెలింగ్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా నవంబర్ 23న విడుదలైంది. అధికారిక వెబ్‌సైట్‌లో కేటగిరీలవారీగా ఎంపిక జాబితాలను అందుబాటులో ఉంచారు. వీటిలో అన్ని (జనరల్, ఓహెచ్, క్యాప్, ఎన్‌సీసీ) కేటగిరీల కింద మొత్తం 125 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో ఈడబ్ల్యూఎస్ కోటాతో కలిపి 4,400 సీట్లు ఉండగా.. 44,208 మంది దరఖాస్తు చేశారు. నాలుగు క్యాంపస్‌లలో ఖాళీగా ఉన్న 125 సీట్ల భర్తీకి నవంబరు 27న నూజివీడు ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
ఎంపికజాబితా, కౌన్సెలింగ్ వివరాల కోసం క్లిక్ చేయండి..
Skill Hubs in AP: నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్, త్వరలో 176 స్కిల్ హబ్‌లు అందుబాటులోకి!
ఏపీలోని విద్యార్థులకు ప్రభుత్వ గుడ్ న్యూస్ తెలిపింది. ఉన్నత చదువులు అభ్యసించి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువకులకు మరిన్ని నైపుణ్యాలు అభివృద్ధి చేసుకునేందుకు వీలుగా స్కిల్ హబ్‌లను ఏర్పాటుచేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని స్కిల్ హబ్‌లు ప్రారంభం కాగా.. మిగిలిన వాటిని కూడా ఈ సంక్రాంతి కల్లా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

