అన్వేషించండి

TS ICET 2024: నేడు, రేపు తెలంగాణ ఐసెట్- 2024 ప్రవేశ పరీక్ష, నిమిషం ఆలస్యమైనా 'నో' ఎంట్రీ!

TG ICET 2024: తెలంగాణలో జూన్ 5, 6 తేదీల్లో ఐసెట్-2024 ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. ఈసారి ఐసెట్ ప్రవేశ పరీక్షకు 80వేలకుపైగా అభ్యర్థులు హాజరుకానున్నారు.

TG ICET 2024: తెలంగాణలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి జూన్ 5, 6 తేదీల్లో టీజీఐసెట్-2024 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఐసెట్ పరీక్ష కోసం ఎన్నడూ లేనివిధంగా రికార్డుస్థాయిలో ఈసారి దరఖాస్తులు రావడం విశేషం. ఐసెట్ పరీక్ష కోసం మొత్తం 84,750 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది 75,520 దరఖాస్తులు రాగా.. ఈసారి 9,230 దరఖాస్తులు అధికంగా వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 20 ప్రాంతీయ కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. పరీక్ష సమయానికి గంటన్నర ముందునుంచే అభ్యర్థులను లోపలికి పంపిస్తారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఫొటో గుర్తింపుకార్డును తీసుకెళ్లాల్సి ఉంటుంది. పరీక్షకు సంబంధించిన మరిన్న నిబంధనల కోసం హాల్‌టికెట్ వెనుకభాగంలో చదువుకోవచ్చు.

ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 5, 6 తేదీల్లో రెండు సెషన్లలో టీఎస్ ఐసెట్-2023 పరీక్ష నిర్వహించనున్నారు. జూన్ 5న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో, జూన్ 6న మొదటి సెషన్‌లో మాత్రమే ఆన్‌లైన్ విధానంలో ఐసెట్ పరీక్ష నిర్వహిస్తారు. జూన్ 15న ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. ఆన్సర్ కీపై జూన్ 16 నుంచి 19న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. జూన్ 28న ఫైనల్ కీతో పాటు ఫలితాలను విడుదల చేయనున్నారు.

తెలంగాణలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌ ఐసెట్‌ పరీక్ష హాల్‌టికెట్లను తెలంగాణ ఉన్నత విద్యామండలి మే 31న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఐసెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేది, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్‌టికెట్ నెంబరు వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం ఐసెట్ నిర్వహణ బాధ్యతను చేపట్టిన సంగతి తెలిసిందే. 

ఐసెట్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

పరీక్ష విధానం: 
మొత్తం 200 మార్కులకు ఐసెట్ ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు. పరీక్షలో మూడు సెక్షన్లు (సెక్షన్-ఎ, బి, సి) ఉంటాయి. వీటిలో సెక్షన్-ఎ: అనలిటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-బి: మ్యాథమెటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-సి: కమ్యూనికేషన్  ఎబిలిటీ-50 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి.

పరీక్ష కేంద్రాలు: ఐసెట్ పరీక్ష నిర్వహణ కోసం తెలంగాణలో 16, ఏపీలో 4 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇందులో తెలంగాణకు సంబంధించి.. హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇక ఏపీలో కర్నూలు, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాల్లో ఐసెట్ పరీక్ష నిర్వహించనున్నారు.

అర్హత మార్కులు..
ఐసెట్ పరీక్షలో కనీస అర్హత మార్కులను 25 శాతంగా నిర్ణయించారు. అంటే 200 మార్కులకుగాను 50 మార్కులను అర్హతగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి అర్హత మార్కులు లేవు.  

Notification

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Chairman: టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకం, కొత్త పాలకమండలి సభ్యులు వీరే
టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకం, కొత్త పాలకమండలి సభ్యులు వీరే
Telangana Group 3 : తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇదిగో
తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇదిగో
Mayonnaise Ban: స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కు బిగ్ షాక్, మయోనైజ్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం
స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కు బిగ్ షాక్, మయోనైజ్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం
Jai Hanuman First Look : 'జై హనుమాన్' నుంచి దివాళి బ్లాస్ట్ వచ్చేసింది... 'హనుమాన్'గా 'కాంతారా' స్టార్ లుక్ అదుర్స్
'జై హనుమాన్' నుంచి దివాళి బ్లాస్ట్ వచ్చేసింది... 'హనుమాన్'గా 'కాంతారా' స్టార్ లుక్ అదుర్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బిర్యానీ తెప్పించాలన్న బోరుగడ్డ - జడ్జి స్ట్రాంగ్ కౌంటర్‌తో సైలెంట్SS Rajamouli Lion Update | వైల్డ్ సఫారీ ఫోటోలతో హింట్స్ ఇస్తున్న రాజమౌళి | ABP Desamవివాదంలో సాయి పల్లవి, పాత వీడియో తీసి విపరీతంగా ట్రోల్రతన్‌ టాటా వీలునామాలో శంతను పేరు, ఏమిచ్చారంటే?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Chairman: టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకం, కొత్త పాలకమండలి సభ్యులు వీరే
టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకం, కొత్త పాలకమండలి సభ్యులు వీరే
Telangana Group 3 : తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇదిగో
తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇదిగో
Mayonnaise Ban: స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కు బిగ్ షాక్, మయోనైజ్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం
స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కు బిగ్ షాక్, మయోనైజ్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం
Jai Hanuman First Look : 'జై హనుమాన్' నుంచి దివాళి బ్లాస్ట్ వచ్చేసింది... 'హనుమాన్'గా 'కాంతారా' స్టార్ లుక్ అదుర్స్
'జై హనుమాన్' నుంచి దివాళి బ్లాస్ట్ వచ్చేసింది... 'హనుమాన్'గా 'కాంతారా' స్టార్ లుక్ అదుర్స్
Babies Health : చలికాలంలో పిల్లలను ఇలా జాగ్రత్తగా కాపాడుకోండి.. ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు
చలికాలంలో పిల్లలను ఇలా జాగ్రత్తగా కాపాడుకోండి.. ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు
Harish Rao Chit Chat: రేవంత్ కుర్చీ కిందే బాంబు - పాదయాత్రకు డేటు, టైం చెప్పు - రేవంత్‌కు హరీష్ సవాల్
రేవంత్ కుర్చీ కిందే బాంబు - పాదయాత్రకు డేటు, టైం చెప్పు - రేవంత్‌కు హరీష్ సవాల్
New Kia Carnival Sales: ఆకాశాన్నంటే ధర - అయినా అవుట్ ఆఫ్ స్టాక్ - మార్కెట్లో ఈ కియా కారుకు సూపర్ డిమాండ్‌!
ఆకాశాన్నంటే ధర - అయినా అవుట్ ఆఫ్ స్టాక్ - మార్కెట్లో ఈ కియా కారుకు సూపర్ డిమాండ్‌!
YSRCP: విజయమ్మ ఇచ్చిన షాక్‌తో వైసీపీలో డైలమా - ఎలా స్పందించాలో అర్థం కాని నేతలు ! సైలెంట్
విజయమ్మ ఇచ్చిన షాక్‌తో వైసీపీలో డైలమా - ఎలా స్పందించాలో అర్థం కాని నేతలు ! సైలెంట్
Embed widget