By: ABP Desam | Updated at : 26 Sep 2023 02:55 PM (IST)
Edited By: omeprakash
జేఎన్‌టీయూహెచ్ పీజీ ప్రవేశాలు
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ(జేఎన్‌టీయూహెచ్)- ఫుల్‌టైమ్ ఎంటెక్, ఎంఫార్మసీ రెగ్యులర్ ప్రోగ్రామ్‌లలో స్పాన్సర్డ్ కేటగిరీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్, జగిత్యాల, సుల్తాన్‌పూర్‌లోని జేఎన్‌టీయూహెచ్ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులకు అక్టోబరు 4-6 వరకు కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు.
వివరాలు..
* ఫుల్‌టైమ్ ఎంటెక్, ఎంఫార్మసీ రెగ్యులర్ కోర్సులు
సీట్ల సంఖ్య: 228.
విభాగాలు: ఈఈఈ, మెకానికల్, ఎనర్జీ సిస్టమ్స్, బయో-టెక్నాలజీ, కెమికల్, మెటలర్జికల్, సీఎస్‌ఈ, ఐటీ, ఈసీఈ, ఫార్మసీ, నానో టెక్నాలజీ, సివిల్, ఎన్విరాన్‌మెంట్, స్పేషియల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వాటర్ రిసోర్సెస్.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ, బీఫార్మసీ ఉత్తీర్ణతతో పాటు అకడమిక్ సంస్థలు/ పరిశ్రమలు/ రిసెర్చ్ యూనిట్లలో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి. గేట్/ జీప్యాట్/ టీఎస్ పీజీఈసెట్-2023లో అర్హత సాధించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో.
ఎంపిక విధానం: కౌన్సెలింగ్ ద్వారా. విద్యార్హత, గేట్/ జీప్యాట్/ టీఎస్ పీజీఈసెట్-2023 ర్యాంకు ఆధారంగా ఎంపికచేస్తారు.
కౌన్సెలింగ్ షెడ్యూల్ తేదీలు: 04.10.2023, 05.10.2023, 06.10.2023.
Notification & Application:
ALSO READ:
వరంగల్ నిట్‌లో బీఎస్సీ- బీఈడీ ఇంటిగ్రేటెడ్ కోర్సు, అర్హతలివే
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) 2023-24 విద్యాసంవత్సరానికిగాను నాలుగేళ్ల బీఎస్సీ-బీఈడీ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. బీఎస్సీ, బీఈడీ మిళితం చేసే ఇంటిగ్రేటెడ్ పాఠ్యాంశాలు కోర్సులో ఉంటాయి. అక్టోబర్‌లో కోర్సు ప్రారంభం కానుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీలో ప్రవేశాలకు 27 నుంచి వెబ్ ఆప్షన్లు
ఏపీలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి పలు కోర్సుల్లో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు సెప్టెంబరు 27 నుంచి వెబ్ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పంచారు. విద్యార్థులు సెప్టెంబరు 27 నుంచి 30 వరకు మొదటి విడత వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్స ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబరు 5 నుంచి 7 వరకు సంబంధిత కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. యూనివర్సిటీ పరిధిలో బీఎస్సీ అగ్రికల్చర్‌లో 1062 సీట్లు, బీటెక్ ఫుడ్ టెక్నాలజీలో 55 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మేనేజ్‌లో పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ కోర్సు, వివరాలు ఇలా
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్(మేనేజ్) పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్(అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్) కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఈ కోర్సు వ్యవధి రెండేళ్లు. సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. రూ.1200. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది.అభ్యర్థులు డిసెంబరు 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. క్యాట్-2023 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఎస్సే రైటింగ్, అకడమిక్ రికార్డ్, పర్సనల్ ఇంటర్వ్యూ, పని అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో మాస్టర్ డిగ్రీ కోర్సు, వివరాలు ఇలా
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ) 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల మాస్టర్ ఆఫ్ డిజైన్(బీడిజైన్) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అహ్మదాబాద్, బెంగళూరు, గాంధీనగర్‌లో ఉన్న ఎన్‌ఐడీ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 1లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
AP Tenth: 'టెన్త్' విద్యార్థులకు అలర్ట్, వివరాల్లో తప్పులుంటే మార్చుకోవచ్చు!
TS SET: టీఎస్ సెట్ - 2023 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డుల డౌన్లోడ్ లింక్ ఇదే
GATE Schedule: గేట్ - 2024 పరీక్షల షెడ్యూల్ విడుదల, పేపర్లవారీగా తేదీలివే
CPGET: పీజీ సీట్లు సగానికి పైగా ఖాళీ, అయినా ప్రవేశాలు గతేడాది కంటే ఎక్కువే!
AP Inter Fees: ‘ఇంటర్’ పరీక్ష ఫీజు చెల్లించడానికి నేడే ఆఖరు, ఆలస్య రుసుముతో ఎప్పటివరకు అవకాశమంటే?
Revanth Reddy Resigns: రేవంత్ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్ లెటర్ అందజేత
KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం
Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!
Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే
/body>