అన్వేషించండి

APECET 2024 Notification: ఏపీఈసెట్ నోటిఫికేషన్ విడుదల - దరఖాస్తు, పరీక్ష తేదీలివే

ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజినీరింగ్ కళాశాలల్లో రెండో సంవత్సరం లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈసెట్-2024 నోటిఫికేషన్‌ మార్చి 14న విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ మార్చి 15 నుంచి ప్రారంభంకానుంది.

AP ECET 2024 Notification: ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజినీరింగ్ కళాశాలల్లో రెండో సంవత్సరం లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈసెట్-2024 నోటిఫికేషన్‌ మార్చి 14న విడుదలైంది. ఈసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ మార్చి 15 నుంచి ప్రారంభంకానుంది. ఎలాంటి దరఖాస్తు రుసుము లేకుండా ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 8న ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.  ఈ ఏడాది జేఎన్‌టీయూ అనంతపురం ఈసెట్ పరీక్ష నిర్వహణ బాధ్యతను చేపట్టింది. ఈసెట్ కన్వీనర్‌గా యూనివర్సిటీ సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ పి. ఆర్. భానుమూర్తి వ్యవహరిస్తున్నారు.

పాలిటెక్నిక్ డిప్లొమా (ఇంజినీరింగ్), బీఎస్సీ (మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణత ఉన్నవారు ఈసెట్ పరీక్ష రాయడానికి అర్హులు. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు. రిజిస్ట్రేషన్ ఫీజుగా ఓసీ అభ్యర్థులు రూ.600; బీసీ అభ్యర్థులు రూ.550; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థుల నుంచి రూ.500 ఆలస్యరుసుముతో  ఏప్రిల్ 30 వరకు, రూ.1000 ఆలస్యరుసుముతో  మే 5 వరకు, రూ.5000 ఆలస్యరుసుముతో  మే 10 వరకు, రూ.10,000 ఆలస్యరుసుముతో  మే 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

వివరాలు..

* ఏపీఈసెట్ - 2024

కోర్సులు: బీటెక్, బీఫార్మసీ.

అర్హత: పాలిటెక్నిక్ డిప్లొమా (ఇంజినీరింగ్), బీఎస్సీ (మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు.

దరఖాస్తు ఫీజు: రిజిస్ట్రేషన్ ఫీజుగా ఓసీ అభ్యర్థులు రూ.600; బీసీ అభ్యర్థులు రూ.550; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రవేశపరీక్షలో ర్యాంకు ఆధారంగా. 

పరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకుగాను ఈసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 200 ఆబ్జె్క్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నల తీరు ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఎస్సీ (మ్యాథ్స్) విభాగాలకు వేర్వేరుగా ఉంటాయి. 

ముఖ్యమైన తేదీలు...

➥ నోటిఫికేషన్ వెల్లడి: 14.03.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.03.2024. 

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.04.2024.

➥ రూ.500 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 22.04.2024.

➥ రూ.2000 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 29.04.2024.

➥ రూ.5000 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 02.05.2024.  

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం:  25.04.2024 - 27.04.2024. 

➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 01.05.2024. 

➥ పరీక్ష తేది: 08.05.2024. 

పరీక్షసమయం: ఉ.9 గం.- మ. 12 గం. వరకు, మ.2.30 గం.-సా.5.30 గం. వరకు.

➥ ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదల: 10.05.2024. 

➥ ప్రిలిమినరీ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 12.05.2024 వరకు. 

APECET 2024 Details

Website

APECET 2024 Notification: ఏపీఈసెట్ నోటిఫికేషన్ విడుదల - దరఖాస్తు, పరీక్ష తేదీలివే

ALSO READ:

ఏపీ ఐసెట్-2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్‌లోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సు‌ల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఐసెట్-2024 నోటిఫికేషన్ మార్చి 3న వెలువడిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 6న ప్రారంభమైంది. విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 7 వరకు దరఖాస్తు చేసుకోచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.650 చెల్లించాలి. బీసీ అభ్యర్థులు రూ.600; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.550 చెల్లించాల్సి ఉంటుంది. రూ.1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 8 నుంచి 12 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 13 నుంచి 17 వరకు, రూ.3000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 18 నుంచి 22 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అలాగే రూ.5000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 23 నుంచి 27 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇక దరఖాస్తు వివరాల్లో తప్పులుంటే సరిదిద్దుకునేందుకు ఏప్రిల్ 28, 29 తేదీల్లో అవకాశం కల్పించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 6, 7 తేదీల్లో ఐసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఐసెట్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను మే 2 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. 
ఐసెట్ దరఖాస్తు, పరీక్ష విధానం కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu: చంద్రబాబు అన్ని కార్యక్రమాలు రద్దు, ఢిల్లీ నుంచి హుటాహుటీన హైదరాబాద్‌కు పయనం
Chandrababu: చంద్రబాబు అన్ని కార్యక్రమాలు రద్దు, ఢిల్లీ నుంచి హుటాహుటీన హైదరాబాద్‌కు పయనం
Anurag Kulkarni - Ramya Behara Wedding: సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
Mike Tyson vs Jake Paul Boxing Result: మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu: చంద్రబాబు అన్ని కార్యక్రమాలు రద్దు, ఢిల్లీ నుంచి హుటాహుటీన హైదరాబాద్‌కు పయనం
Chandrababu: చంద్రబాబు అన్ని కార్యక్రమాలు రద్దు, ఢిల్లీ నుంచి హుటాహుటీన హైదరాబాద్‌కు పయనం
Anurag Kulkarni - Ramya Behara Wedding: సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
Mike Tyson vs Jake Paul Boxing Result: మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?
Andhra Loan Politics: అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
అప్పులపై చంద్రబాబు, జగన్ తలో వాదన - అసెంబ్లీలో తేల్చుకునేందుకు ప్రతిపక్ష నేత వస్తారా ?
Pawan Kalyan - Rana Daggubati: పవన్ కల్యాణ్ రారు... అభిమానులకు షాక్ ఇచ్చిన రానా దగ్గుబాటి స్టేట్మెంట్
పవన్ కల్యాణ్ రారు... అభిమానులకు షాక్ ఇచ్చిన రానా దగ్గుబాటి స్టేట్మెంట్
India vs Canada: కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Embed widget