JEE Main 2024: జేఈఈ మెయిన్ 2024 పేపర్-1 అడ్మిట్‌కార్డు విడుదల, పరీక్ష వివరాలు ఇలా
జేఈఈ మెయిన్-2024 మొదటి విడత పరీక్షకు సంబంధించి పేపర్-1 అడ్మిట్‌కార్డులను 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)' విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచింది.
JEE Main 2024 Paper 1 Exam Admitcard: జేఈఈ మెయిన్-2024 మొదటి విడత పరీక్షకు సంబంధించి పేపర్-1 అడ్మిట్‌కార్డులను 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)' విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇటీవలే పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్స్‌ను ఎన్టీఏ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పేపర్-1 పరీక్ష అడ్మిట్ కార్డులను విడుదల చేసింది.
జేఈఈ మెయిన్ పరీక్షలకు ఈ ఏడాది 12 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 2.4 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. తెలంగాణలో 11 కేంద్రాల్లో పరీక్షలు నిర్వ హించనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్‌లో పరీక్షలు జరుగనున్నాయి. ఇక ఏపీలోని ప్రధాన నగరాల్లో 30 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జేఈఈ మెయిన్ పేపర్-1 పరీక్షలను జనవరి 27, 29, 30, 31 తేదీల్లో నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్ష నిర్వహిచనున్నారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే 011-40759000/011-69227700 ఫోన్ నెంబర్లు లేదా ఈమెయిల్: jeemain@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చు. తెలుగుతోపాటు ఇంగ్లిష్, హిందీ సహా మొత్తం 13 భాషల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలను 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 మధ్య నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 12న ఫలితాలను విడుదల చేస్తారు.
JEE Main 2024 పేపర్-2 అడ్మిట్‌కార్డుల కోసం క్లిక్ చేయండి..
పరీక్ష విధానం..
➥ పేపర్-1 (బీటెక్, బీఈ) ఇలా..
బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పేపర్‌ను మొత్తం 90 మార్కులకు నిర్వహిస్తారు. మూడు సబ్జెక్ట్‌లలో రెండు సెక్షన్లుగా నిర్వహిస్తారు. ఒక్కో సబ్జెక్టు నుంచి 30 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో మ్యాథమెటిక్స్ నుంచి 30 ప్రశ్నలు (సెక్షన్-ఎ 20 ప్రశ్నలు, సెక్షన్-ఎ 10 ప్రశ్నలు), ఫిజిక్స్ నుంచి 30 ప్రశ్నలు (సెక్షన్-ఎ 20 ప్రశ్నలు, సెక్షన్-ఎ 10 ప్రశ్నలు), కెమిస్ట్రీ నుంచి 30 ప్రశ్నలు (సెక్షన్-ఎ 20 ప్రశ్నలు, సెక్షన్-ఎ 10 ప్రశ్నలు) ఉంటాయి. సెక్షన్-ఎ పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతో(ఎంసీక్యూలతో) ఉంటుంది. సెక్షన్-బిలో న్యూమరికల్ వాల్యూ ఆధారిత ప్రశ్నలుంటాయి.సెక్షన్-బిలో 10 ప్రశ్నల్లో అయిదు ప్రశ్నలకు సమాధానం ఇస్తే సరిపోతుంది. 0.25 శాతం నెగెటివ్ మార్కింగ్ నిబంధన ఉంది.
తెలంగాణలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్.
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలు(IITs), ఎన్‌ఐటీలు(NITs), ట్రిపుల్ ఐటీలు (IIITs), కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ప్రవేశాలకోసం జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. మొదటి విడత పరీక్షలను జనవరి 24న పేపర్-2 పరీక్ష నిర్వహించారు. ఇక పేపర్-1 పరీక్షలను జనవరి 27 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించనున్నారు.
జేఈఈ మెయిన్(JEE Main)-2024 తొలి విడత పరీక్షకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు అందాయి. దరఖాస్తు గడువు ముగిసే సమయానికి మొత్తం 12.30 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాదితో పోల్చితే ఈ సంఖ్య 3.70 లక్షలు అధికంగా ఉండటం విశేషం. ఈ సారి అత్యధిక దరఖాస్తుల్లో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక రెండు, మూడు స్థానాల్లో వరుసగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నిలిచాయి. మహారాష్ట్ర నుంచి 1.60 లక్షల మంది, ఏపీ నుంచి 1.30 లక్షలు, తెలంగాణ నుంచి 1.20 లక్షల మంది పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. జేఈఈ మెయిన్ ర్యాంకులతో ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో చేరొచ్చు. బీటెక్ సీట్ల కోసం మెయిన్‌లో పేపర్-1, బీఆర్క్, బీ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి పేపర్-2 రాయాల్సి ఉంటుంది.