జూన్ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్, దరఖాస్తుకు చివరితేది ఎప్పుడంటే?
దేశవ్యాప్తంగా జూన్ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మే 7 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2023 పరీక్ష షెడ్యూలు ఏప్రిల్ 30న ప్రారంభమైన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా జూన్ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మే 7 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను ఐఐటీ గువాహటి నిర్వహించనుంది. జేఈఈ మెయిన్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన 2.5 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధిస్తారు. దీని ఫలితాల ఆధారంగా ఐఐటీల్లో నాలుగేళ్ల బీటెక్, బీఎస్, బీఆర్క్, ఐదేళ్ల డ్యూయల్ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
రెండు పరీక్షలకు హాజరుకావాల్సిందే..!
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో భాగంగా జూన్ 4న ఉదయం, మధ్యాహ్నం నిర్వహించే రెండు పరీక్షలకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుంది. ఈ రెండు పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలనే ప్రకటిస్తారు. రాష్ట్రంలో ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్ష రాసేందుకు కనీసం 8 పట్టణాలను ఎంపిక చేసుకొనే వెసులుబాటు ఉంది.
ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్..
బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ) రాయాల్సి ఉంటుంది. వారణాసి, ఖరగ్‌పూర్, రూర్కీల్లోని ఐఐటీల్లో బీఆర్క్ (ఆర్కిటెక్చర్)కోర్సులను నిర్వహిస్తున్నారు. జూన్ 18,19న జేఈఈ అడ్వాన్స్‌డ్ వెబ్‌సైట్ ద్వారా ఏఏటీ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 21న ఏఏటీ పరీక్ష నిర్వహించి, జూన్ 24న ఫలితాలను ప్రకటించనున్నారు.
ముఖ్యమైన తేదీలు...
Also Read:
సీమ్యాట్-2023 అడ్మిట్ కార్డులు విడుదల, పరీక్ష వివరాలు ఇలా!
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్(సీమ్యాట్) అడ్మిట్ కార్డులను మే 1న విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచారు. సీమ్యాట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేది వివరాలు, సెక్యూరిటీ పిన్ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సీమ్యాట్ ప్రవేశ పరీక్షను కంప్యూటర్ ఆధారిత విధానంలో మే 4న రెండు షిఫ్ట్‌లలో నిర్వహించనున్నారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఉంటుంది.
సీమ్యాట్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..
విద్యార్థులకు అలర్ట్ - ఆన్‍లైన్‍లో ఇంటర్ మెమోలు, ఇలా డౌన్‍లోడ్ చేసుకోండి!
ఏపీలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 26న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా మెమోలను అందిస్తున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డ్ తెలిపింది. ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కలర్ మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ మెమోలతో ఉన్నతవిద్యలో ప్రవేశాలు పొందవచ్చని ఇంటర్ బోర్డు సూచించింది. ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు. ఫలితాలు విడుదలైన రోజు విద్యార్థుల మార్కుల జాబితాలను మాత్రమే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. తాజాగా మెమోలను అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి మెమో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇంటర్ మెమోల కోసం క్లిక్ చేయండి..