JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ప్రారంభం, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది రాస్తున్నారంటే?
దేశంలోని 23 ఐఐటీల్లో వచ్చే విద్యా సంవత్సరం (2023-24) బీటెక్ సీట్ల భర్తీకి సంబంధించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఆదివారం (జూన్ 4) ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 35 వేల మంది హాజరు..
దేశంలోని 23 ఐఐటీల్లో వచ్చే విద్యా సంవత్సరం (2023-24) బీటెక్ సీట్ల భర్తీకి సంబంధించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఆదివారం (జూన్ 4) ప్రారంభమైంది. జేఈఈ మెయిన్‌లో కటాఫ్ మార్కులు పొంది ఉత్తీర్ణులైన 2.50 లక్షల మంది అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయడానికి అర్హులు కాగా...వారిలో సుమారు 1.90 లక్షల మందే పోటీపడనున్నారు. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 35 వేల మంది ఉంటారని అంచనా. ఆన్‌లైన్ విధానంలో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుపుతారు. రెండు పేపర్లు రాసిన వారిని మాత్రమే ర్యాంకింగ్‌కు పరిగణనలోకి తీసుకుంటారు.
తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, ఆదిలాబాద్, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్‌లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏపీలో ఏపీలో అమలాపురం, అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుడ్లవల్లేరు, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మార్కాపురం, మైలవరం, నర్సరావుపేట, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, సూరంపాలెం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు.
ప్రిలిమినరీ ఆన్సర్ కీని జూన్ 11న విడుదల చేయనున్నారు. అభ్యర్థుల నుంచి జూన్ 12 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఆపై జూన్ 18న జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలను విడుదల చేయనున్నారు.
జేఈఈ అడ్వా్న్స్‌డ్ పరీక్ష ఫలితాలను జూన్ 18న వెల్లడించనున్నారు. అడ్వాన్స్‌డ్ ర్యాంకు ఆధారంగా ఐఐటీలే కాకుండా దేశవ్యాప్తంగా మరికొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రవేశాలు కల్పిస్తాయి. గత విద్యా సంవత్సరం (2022-23) అన్ని ఐఐటీల్లో 16,598 సీట్లు అందుబాటులో ఉండగా...ఈసారి మరో 200 వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. సుమారు 42 వేల మందిని జోసా కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అర్హత కల్పిస్తారు.
రెండు పరీక్షలకు హాజరుకావాల్సిందే..!
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో భాగంగా జూన్ 4న ఉదయం, మధ్యాహ్నం నిర్వహించే రెండు పరీక్షలకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుంది. ఈ రెండు పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలనే ప్రకటిస్తారు. రాష్ట్రంలో ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్ష రాసేందుకు కనీసం 8 పట్టణాలను ఎంపిక చేసుకొనే వెసులుబాటు ఉంది.
ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్..
బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ) రాయాల్సి ఉంటుంది. వారణాసి, ఖరగ్‌పూర్, రూర్కీల్లోని ఐఐటీల్లో బీఆర్క్ (ఆర్కిటెక్చర్)కోర్సులను నిర్వహిస్తున్నారు. జూన్ 18,19న జేఈఈ అడ్వాన్స్‌డ్ వెబ్‌సైట్ ద్వారా ఏఏటీ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 21న ఏఏటీ పరీక్ష నిర్వహించి, జూన్ 24న ఫలితాలను ప్రకటించనున్నారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ సిలబస్‌లో మార్పులు..
జాయింట్ అడ్మిషన్స్ బాడీ(JAB) సిలబస్‌లో కొత్తగా కొన్ని మార్పులు చేసింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కొత్త సిలబస్‌ను అధికారిక పోర్టల్‌లో చెక్ చేసుకోవచ్చు. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ సిలబస్‌కు కొత్తగా స్టాటిస్టిక్స్ చేర్చారు. అయితే సొల్యూషన్ ఆఫ్ ద ట్రయాంగిల్‌ను తొలగించారు. అదేవిధంగా ఫిజిక్స్ సబ్జెక్ట్ సిలబస్ నుంచి సెమీకండక్టర్స్, కమ్యూనికేషన్స్‌ను తొలగించగా, జేఈఈ మెయిన్ సిలబస్‌లోని ఫోర్స్డ్ అండ్ డ్యామ్ప్‌డ్ అసిలేషన్స్, ఈఎం వేవ్స్ అండ్ పోలరైజేషన్ వంటి టాపిక్స్‌ను కొత్తగా చేర్చారు. కెమిస్ట్రీ సిలబస్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు.
సిలబస్ మార్పుతో ప్రభావం తక్కువే..
జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సంబంధించి గతంలో సిలబస్‌లో లేని కొత్త అంశాలను విద్యార్థులు ఇప్పుడు కవర్ చేయాల్సి ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ సిలబస్‌ను పెంచినప్పటికీ ఎగ్జామ్ ఈజీగా ఉండే అవకాశం ఉంది. జేఈఈ మెయిన్ కంటే అడ్వాన్స్‌డ్ సిలబస్ తక్కువ. మెయిన్స్‌లో భాగమైన కొన్ని చాప్టర్స్‌ను అడ్వాన్స్‌డ్‌కు జోడించారు. దీంతో జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే అభ్యర్థులు జేఈఈ మెయిన్‌కు కూడా ప్రిపేర్ అయింటారు. తద్వారా సిలబస్‌లో మార్పు అనేది అభ్యర్థులపై ఎలాంటి ప్రభావం ఉండదు. అయితే ఐఐటీల్లో డిజైన్ కోర్సుల్లో చేరాలనుకుంటున్న అభ్యర్థులు కొత్త ఫార్మాట్ ఆధారంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. డిజైన్ ప్రవేశ పరీక్షలైన CEED, UCEED కోసం కొత్త పేపర్ ప్యాట్రన్, సిలబస్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఈ మార్పులు 2024 నుంచి అమల్లోకి రానున్నాయి.
డిజైన్ ఎంట్రెన్స్ టెస్ట్ ప్యాట్రన్‌లో మార్పులు..
ఈ ఎంట్రెన్స్ రెండు భాగాలుగా పార్ట్-ఎ, పార్ట్- బిగా ఉంటుంది. పార్ట్-ఎ పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇందులో మూడు భాగాలు ఉంటాయి. పార్ట్-బి: ఇందులో రెండు ప్రశ్నలు ఉంటాయి. ఒకటి డ్రాయింగ్, మరొకటి డిజైన్ ఆప్టిట్యూడ్‌పై ఉంటుంది. పార్ట్- బిలోని ప్రశ్న కంప్యూటర్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. అయితే సమాధానం రాయడం లేదా డ్రాయింగ్‌ను ఇన్విజిలేటర్ అందించిన ఆన్సర్ షీట్‌లో రాయాల్సి ఉంటుంది. కాగా, జేఈఈ అడ్వాన్స్‌డ్-2023 పరీక్ష జూన్ 4న జరగనుంది. పేపర్-1 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు జరగనుంది.
జేఈఈ అడ్వాన్స్‌డ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..