News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష, ప్రశ్నల తీరు ఇలా! ఈ సారి కటాఫ్ ఎంత ఉండొచ్చంటే?

ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి దేశవ్యాప్తంగా ఆదివారం (జూన్ 4న) నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నిబంధనల మేరకు ఎలక్ట్రానిక్స్ వస్తువులు, వాచీలను అనుమతించలేదు.

FOLLOW US: 
Share:

ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి దేశవ్యాప్తంగా ఆదివారం (జూన్ 4న) నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, తిరిగి 2.30 నుంచి 5.30 గంటల వరకు రెండు పూటలా పరీక్ష నిర్వహించారు. విద్యార్థులను ఉదయం ఏడు గంటలకే కేంద్రాల్లోకి అనుమతించారు. నిబంధనల మేరకు ఎలక్ట్రానిక్స్ వస్తువులు, వాచీలను అనుమతించలేదు. రెండు అంచెల్లో తనిఖీలు నిర్వహించారు.

ఇక జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో ప్రశ్నల తీరు గమనిస్తే.. ఈసారి కొంత కఠినంగా ఉందని నిపుణుల అభిప్రాయపడుతున్నారు. పరీక్షలో మ్యాథ్స్, కెమిస్ట్రీ ప్రశ్నలు క్లిష్టంగా ఇచ్చారు. దీంతోపాటు పరీక్షలో నెగెటివ్ మార్కులు అమలుచేస్తుండటంతో విద్యార్థులకు ర్యాంకింగ్‌ కీలకం కానుంది.  పరీక్షలో ఒక్కో పేపర్‌లో మొత్తం 51 ప్రశ్నలు ఇచ్చారు. వీటిలో ఒక్కో సబ్జెక్టు నుంచి 17 ప్రశ్నలు ఇచ్చారు. అయితే పేపర్‌-1లో మూడో సెక్షన్‌కు, పేపర్-2లో చివరి రెండు సెక్షన్లకు నెగెటివ్ మార్కులు లేవు. వీటిలో ఎక్కువగా మార్కులు తెచ్చుకున్న విద్యార్థులే ర్యాంకులో ముందుండే అవకాశం ఉంది. ఉదాహరణకు పేపర్-1లో మూడో సెక్షన్‌కు 24 మార్కులు ఇచ్చారు. ఈ విభాగానికి నెగిటివ్ మార్కులు లేవు. మిగిలిన మూడు సెక్షన్లకు ఒక్కో దానికి 12 మార్కులు మాత్రమే ఇవ్వనున్నారు. 

ప్రశ్నపత్రం మొత్తం ఎన్ని మార్కులకో విద్యార్థులకు ముందుగా తెలియకపోవడం, ఒక్కో సబ్జెక్టులో ఎన్ని సెక్షన్లు, ఎన్ని ప్రశ్నలు, ఏ సెక్షన్‌కు నెగెటివ్ మార్కులు ఉంటాయో కూడా తెలియదు. అందువల్ల అడ్వాన్స్‌డ్ పరీక్షలో విద్యార్థులకు ముందస్తూ వ్యూహాలకు అవకాశం లేకుండాపోయింది. అయితే మొత్తం 360కి 275 మార్కులు దాటితే 10 ర్యాంకుల్లోపు, 260 దాటిన వారికి 100లోపు ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. ఈసారి కటాఫ్ మార్కులు సుమారు 60గా ఉండవచ్చు.

Also Read:

ఏపీ ట్రిపుల్‌ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల, ఎంపిక ఇలా!
ఆంధ్రప్రదేశ్‌ రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలో 2023-24 విద్యాసంవత్సరానికి ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ప్రవేశాలు కోరేవారు జూన్‌ 4 నుంచి జూన్ 26న సాయంత్రం 5 గంటల్లోపు వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్ధులు రూ.300, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.200లు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అకడమిక్‌ మెరిట్, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా విద్యార్ధులకు సీటు కేటాయింపు ఉంటుంది. ఏపీ ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ఐఐఐటీ క్యాంపస్‌లలో ప్రవేశాలకు యేటా మూడు సార్లు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. 
నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..

సీబీఎస్‌ఈ 10, 12 తరగతి సప్లిమెంటరీ పరీక్షల డేట్‌ షీట్స్‌ విడుదల! 
సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ జూన్ 1న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 17 నుంచి 22 వరకు పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. జాతీయ విద్యా విధానం సిఫారసుల మేరకు ఇప్పటివరకు కంపార్ట్‌మెంట్ పరీక్ష అనే పేరును 'సప్లిమెంటరీ'గా మార్చారు. ఈ పరీక్షల్లో విద్యార్థులు తమ ప్రతిభను మెరుగుపరుచుకునేందుకు కూడా బోర్డు అవకాశం కల్పించింది. పదోతరగతి విద్యార్థులు తమ మార్కులను మెరుగుపరుచుకొనేందుకు రెండు సబ్జెక్టులను సప్లిమెంటరీలో భాగంగా రాసుకొనేందుకు వెసులు బాటు కల్పించిన బీసీసీఐ అధికారులు.. 12వ తరగతి విద్యార్థులకు ఒక సబ్జెక్టులో మాత్రమే అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జులై 17న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు 12వ తరగతి సబ్జెక్టు పరీక్షలు నిర్వహించనున్నారు.  
పరీక్షల షెడ్యూలు కోసం క్లిక్ చేయండి.. 

తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాలు ఇలా!
హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023-23 విద్యాసంవత్సరానికి దూరవిద్య కేంద్రం (CDE) ద్వారా నిర్వహించే కోర్సుల్లో ప్రవేశాలకు మే 31న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా శిల్పం, చిత్రలేఖనం, డిజైన్స్, లైబ్రరీ సైన్స్, సంగీతం, రంగస్థలం, నృత్యం, జానపదం, తెలుగు, చరిత్ర, పర్యాటకం, భాషాశాస్త్రం, జర్నలిజం, జ్యోతిష్యం, యోగా తదితర అంశాలకు సంబంధించి.. డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 05 Jun 2023 12:35 PM (IST) Tags: JEE Advanced 2023 JEE Advanced 2023 Exam Pattern JEE Advanced 2023 Exam Analysis JEE Advanced 2023 Exam Details

ఇవి కూడా చూడండి

IITTP: తిరుపతి ఐఐటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, వివరాలు ఇలా

IITTP: తిరుపతి ఐఐటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, వివరాలు ఇలా

IIAD: ఐఐఏడీ-న్యూఢిల్లీలో యూజీ, పీజీ కోర్సులు - వివరాలు ఇలా

IIAD: ఐఐఏడీ-న్యూఢిల్లీలో యూజీ, పీజీ కోర్సులు - వివరాలు ఇలా

IITTP: తిరుపతి ఐఐటీలో ఎంఎస్‌ రిసెర్చ్‌ ప్రోగ్రామ్, వివరాలు ఇలా

IITTP: తిరుపతి ఐఐటీలో ఎంఎస్‌ రిసెర్చ్‌ ప్రోగ్రామ్, వివరాలు ఇలా

World University Rankings 2024: వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకుల్లో 91 భారతీయ విశ్వవిద్యాలయాలకు చోటు

World University Rankings 2024: వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకుల్లో 91 భారతీయ విశ్వవిద్యాలయాలకు చోటు

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత

టాప్ స్టోరీస్

Kotamreddy : చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత - కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !

Kotamreddy :  చంద్రబాబు అరెస్ట్‌పై వైసీపీలో మెజార్టీ నేతల వ్యతిరేకత -  కోటంరెడ్డి కీలక వ్యాఖ్యలు !

Khairatabad Ganesh Immersion: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ వినాయకుడు - అర్ధరాత్రి ఆఖరి పూజ, వేకువజాము నుంచి యాత్ర

Khairatabad Ganesh Immersion: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ వినాయకుడు - అర్ధరాత్రి ఆఖరి పూజ, వేకువజాము నుంచి యాత్ర

Nara Bramhani Politics : టీడీపీలో మోస్ట్ వాంటెడ్ లీడర్‌గా నారా బ్రాహ్మణి - రాజకీయాల్ని ఇక సీరియస్‌గా తీసుకుంటారా ?

Nara Bramhani Politics :  టీడీపీలో మోస్ట్ వాంటెడ్ లీడర్‌గా నారా బ్రాహ్మణి - రాజకీయాల్ని ఇక సీరియస్‌గా తీసుకుంటారా ?

Best Electric Scooters: దేశంలో టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు - కొనాలనుకుంటే ఆప్షన్లలో ఇవి ఉండాల్సిందే!

Best Electric Scooters: దేశంలో టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్లు - కొనాలనుకుంటే ఆప్షన్లలో ఇవి ఉండాల్సిందే!