News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ అడ్మిట్‌ కార్డులు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు.

FOLLOW US: 
Share:

దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. జూన్ 4న నిర్వహించనున్న ఈ పరీక్షకు ఐఐటీ గువాహటి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్‌కు ఏప్రిల్ 30 నుంచి మే 7 వరకు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 4న ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష; మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్- 2 పరీక్ష నిర్వహించనున్నారు. 

అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి.. 

ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను ఐఐటీ గుహవాటి నిర్వహిస్తున్నది. 2.50 లక్షల మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించారు. వీరిలో జనరల్‌లో 98,612 మంది, వికలాంగులు 2,685 మంది, ఈడబ్ల్యూఎస్‌లో 25,057 మంది, ఓబీసీల్లో 67,613 మంది, ఎస్సీల్లో 37,536 మంది, ఎస్టీల్లో 18,752 మంది ఉన్నారు.

ప్రిలిమినరీ ఆన్సర్ కీని జూన్‌ 11న విడుదల చేయనున్నారు. అభ్యర్థుల నుంచి జూన్ 12 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఆపై జూన్ 18న జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, కోదాడ, ఆదిలాబాద్‌, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, నిజామాబాద్‌, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్‌లో కేంద్రాలను ఏర్పాటు చేశారు.

రెండు పరీక్షలకు హాజరుకావాల్సిందే..! 
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో భాగంగా జూన్‌ 4న ఉదయం, మధ్యాహ్నం నిర్వహించే రెండు పరీక్షలకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుంది. ఈ రెండు పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలనే ప్రకటిస్తారు. రాష్ట్రంలో ఆదిలాబాద్‌, హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, నిజామాబాద్‌, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్‌ పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్ష రాసేందుకు కనీసం 8 పట్టణాలను ఎంపిక చేసుకొనే వెసులుబాటు ఉంది.

ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌.. 
బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (ఏఏటీ) రాయాల్సి ఉంటుంది. వారణాసి, ఖరగ్‌పూర్‌, రూర్కీల్లోని ఐఐటీల్లో బీఆర్క్‌ (ఆర్కిటెక్చర్‌)కోర్సులను నిర్వహిస్తున్నారు. జూన్‌ 18,19న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఏఏటీ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్‌ 21న ఏఏటీ పరీక్ష నిర్వహించి, జూన్‌ 24న ఫలితాలను ప్రకటించనున్నారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్ సిలబస్‌లో మార్పులు..
జాయింట్ అడ్మిషన్స్ బాడీ(JAB) సిలబస్‌లో కొత్తగా కొన్ని మార్పులు చేసింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కొత్త సిలబస్‌ను అధికారిక పోర్టల్‌లో చెక్ చేసుకోవచ్చు. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ సిలబస్‌కు కొత్తగా స్టాటిస్టిక్స్ చేర్చారు. అయితే సొల్యూషన్ ఆఫ్ ద ట్రయాంగిల్‌ను తొలగించారు. అదేవిధంగా ఫిజిక్స్ సబ్జెక్ట్ సిలబస్‌‌ నుంచి సెమీకండక్టర్స్, కమ్యూనికేషన్స్‌ను తొలగించగా, జేఈఈ మెయిన్ సిలబస్‌లోని ఫోర్స్డ్ అండ్ డ్యామ్ప్‌డ్ అసిలేషన్స్, ఈఎం వేవ్స్ అండ్ పోలరైజేషన్ వంటి టాపిక్స్‌ను కొత్తగా చేర్చారు. కెమిస్ట్రీ సిలబస్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు.

సిలబస్ మార్పుతో ప్రభావం తక్కువే..
జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సంబంధించి గతంలో సిలబస్‌లో లేని కొత్త అంశాలను విద్యార్థులు ఇప్పుడు కవర్ చేయాల్సి ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ సిలబస్‌ను పెంచినప్పటికీ ఎగ్జామ్ ఈజీగా ఉండే అవకాశం ఉంది. జేఈఈ మెయిన్ కంటే అడ్వాన్స్‌డ్ సిలబస్ తక్కువ. మెయిన్స్‌లో భాగమైన కొన్ని చాప్టర్స్‌ను అడ్వాన్స్‌డ్‌‌కు జోడించారు. దీంతో జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరయ్యే అభ్యర్థులు జేఈఈ మెయిన్‌‌కు కూడా ప్రిపేర్ అయింటారు. తద్వారా సిలబస్‌లో మార్పు అనేది అభ్యర్థులపై ఎలాంటి ప్రభావం ఉండదు. అయితే ఐఐటీల్లో డిజైన్ కోర్సుల్లో చేరాలనుకుంటున్న అభ్యర్థులు కొత్త ఫార్మాట్ ఆధారంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. డిజైన్ ప్రవేశ పరీక్షలైన CEED, UCEED కోసం కొత్త పేపర్ ప్యాట్రన్, సిలబస్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఈ మార్పులు 2024 నుంచి అమల్లోకి రానున్నాయి.

డిజైన్ ఎంట్రెన్స్ టెస్ట్ ప్యాట్రన్‌లో మార్పులు..
ఈ ఎంట్రెన్స్ రెండు భాగాలుగా పార్ట్-ఎ, పార్ట్- బిగా ఉంటుంది. పార్ట్-ఎ పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇందులో మూడు భాగాలు ఉంటాయి. పార్ట్-బి: ఇందులో రెండు ప్రశ్నలు ఉంటాయి. ఒకటి డ్రాయింగ్‌, మరొకటి డిజైన్ ఆప్టిట్యూడ్‌పై ఉంటుంది. పార్ట్- బిలోని ప్రశ్న కంప్యూటర్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతుంది. అయితే సమాధానం రాయడం లేదా డ్రాయింగ్‌ను ఇన్విజిలేటర్ అందించిన ఆన్సర్ షీట్‌లో రాయాల్సి ఉంటుంది. కాగా, జేఈఈ అడ్వాన్స్‌డ్-2023 పరీక్ష జూన్ 4న జరగనుంది. పేపర్-1 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు జరగనుంది.
జేఈఈ అడ్వాన్స్‌డ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 29 May 2023 03:21 PM (IST) Tags: JEE Advanced 2023 JEE Advanced 2023 Admit Card JEE Advanced hall ticket 2023 JEE Advanced Admit Card 2023 JEE Advanced Admit Card

ఇవి కూడా చూడండి

KNRUHS: కటాఫ్‌ స్కోర్‌ తగ్గించిన కేంద్రం, మెడికల్ సీట్ల భర్తీకి కాళోజీ యూనివర్సిటీ నోటిఫికేషన్

KNRUHS: కటాఫ్‌ స్కోర్‌ తగ్గించిన కేంద్రం, మెడికల్ సీట్ల భర్తీకి కాళోజీ యూనివర్సిటీ నోటిఫికేషన్

MANAGE: మేనేజ్‌లో పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ కోర్సు, వివరాలు ఇలా

MANAGE: మేనేజ్‌లో పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ కోర్సు, వివరాలు ఇలా

NITT: నిట్‌ తిరుచిరాపల్లిలో ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సు, ఈ అర్హతలుండాలి

NITT: నిట్‌ తిరుచిరాపల్లిలో ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సు, ఈ అర్హతలుండాలి

Indian Medical Graduates: భారతీయ వైద్య విద్యార్థులు ఇక విదేశాల్లోనూ ప్రాక్టీస్‌ చెయ్యొచ్చు

Indian Medical Graduates: భారతీయ వైద్య విద్యార్థులు ఇక విదేశాల్లోనూ ప్రాక్టీస్‌ చెయ్యొచ్చు

JNV: నవోదయ విద్యాలయాల్లో 11వ తరగతి లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలు, ఎంపిక ఇలా!

JNV: నవోదయ విద్యాలయాల్లో 11వ తరగతి లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలు, ఎంపిక ఇలా!

టాప్ స్టోరీస్

Rajamundry Jail: రాజమండ్రి జైలులో ఖైదీ మృతిపై జైళ్ల శాఖ కీలక ప్రకటన - అసలు ఏం జరిగిందో చెప్పిన డీఐజీ

Rajamundry Jail: రాజమండ్రి జైలులో ఖైదీ మృతిపై జైళ్ల శాఖ కీలక ప్రకటన - అసలు ఏం జరిగిందో చెప్పిన డీఐజీ

Adilabad News: అంబులెన్స్ సిబ్బందికి హ్యాట్సాఫ్ - వర్షంలో రెండు కిలో మీటర్లు కాలినడకన వెళ్లి మహిళకు డెలివరీ

Adilabad News: అంబులెన్స్ సిబ్బందికి హ్యాట్సాఫ్ - వర్షంలో రెండు కిలో మీటర్లు కాలినడకన వెళ్లి మహిళకు డెలివరీ

Ram - Double Ismart Movie : రవితేజ 'ఈగల్' తర్వాత రామ్ 'డబుల్ ఇస్మార్ట్'లో గ్లామరస్ లేడీ!

Ram - Double Ismart Movie : రవితేజ 'ఈగల్' తర్వాత రామ్ 'డబుల్ ఇస్మార్ట్'లో గ్లామరస్ లేడీ!

VVS Laxman - 800 Pre Release : ముత్తయ్య కోసం ముంబైలో సచిన్ - ఇప్పుడు హైదరాబాద్‌లో వీవీఎస్ లక్ష్మణ్

VVS Laxman - 800 Pre Release : ముత్తయ్య కోసం ముంబైలో సచిన్ - ఇప్పుడు హైదరాబాద్‌లో వీవీఎస్ లక్ష్మణ్