![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
JEE Advanced 2021 Exam: నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష.. ఈ నిబంధనలు మర్చిపోకండి..
JEE Advanced Exam Today: జేఈఈ అడ్వాన్స్‌డ్ మొదటి పేపర్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు.. రెండో పేపర్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటుంది. ప్రతి పేపర్‌కు 3 గంటల సమయం కేటాయించారు.
![JEE Advanced 2021 Exam: నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష.. ఈ నిబంధనలు మర్చిపోకండి.. JEE Advanced 2021 today - Exam day guidelines, and other important details JEE Advanced 2021 Exam: నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష.. ఈ నిబంధనలు మర్చిపోకండి..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/03/0c59bea26fef70bd73916e9a5e2a3cba_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్‌డ్ పరీక్ష ఈరోజు (అక్టోబర్ 3) ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైంది. రెండు షిఫ్టులలో (పేపర్ I, పేపర్ II) పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా ఫొటో ఐడెంటిటీ కార్డును పరీక్ష కేంద్రానికి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ప్రతి పేపర్‌కు 3 గంటల సమయం కేటాయించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను ఐఐటీ ఖరగ్‌పూర్ (IITK) నిర్వహిస్తోంది. జేఈఈ మెయిన్‌లో ప్రతిభ ఆధారంగా రెండున్నర లక్షల మందికి అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు వీలు కల్పించింది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పరీక్ష కేంద్రాలను కేటాయించింది. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను నిర్వహిస్తున్నట్లు ఐఐటీ ఖరగ్‌పూర్ వెల్లడించింది. పరీక్షకు హాజరయ్యే ప్రతి విద్యార్థి కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. అభ్యర్థుల హాల్ టికెట్లపై కోవిడ్ 19 ప్రోటోకాల్స్ వివరాలను అందించామని చెప్పింది.
Also Read: విద్యార్థులకు అలర్ట్.. నీట్ యూజీలో సవరణలకు అవకాశం.. ఇవి చేయకపోతే ఫలితాలు కూడా రావు
మొదటి పేపర్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు.. రెండో పేపర్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష కోసం తెలంగాణ నుంచి దాదాపు 14 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 15 పట్టణాల్లో ఈ పరీక్ష జరగనుంది. అక్టోబర్ 10న ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. అక్టోబర్ 15వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల కానున్నాయి.
ఇవి తప్పనిసరిగా గుర్తుంచుకోండి..
విద్యార్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో అందించిన మొబైల్ నంబరుకు ఎగ్జామ్ సెంటర్, రిపోర్టింగ్ సమయం వివరాలు SMS రూపంలో పంపుతారు. దీనికి అనుగుణంగా నిర్దేశించిన సమయంలో విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్ వద్ద రిపోర్ట్ చేయాలి. పరీక్ష సమయం కంటే ఒక గంట ముందుగానే కేంద్రానికి చేరుకోవడం ఉత్తమం. అడ్మిట్ కార్డుపై ఉన్న కోవిడ్ 19 సెల్ఫ్ డిక్లరేషన్ వివరాలను నింపాలి. పరీక్షకు హాజరయ్యే వారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. హ్యాండ్ శానిటైజర్, వాటర్ బాటిల్ (transparent) తీసుకువెళ్లాలి. సామాజిక దూరాన్ని పాటించండి.
Also Read: పీజీ చదివే వారి కోసం యూజీసీ స్కాలర్‌షిప్‌లు.. నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోండి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)