అన్వేషించండి

INICET Results: ఎయిమ్స్ ఐఎన్‌ఐసెట్ - 2024 జులై సెషన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే

దేశంలోని ఎయిమ్స్‌లలో పీజీ వైద్య కోర్సుల్లో 2024, జులై సెషన్ ప్రవేశాలకు నిర్వహించిన 'INICET' పరీక్ష ఫలితాలను ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ సైన్సెస్(AIIMS) మే 25న విడుదల చేసింది.

INICET 2024 July Session Results: దేశంలోని ఎయిమ్స్‌లలో పీజీ వైద్య కోర్సుల్లో 2024,  జులై సెషన్ ప్రవేశాలకు మే 19న నిర్వహించిన 'నేషనల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్రెన్స్ టెస్ట్ (INICET)' కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఫలితాలను ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ సైన్సెస్(AIIMS) మే 25న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలు చూసుకోవచ్చు. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను హాల్‌టికెట్ నెంబర్లతోపాటు, కేటగిరీల (స్పాన్సర్డ్, ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్)వారీగా ప్రకటించారు. 

ఇనిసెట్ ఫలితాలకు సంబంధించి ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్, డీఎం విభాగాల్లో మొత్తం 43,095 మంది అర్హత సాధించారు. ఇక ఎండీఎస్ కోర్సుకు నిర్వహించిన పరీక్షకు మొత్తం 2,265 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో నమోదు చేసిన అర్హతలు, కేటగిరీ సర్టిఫికేట్, స్పాన్సర్‌షిప్ సర్టిఫికేట్ మొదలు వివరాల ఆధారంగా ఫలితాలను విడుదల చేశారు. ఒకవేళ వివరాల్లో ఏమైనా తప్పులు ఉన్నట్లు తేలితే ప్రవేశాల సమయంలో అభ్యర్థిత్వాన్ని రద్దుచేస్తారు. 

ఫలితాలు ఇలా చూసుకోండి..

➥ ఫలితాల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లో వెళ్లాలి. - aiimsexams.ac.in

➥ అక్కడ హోంపేజీలో 'Results' లేదా 'INI-CET July 2024 Session' ఫలితాల లింక్ మీద క్లిక్ చేయాలి.

➥ వెంటనే ఫలితాలు కంప్యూటర్ తెరమీద దర్శమిస్తాయి.

➥ పీడిఎఫ్ ఫార్మాట్‌లో ఉన్న ఫలితాలను చూసుకోవచ్చు. కోర్సులవారీగా అర్హత సాధించిన అభ్యర్థులు వివరాలను అందుబాటులో ఉంచారు.

ఫలితాల కోసం క్లిక్ చేయండి..

ఈ ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా.. ఆరేళ్ల వ్యవధి గల ఎండీ, ఎంఎస్‌, ఎంసీహెచ్‌, డీఎం, ఎండీఎస్‌ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఎయిమ్స్(న్యూఢిల్లీ), జిప్‌మర్(పుదుచ్చేరి), నిమ్‌హాన్స్(బెంగళూరు), పీజీఐఎంఈఆర్ (చండీగఢ్), ఎస్‌సీటీఐఎంఎస్ టీ(తిరువనంతపురం)తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్‌లలో పీజీ (ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్, డీఎం, ఎండీఎస్) సీట్లను భర్తీ చేస్తారు. 

భారత్‌లో ఎయిమ్స్ సెంటర్లు: న్యూఢిల్లీ, భోపాల్, భువనేశ్వర్, జోధ్‌పూర్, నాగ్‌పుర్, పట్నా, రాయ్ పూర్, రిషికేశ్, రాయ్ బరేలీ, గోరఖ్‌పూర్, కల్యాణి, బతిండా, గువాహటి, విజయ్‌పూర్, బిలాస్‌పూర్, మదురై, దర్భాంగా, కశ్మీర్, డియోఘర్, రాజ్‌కోట్, మనేతి, మణిపూర్, కర్ణాటక, బీబీనగర్, మంగళగిరి.

కటాఫ్ మార్కులు ఇలా..

➥ అన్ రిజర్వ్‌డ్ (యూఆర్), ఈడబ్ల్యూఎస్, స్పాన్సర్డ్, డిప్యూటెడ్, ఫారిన్ నేషనల్స్, భారత్‌‌కు చెందిన విదేశీ అభ్యర్థులకు 50 పర్సంటైల్‌గా నిర్ణయించారు.

➥ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు, భూటాన్ దేశానికి చెందిన అభ్యర్థులకు 45 పర్సంటైల్ కటాఫ్‌గా నిర్ణయించారు. 

ALSO READ:

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్‌లో పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు
ముంబయి ప్రధానకేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్‌ సంస్థ పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. దీనిద్వారా ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు రీజినల్ సెంటర్లలో పీజీ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్, మాస్టర్ ఇన్ ప్యాకేజింగ్ టెక్నాలజీ (ఎంఎస్) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు సైన్స్ డిగ్రీ, ఎంఎస్ కోర్సులో ప్రవేశాలకు గ్రాడ్యుయేషన్ (ఇంజినీరింగ్ & టెక్నాలజీ) డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. సరైన అర్హతలున్నవారు జులై 10 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు చేసుకున్నవారికి జులై 14న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Trimukha Movie Release Date: సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Tata Sierra Dealership: టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
Virat Kohli Anushka Sharma Trolls: అంత అహంకారమా... దివ్యాంగుడిని తోసేస్తారా? కోహ్లీ - అనుష్కపై నెటిజన్స్ ఆగ్రహం
అంత అహంకారమా... దివ్యాంగుడిని తోసేస్తారా? కోహ్లీ - అనుష్కపై నెటిజన్స్ ఆగ్రహం
Embed widget