News
News
X

IISc Admissions: బెంగళూరు ఐఐఎస్సీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(రిసెర్చ్‌) ప్రోగ్రాంలో ప్రవేశాలు, వివరాలు ఇలా!

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) బీఎస్సీ రిసెర్చ్ ప్రోగ్రాం కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ‌

FOLLOW US: 
Share:

బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) 2023-24 విద్యా సంవత్సరానికి బీఎస్సీ రిసెర్చ్ ప్రోగ్రాం కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కోర్సు వ్యవధి నాలుగేళ్లు. ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి. ప్రవేశాలు పొందిన అభ్యర్థులకు కేవీపీవై/ ఇన్‌స్పైర్‌/ ఐఐఎస్సీ ఉపకార వేతనం అందుతుంది. ఇంటర్ అర్హత ఉన్నవారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ‌కేవీపీవై-2021/ జేఈఈ మెయిన్-2023/ జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2023/ నీట్‌(యూజీ)-2023/ ఐసర్‌ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2023 స్కోరు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కోర్సుకి మే 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రోగ్రాం వివరాలు..

* బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(రిసెర్చ్‌) ప్రోగ్రాం

కోర్సు వ్యవధి: 4 సంవత్సరాలు.

పరిశోధనాంశాలు:‌ బయాలజీ, కెమిస్ట్రీ, ఎర్త్&ఎన్విరాన్‌ మెంటల్‌ సైన్స్, మెటీరియల్స్, మ్యాథ్స్, ఫిజిక్స్.

అర్హత: 2022లో ఇంటర్మీడియట్ పూర్తిచేసుకున్నవారు, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి, ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. 10+2/ ఇంటర్మీడియట్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) ప్రధాన సబ్జెక్టులుగా ఉండాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.250.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: ‌కేవీపీవై-2021/ జేఈఈ మెయిన్-2023/ జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2023/ నీట్‌(యూజీ)-2023/ ఐసర్‌ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2023 స్కోరు ఆధారంగా  సీటు కేటాయిస్తారు.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.03.2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ‌31.05.2023.

Notification 

Website 

Also Read:

ఏపీ పదోతరగతి హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే!
ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 3 నుంచి ప్రారంభంకానున్న పదోతరగతి వార్షిక పరీక్షల హాల్‌టిక్కెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టిక్కెట్లను అందుబాటులో ఉంచారు. ఏపీలో ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదోతరగతి వార్షిక పరీక్షలు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయా తేదీల్లో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు తమ జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీని వివరాలు నమోదుచేసి హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

AP SSC Exams: పదోతరగతి విద్యార్థులకు అలర్ట్, పరీక్షల్లో ఈ సారి కొత్త నిబంధనలు
ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికారులు పరీక్షల షెడ్యూలును కూడా విడుదల చేశారు.  మరోవైపు పదోతరగతి వార్షిక పరీక్షల హాల్‌టిక్కెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టిక్కెట్లను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీని వివరాలు నమోదుచేసి హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరీక్షల విభాగం తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

ఇంటర్‌ అర్హతతో ఎంబీఏ, ప్రవేశ ప్రకటన విడుదల చేసిన ఇండోర్ ఐఐఎం
ఇండోర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఐదేళ్ల 'ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్‌మెంట్(ఐపీఎం)' కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ అర్హత ఉన్నవారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సులో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి. మొదటి మూడేళ్లు ఫౌండేషన్, తర్వాత రెండేళ్లు మేనేజ్‌మెంట్ విద్యపై దృష్టి సారిస్తారు. తొలి భాగంలో భాష, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు; మేనేజ్‌మెంట్ విద్య ప్రాథమికాంశాలు, నైతిక విలువలు అర్థం చేసుకునే నైపుణ్యం, శారీరక ఆరోగ్యంపై దృష్టి సారిస్తారు. చివరి రెండేళ్లు లక్ష్యం దిశగా బోధన ఉంటుంది.
కోర్సు, పరీక్ష తేదీ వివరాల కోసం క్లిక్ చేయండి. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Published at : 19 Mar 2023 08:29 PM (IST) Tags: Indian Institute of Science IISc admissions IISc Notification Four-year Bachelor of Science (Research) Programme undergraduate programme

సంబంధిత కథనాలు

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

AP 10th Exams: 'పది'లో ఆరుపేపర్లు, బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నపత్రం! విద్యార్థులకు 'సిలబస్' కష్టాలు!

కొత్త మెడికల్ కాలేజీల్లో జులై నుంచి తరగతులు ప్రారంభించాల్సిందే! మంత్రి హరీశ్ రావు ఆదేశం!

కొత్త మెడికల్ కాలేజీల్లో జులై నుంచి తరగతులు ప్రారంభించాల్సిందే! మంత్రి హరీశ్ రావు ఆదేశం!

KNRUHS Final MBBS Results: ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

KNRUHS Final MBBS Results: ఎంబీబీఎస్‌ ఫైనలియర్‌ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

AP Inter Exams: ఇంటర్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఫిజిక్స్‌లో అందరికీ 2 మార్కులు!

AP Inter Exams: ఇంటర్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఫిజిక్స్‌లో అందరికీ 2 మార్కులు!

APPECET - 2023: ఏపీ పీఈసెట్ – 2023 దరఖాస్తు ప్రక్రియ, ఫిజికల్ ఈవెంట్లు ఎప్పడంటే?

APPECET - 2023: ఏపీ పీఈసెట్ – 2023 దరఖాస్తు ప్రక్రియ, ఫిజికల్ ఈవెంట్లు ఎప్పడంటే?

టాప్ స్టోరీస్

KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్

KCR Decisions: పోడు భూములకు పట్టాలు రెడీ, పంపిణీపై త్వరలో తేదీ ప్రకటిస్తాం: సీఎం కేసీఆర్

పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!

పది రోజుల్లో 50 వేల బుకింగ్స్, TSRTC కొత్త ప్లాన్‌కు అపూర్వ స్పందన, ఇకపై ఎనీటైమ్!

నా ఇంటికి రా రాహుల్ భయ్యా- రేవంత్ ఎమోషనల్ ట్విట్

నా ఇంటికి రా రాహుల్ భయ్యా-  రేవంత్ ఎమోషనల్ ట్విట్

Pawan Kalyan Movie Title : పవన్ కళ్యాణ్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టరే - టైటిల్ రిజిస్టర్ చేసిన నిర్మాత

Pawan Kalyan Movie Title : పవన్ కళ్యాణ్  ఒరిజినల్ గ్యాంగ్‌స్టరే - టైటిల్ రిజిస్టర్ చేసిన నిర్మాత