అన్వేషించండి

JEE Advanced 2024: రేపు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష, హాజరుకానున్న 1.91 లక్షల మంది అభ్యర్థులు - నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ

JEE Advanced 2024: దేశవ్యాప్తంగా మే 26న నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు 1.91 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 39 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు.

JEE Advanced 2024 Exam: దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన 'జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) అడ్వాన్స్‌డ్‌–2024' పరీక్ష నిర్వహణకు ఐఐటీ మద్రాస్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. మే 26న నిర్వహించనున్న ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 1.91 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలో 26, తెలంగాణలో 13 పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేశారు. మే 26న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌‌లో పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు రెండో సెషన్‌‌లో పేపర్-2 పరీక్షలు జరుగనున్నాయి. కంప్యూటర్‌ ఆధారితంగా నిర్వహించే ఈ పరీక్షలో అభ్యర్థులు రెండు పేపర్లను తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను ఇప్పటికే అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. 

తెలుగు రాష్ట్రాల నుంచే ఎక్కువగా.. 

గతంలో కంటే అత్యధిక సంఖ్యలో ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష కోసం అభ్యర్థులు రిజిస్టర్‌ చేసుకున్నారు. 2022లో 1.60 లక్షల మంది, 2023లో 1.89 లక్షల మంది రిజిస్టర్‌ చేసుకోగా.. ఈసారి ఏకంగా 1.91 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఏపీ, తెలంగాణల నుంచి అత్యధిక శాతం మంది దరఖాస్తు చేసుకోవడం విశేషం. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 45,965 మంది జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత సాధించగా.. 40 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. జేఈఈ మెయిన్‌ను రెండు సెషన్లు కలిపి 14.10 లక్షల మంది పరీక్షలకు హాజరైన సంగతి తెలిసందే. వీరిలో క్వాలిఫై కటాఫ్‌ మార్కులు సాధించిన వారిలో 2.5 లక్షల మందికి అడ్వాన్స్‌డ్‌కు అర్హత కల్పిస్తారు. మొత్తం 2,50,284 మంది అభ్యర్థులు అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు అర్హత సాధించగా.. మొత్తం 1.91 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 

జూన్‌ 9న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల వెల్లడి.. 

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024 ప్రవేశ పరీక్షను మే 26న నిర్వహిస్తుండగా.. మే 31న అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను అందుబాటులో ఉంచనున్నారు. ఇక జూన్ 2న ప్రాథమిక ఆన్సర్ కీని విడుదల చేసి, అభ్యర్థుల నుంచి జూన్ 3 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. జూన్ 9న ఫైనల్ ఆన్సర్ కీతోపాటు ఫలితాలను వెల్లడించనున్నారు. ఆ మరుసటి రోజునుంచే అంటే.. జూన్‌ 10 నుంచి జోసా తాత్కాలిక సీట్ల కేటాయింపు చేపడుతుంది. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌ ద్వారా ఎన్‌ఐటీల్లో దాదాపు 24వేల సీట్లు, ఐఐటీల్లో 17,385, ట్రిపుల్‌ ఐటీల్లో మరో 16వేల సీట్లను భర్తీచేయనున్నారు. ఐఐటీల్లో ప్రవేశం పొందాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకుతోపాటు అభ్యర్థులు బోర్డు పరీక్షల్లో 75 శాతం మార్కులు తప్పనిసరిగా సాధించాలన్న నిబంధన అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. 

పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

➥ జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2024 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందుగానే వారికి కేటాయించిన సెంటర్లకు చేరుకోవాలి. ఎందుకంటే ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అభ్యర్థులను లోపలకు అనుమతించరు. పరీక్షకు రెండు గంటల ముందుగానే కేంద్రానికి చేరుకోవడం ఉత్తమం.

➥ పరీక్షకు హాజరయ్యేవారు తమతో పాటు అడ్మిట్‌ కార్డుతోపాటు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఫొటో ఐడీ కార్డునూ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అడ్మిట్‌కార్డు జిరాక్స్‌ కాపీని ఇన్విజిలేటర్లకు అందించి ఒరిజినల్‌ కాపీని తమ వద్దే ఉంచుకోవాలి.

➥ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా డ్రెస్‌కోడ్‌ పాటించాల్సి ఉంటుంది. పెద్ద బటన్‌లు కలిగిన వస్త్రాలు, ఫుల్‌స్లీవ్‌ వస్త్రాలు ధరించకూడదు. బంగారపు ఆభరణాలు, జడలో పూలు ధరించకూడదు.

➥ బాల్‌పాయింట్‌ (బ్లూ/బ్లాక్) పెన్నును మాత్రమే వినియోగించాలి.

➥ పెన్సిల్, ఎరేజర్లను తెచ్చుకోవచ్చు. అలాగే, సాధారణమైన వాచీని ధరించవచ్చు.

➥  మొబైల్ ఫోన్లతోపాటు డిజిటల్‌ పరికరాలు, బ్లూటూత్, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అనుమతించరు.

➥ అభ్యర్థులు ట్రాన్స్‌పరెంట్‌ బాటిళ్లలో మాత్రమే తాగునీటిని తెచ్చుకోవాలి.

➥ అడ్మిట్‌కార్డులో నమోదు చేసిన పేరు, పేపర్, పుట్టిన తేదీ, జెండర్‌ వంటివి సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి.

➥ పరీక్ష సమయం పూర్తయ్యాకే పరీక్ష కేంద్రం నుంచి బయటకు పంపిస్తారు. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసంక్లిక్ చేయండి.. 

టాప్ హెడ్ లైన్స్

MBBS Fees in India: MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
CPR Full Form in Telugu: సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
సీపీఆర్‌ ఫుల్‌ఫామ్‌ ఏంటీ? ఎలా చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Vishnu Manchu: కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
India Pakistan:
"భారత ఏజెంట్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాడు"లష్కర్ కార్యకర్త సంచలన ప్రకటన!
MBBS Fees in India: MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MBBS చదువుకు ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చదవాలి? 
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Embed widget