అన్వేషించండి

GATE 2023 Admit Cards: గేట్-2023 అడ్మిట్ కార్డులు వచ్చేశాయి, ఇలా డౌన్లోడ్ చేసుకోండి!

అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ లేదా ఈమెయిల్ ఐడీతోపాటు పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అయి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో గేట్ పరీక్ష నిర్వహించనున్నారు.

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2023 పరీక్ష అడ్మిట్ కార్డులు వచ్చేశాయి. ఐఐటీ కాన్పూర్ జనవరి 9న గేట్-2023 హాల్‌టికెట్లను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ లేదా ఈమెయిల్ ఐడీతోపాటు పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అయి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాస్తవానికి జనవరి 3న అడ్మిట్ కార్డులు విడుదల చేయాల్సి ఉంది. అయితే నిర్వహణపరమైన కారణాల వల్ల వాయిదా వేసినట్లు ఐఐటీ కాన్పూర్ ఒక ప్రకటకనలో తెలిపింది. పరీక్ష అడ్మిట్ కార్డులను జనవరి 9 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. ఆ మేరకు తాజాగా అడ్మిట్ కార్డులను విడుదల చేసింది.

ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో గేట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 16న గేట్ ఫలితాలను వెల్లడించనున్నారు.

గేట్ - 2023 హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..

గేట్-2023 షెడ్యూలు ఇలా..
GATE 2023 Admit Cards: గేట్-2023 అడ్మిట్ కార్డులు వచ్చేశాయి, ఇలా డౌన్లోడ్ చేసుకోండి!

అభ్యర్థులకు సూచనలు..
అడ్మిట్ కార్డుపై పరీక్షా కేంద్రానికి సంబంధించిన వివరాలతో పాటు షిఫ్ట్ సమయం కూడా ఉంటుంది. పరీక్ష కేంద్రానికి వెళ్లే సమయంలో అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డుతో పాటు తప్పనిసరిగా ఏదైనా ఒరిజినల్ ఐడీకార్డును వెంట తీసుకెళ్లాలి. లేదంటే పరీక్ష నిర్వాహకులు పరీక్షా కేంద్రంలోనికి అనుమతించరు. మొబైల్స్, క్యాలికేటర్లు, రిస్ట్ వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను లోనికి అనుమతించరు. పరీక్ష కేంద్రంలోని వెళ్లేముందు అడ్మిట్ కార్డు, ఐడీ ఫ్రూప్, పెన్ వెంట తీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డుపై సంతకాన్ని పోలి ఉండేలా పరీక్షా కేంద్రంలో సదరు అభ్యర్థి సంతకం చేయాల్సి ఉంటుంది. అప్పుడే గేట్ పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. 

పరీక్ష విధానం..
✦ మొత్తం 29 సబ్జెక్టుల్లో గేట్ పరీక్ష నిర్వహిస్తారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాలతోపాటు.. ఇతర దేశాలలోని 6 నగరాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
✦ ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే గేట్ పరీక్షలో 100 మార్కులకు 65 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి 10 ప్రశ్నలకుగాను 15 మార్కులు; టెక్నికల్, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ విభాగాల నుంచి 55 ప్రశ్నలకుగాను 85 మార్కులు ఉంటాయి. 
✦ పరీక్ష సమయం 3 గంటలు.
✦ నెగెటివ్ మార్కులు కూడా ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానాకి 0.33 చొప్పున మార్కుల్లో కోత విధిస్తారు.

దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో పాటు విదేశాల్లోని ఆరు నగరాల్లో గేట్ పరీక్ష నిర్వహించనున్నారు. గేట్ ద్వారా ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలతో పాటు డాక్టోరల్ పోగ్రామ్స్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. విద్యార్థులు గేట్‌ పరీక్షలో సాధించిన స్కోరు ఫలితాల వెల్లడి నుంచి 3 సంవత్సరాల పాటు వర్తిస్తుంది.

గేట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 7 ఐఐటీల(బొంబయి, ఢిల్లీ, గువాహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ)తో పాటు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్ ఆఫ్ సైన్స్, ఇతర ప్రభుత్వరంగ విద్యాసంస్థల్లో డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర ప్రైవేట్ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు కూడా గేట్ స్కోరునే ప్రవేశాలకు ప్రామాణికంగా తీసుకుంటాయి. కొన్ని ప్రభుత్వ సంస్థలు గేట్ స్కోరు ద్వారా ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తున్నాయి.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, కర్నూలు, ఏలూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, చీరాల, చిత్తూరు, గూడూరు, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, హైదరాబాద్, కోదాడ, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్. కొత్తగా మెదక్, నల్గొండ, అదిలాబాద్, కొత్తగూడెం.

ముఖ్యమైన తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం               :           30.08.2022.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది                          :           30.09.2022.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది (ఎక్స్ టెండెడ్)  :          07.10.2022.

అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్                                         :           03.01.2023.

అభ్యర్థుల రెస్పాన్స్-అప్లికేషన్ పోర్టల్                 :           15.02.2023.

ఆన్సర్ కీ అందుబాటులో                                    :           21.02.2023.

ఆన్సర్ కీ పై అభ్యంతరాల సమర్పణ                 :           22 - 25.02.2023.

గేట్ పరీక్ష తేదీలు 2020                                      :           ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో.

ఫలితాల వెల్లడి                                                  :           16.03.2023.

గేట్ స్కోర్ కార్డు డౌన్‌లోడ్                                    :           22.03.2023

GATE - 2023 NOTIFICATION

INFORMATION BROCHURE

FEE DETAILS

GATE 2023 PAPERS & SYLLABUS

QUESTION PATTERN

WEBSITE 

Also Read:

TS SET - 2022 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు/లెక్చరర్లుగా పనిచేయడానికి అర్హత కల్పించే పరీక్ష తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (టీఎస్ సెట్) - 2022 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 30న ప్రారంభమైంది. సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణత ఉన్నవారు, ప్రస్తుతం ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు జనవరి 20 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, ఫిబ్రవరి 5 వరకు అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. పరీక్ష ఫీజుగా ఓసీ అభ్యర్థులు రూ.2000; బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1500; ఎస్సీ, ఎస్టీ, వీహెచ్, హెచ్‌ఐ, ఓహెచ్, ట్రాన్స్‌జెండర్‌లు రూ.1000 చెల్లించాలి. 2023 మార్చి మొదటి లేదా రెండోవారంలో ఆన్‌లైన్ విధానంలో టీఎస్ సెట్-2022 పరీక్షలను నిర్వహించనున్నారు.
దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..

యూజీసీనెట్ 2022 దరఖాస్తు ప్రారంభం, ఇలా దరఖాస్తు చేసుకోండి! చివరితేది ఇదే!
దేశంలోని యూనివర్సిటీలలో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ కోసం యూజీసీ నెట్ (డిసెంబరు)-2022 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. పీజీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబరు 29న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సరైన అర్హతలు కలిగిన అభ్యర్థులు జనవరి 17 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Lookback 2024: ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
ఎయిర్‌పోర్టులో గోడను ఢీకొట్టిన విమానం, చెలరేగిన మంటలు - 28 మంది మృతి
Anand Deverakonda: హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
హిట్ దర్శకుడితో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా - హీరోయిన్‌గా మలయాళీ భామకు ఛాన్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Lookback 2024: ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
ఈ ఏడాది టాప్-5 క్రీడా వివాదాలు.. ఒలింపిక్స్ నుంచి ఐపీఎల్ దాకా కాంట్రవర్సీలతో ఘాటుగా..
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Embed widget