JAM 2023 Results: ఐఐటీ జామ్-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
దేశంలోని ఉన్నతవిద్య సంస్థల్లో బయో టెక్నాలజీ, ఇతర సైన్స్ విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ చేయాలనుకునే వారికోసం ఉద్దేశించిన జామ్- 2023’ పరీక్షకు సంబంధించిన ఫలితాలను ఐఐటీ గువహటీ మార్చి 22న విడుదల చేసింది.
దేశంలోని ఉన్నతవిద్య సంస్థల్లో బయో టెక్నాలజీ, ఇతర సైన్స్ విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ చేయాలనుకునే వారికోసం ఉద్దేశించిన ‘జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్) 2023’ పరీక్షకు సంబంధించిన ఫలితాలను ఐఐటీ గువహటీ మార్చి 22న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. జామ్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. అభ్యర్థులు ఏప్రిల్ 3 నుంచి స్కోరు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఫలితాలు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
స్టెప్ 1: అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి. - https://jam.iitg.ac.in/
స్టెప్ 2: హోంపేజీలో కనిపించే 'Candidate Portal' బటన్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 3: అక్కడ లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేయాలి.
స్టెప్ 4: అభ్యర్థులకు సంబంధించిన ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
స్టెప్ 5: ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.
ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 22న ఐఐటీ జామ్ 2023 ఫలితాలను వెల్లడించారు. ఏప్రిల్ 11 నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభంకానుంది. ఐఐటీ గువాహటి ఏడాది ఫిబ్రవరి 12న జామ్-2023 ప్రవేశ పరీక్ష నిర్వహించింది. మొత్తం 7 సబ్జెక్టులలో (బయోటెక్నాలజీ, ఎకనామిక్స్, కెమిస్ట్రీ, జియోలజీ, మ్యాథమెటిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్) పరీక్ష నిర్వహించింది.
దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు అందిస్తున్న వివిధ పీజీ ప్రోగ్రామ్‌లలో సుమారు 3000 సీట్లను జామ్ స్కోర్ ద్వారా భర్తీ చేస్తారు. వీటితోపాటు నిట్‌లు(NIT), ఐసర్లు(IISER), ఐఐఎస్సీ(IISC), ఐఐఈఎస్‌టీ(IIEST), డీఐఏటీ(DIAT), ఐఐపీఈ(IIPE), జేఎన్‌సీఏఎస్‌ఆర్ (JNCASR), ఎస్‌ఎల్‌ఐఈటీ (SLIET) సహా మొత్తం 30 సీఎఫ్‌టీఐ సంస్థల్లోని 2300కు పైగా సీట్ల భర్తీకి ఈ స్కోరునే ప్రామాణికంగా తీసుకుంటారు.
Also Read:
వెబ్‌సైట్‌లో 'గేట్-2023' స్కోరుకార్డులు, డైరెక్ట్ లింక్ ఇదే!
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2023 ఫలితాలను ఐఐటీ కాన్పూర్ మార్చి 16న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అభ్యర్థుల స్కోరు కార్డులను మార్చి 21న విడుదల చేసింది. స్కోరుకార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి స్కోరుకార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఐఐటీ కాన్పూర్ ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 21న ఆన్సర్ కీని విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 22 నుంచి ఫిబ్రవరి 25 వరకు అభ్యంతరాలు స్వీకరించింది.
గేట్-2023 స్కోరుకార్డు కోసం క్లిక్ చేయండి..
సీయూఈటీ పీజీ రిజిస్ట్రేషన్ ప్రారంభం - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!
దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (సీయూఈటీ-పీజీ-2023) నోటిఫికేషన్ వెలువడింది. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 20న ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు డెబిట్/క్రెడిట్ కార్డులతో పాటు నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా దరఖాస్తు ఫీజును చెల్లించవచ్చు. పరీక్ష షెడ్యూలును త్వరలోనే వెల్లడించనున్నారు.
దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..