అన్వేషించండి

'ప్రతిభ' విద్యార్థులకు ఐఐటీ, మెడిసిన్‌ ఫౌండేషన్‌ కోర్సులు - ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు

తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ  ప్రతిభ గురుకులాల్లోని విద్యార్థులకు ఐఐటీ, మెడిసిన్ ఫౌండేషన్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇంజినీరింగ్, మెడిసిన్ సీట్లు సాధించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకొచ్చిందిజ

IIT Medicine Foundation Courses: తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ  ప్రతిభ గురుకులాల్లోని విద్యార్థులకు ఐఐటీ, మెడిసిన్ ఫౌండేషన్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. దేశంలోని ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఇంజినీరింగ్, మెడిసిన్ సీట్లు సాధించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా సంబంధింత గురుకులాల పరిధిలోని 54 ప్రతిభ పాఠశాలల్లో (సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్-CEO) 8వ తరగతి నుంచే ఫౌండేషన్ కోర్సులు ప్రవేశ పెట్టనున్నారు. ఈ విద్యాసంవత్సరం (2024-25) నుంచే ఈ కొత్త విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. అదేవిధంగా ఆయా గురుకులాల్లో పూర్తిస్థాయిలో కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. పాఠశవాలలో చదివే ప్రతి విద్యార్థికి కనీసం రెండు గంటలు కంప్యూటర్ అందుబాటులో ఉంచాలని ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీలు నిర్ణయించాయి.

పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో..
ప్రతిభ పాఠశాలల్లో సీట్లకు పోటీ ఎక్కువగా ఉంది. ఇక్కడ విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో చేరిన తరువాత చదువుతోపాటు ఇంజినీరింగ్, మెడికల్ సీట్లు సాధించేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. కానీ విద్యార్థులపై ఒత్తిడి పెరిగి సీట్లు పొందలేకపోతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు 2023-24 విద్యాసంవత్సరంలో పైలెట్ ప్రాజెక్టుగా కొన్ని పాఠశాలల్లో ఎనిమిదో తరగతి నుంచి ఫౌండేషన్ కోర్సులతో శిక్షణ ఇప్పించేందుకు ఎస్సీ, ఎస్టీ సొసైటీలు ప్రణాళికను సిద్ధం చేశాయి. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో పూర్తిస్థాయిలో అమలు చేయాలని నిర్ణయించాయి. 

కార్పొరేట్ సంస్థతో గురుకుల సొసైటీలు ఒప్పందం..
రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో 8 ప్రీమియర్ సీవోఈలు, 32 నాన్ ప్రీమియర్ సీవోఈలు ఉన్నాయి. అలాగే ఎస్టీ సొసైటీ పరిధిలో 14 కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటిల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఎనిమిదో తరగతి నుంచే రోజువారీ పాఠాలతోపాటు అత్యుత్తమ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంపై ఫౌండేషన్ కోర్సులు బోధించనున్నారు. ప్రతి విద్యార్థి పేరిట ప్రత్యేక లాగిన్ ఐడీ సదుపాయాన్ని కల్పిస్తారు. దీంతో వారు ఎప్పుడైనా ఆన్‌లైన్‌లో చదువుకునేందుకు అవకాశం ఉంటుంది. రెండేళ్లపాటు రూ.20 కోట్ల విలువైన ఆన్‌లైన్ కంటెంట్ ఉచితంగా అందించేందుకు ఓ కార్పొరేట్ సంస్థతో గురుకుల సొసైటీలు ఒప్పందం చేసుకున్నాయి. అయితే విద్యార్థులకు ప్రత్యేకంగా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు అందుబాటులో లేకపోవడంతో ప్రతి పాఠశాలలో అవసరమైన కంప్యూటర్లను సొసైటీ సమకూర్చుతోంది. పలు కార్పొరేట్ సంస్థలు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కంప్యూటర్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి.

స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం. . . 
ఏపీ ప్రభుత్వం స్కూళ్లకు వేసవి సెలవులు (Summer Holidays in AP) ప్రకటించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి సమ్మర్ హాలీడేస్ ప్రారంభంకానున్నాయి. జూన్ 11 వరకు సెలవులు కొనసాగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఏప్రిల్ 2న అధికారక ప్రకటన విడుదల చేసింది. మార్చి 18 నుంచి ఒంటిపూట బడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒంటిపూట ఒడులు నిర్వహిస్తున్నారు. కాగా.. ఏపీ వ్యాప్తంగా ఏప్రిల్ 23 నాటికి అన్ని తరగతుల విద్యార్థులకు పరీక్షలు పూర్తి చేసి.. ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
Top MBBS Colleges: ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?
ఎంబిబిఎస్ చేయడానికి తెలుగు రాష్ట్రాల్లో టాప్ మెడికల్‌ కాలేజీలు ఏవి? ఫీజులు ఎలా ఉంటాయి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget