CAT 2024: 'క్యాట్-2024' పరీక్ష హాల్‌టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి - పరీక్ష ఎప్పుడంటే?
CAT 2024: క్యాట్-2024 అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అభ్యర్థులు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 170 నగరాల్లో నవంబరు 24న క్యాట్ పరీక్ష నిర్వహించనున్నారు.
CAT Admit Card 2024: క్యాట్-2024 పరీక్ష హాల్‌టికెట్లను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(IIM) కలకత్తా నవంబరు 5న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది. క్యాట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నవారు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. షెడ్యూలు ప్రకారం.. నవంబరు 24న 'CAT - 2024' పరీక్ష నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలో అనంతపురం, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, విశాఖపట్నం, చీరాల, కడప, నెల్లూరు, తిరుపతి, విజయనగరం, చిత్తూరు, కాకినాడ, ఒంగోలు, విజయవాడ నగరాల్లో; తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ నగరాల్లో క్యాట్-2024 పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష సమయం వరకు అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. క్యాట్ స్కోరుకు 2025 డిసెంబరు 31 వరకు వ్యాలిడిటీ ఉంటుంది.
CAT- 2024 అడ్మిట్ కార్డులు ఇలా డౌన్‌చేసుకోవాలి..
➦ CAT 2024 అడ్మిట్ కార్డు (హాల్‌టికెట్) కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావాలి.- iimcat.ac.in
➦ అక్కడ 'Download CAT 2024 Admit Card' లింక్‌పై క్లిక్ చేయాలి.
➦ అభ్యర్థి తన యూజర్ ఐటీ, పాస్‌వర్డ్ వివరాలతో సైన్ ఇన్ కావాలి.
➦ క్లిక్ చేయగానే అభ్యర్థి హాల్‌టికెట్ వస్తుంది.
➦ హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి.
➦ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
CAT 2024 అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..
పరీక్ష విధానం..
మొత్తం 198 మార్కులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి. వీటి నుంచి 66 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో సెక్షన్‌కు 40 నిమిషాల సమయం చొప్పున 120 నిమిషాల సమయం ఉంటుంది. దివ్యాంగులకు అదనపు సమయం కేటాయిస్తారు. ప్రతిప్రశ్నకు 3 మార్కులు ఉంటాయి. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు.
➥ సెక్షన్-1: వెర్బల్ ఎబిలిటీ & రీడింగ్ కాంప్రహెన్షన్ - 24 ప్రశ్నలు – 72 మార్కులు.
➥ సెక్షన్-2: డేటా ఇంటర్ ప్రిటేషన్ & లాజికల్ రీజనింగ్ - 20 ప్రశ్నలు – 60 మార్కులు
➥ సెక్షన్-3: క్వాంటిటేటివ్ ఎబిలిటీ - 22 ప్రశ్నలు – 66 మార్కులు.
ఐఐఎం క్యాంపస్‌లు: క్యాట్ 2024 పరీక్ష ద్వారా విశాఖపట్నం, అహ్మాదాబాద్, బెంగళూరు, ముంబయి, కలకతా, జమ్మూ, బోద్ గయ, ఉదయపూర్, తిరుచిరాపల్లి, కోజికోడ్, అమృత్‌సర్, రాయ్‌పూర్, నాగ్‌పూర్, కాశీపూర్, లక్‌నవూ, రాంచీ, రోహ్‌తక్, షిల్లాంగ్, ఇండోర్, సంబల్‌పూర్, సిర్‌మౌర్ ఐఐఎం క్యాంపస్‌లలో ప్రవేశాలు పొందవచ్చు.
Percentile Score Calculation 2024
ALSO READ: జేఈఈ మెయిన్-2025 మొదటి విడత పరీక్షల షెడ్యూలు విడుదల, ముఖ్యమైన తేదీలివే