అన్వేషించండి

IIITH: ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌లో డ్యూయల్‌ డిగ్రీ ప్రోగ్రామ్, వివరాలు ఇలా

హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డ్యూయల్ డిగ్రీ (బీటెక్‌, ఎంఎస్‌) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డ్యూయల్ డిగ్రీ (బీటెక్‌, ఎంఎస్‌) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 105 సీట్లను భర్తీ చేయనున్నారు. జూన్ 2024 నాటికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో 12వ తరగతి ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (యూజీఈఈ) 2024 ద్వారా అడ్మిషన్లు పొందవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.2,500. మహిళలకు రూ.1250. అభ్యర్థులు ఏప్రిల్ 01 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. మే 5న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. జూన్ 11 నుంచి 13వరకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 

ప్రోగ్రామ్ వివరాలు..

* బీటెక్, మాస్టర్ ఆఫ్ సైన్స్ (రిసెర్చ్‌)

మొత్తం సీట్ల సంఖ్య: 105.

ప్రోగ్రామ్ వ్యవధి: అయిదేళ్లు.

 ఈసీడీ(ECD): 25 సీట్లు

 సీఎస్‌డీ(CSD ): 35 సీట్లు

 సీఎల్‌డీ(CLD): 15 సీట్లు

 సీఎన్‌డీ(CND): 15 సీట్లు

 సీహెచ్‌డీ(CHD): 15 సీట్లు

విభాగాలు..
బీటెక్‌: ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్.

ఎంఎస్‌(రిసెర్చ్‌): ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్, కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్, కంప్యూటేషనల్ నేచురల్ సైన్సెస్, కంప్యూటింగ్ అండ్‌ హ్యూమన్ సైన్సెస్.

అర్హత: జూన్ 2024 నాటికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో 12వ తరగతి ఉత్తీర్ణత.

దరఖాస్తు ఫీజు: రూ.2,500. మహిళలకు రూ.1250.

ఎంపిక విధానం: యూజీఈఈ 2024, ఇంటర్వ్యూ ఆధారంగా.

పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్ష (UGEE) ఈ పరీక్ష మూడు గంటల పాటు ఉంటుంది మరియు రెండు విభాగాలు ఉంటాయి. 

ఎ) SUPR - 60 నిమిషాల పాటు సబ్జెక్ట్ ప్రొఫిషియన్సీ టెస్ట్.

బి) REAP - 120 నిమిషాల పాటు రీసెర్చ్ ఆప్టిట్యూడ్ టెస్ట్.

తెలుగు రాష్ట్రాలలో పరీక్షా కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, వరంగల్.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 01.04.2024.

ప్రవేశ పరీక్ష తేదీ: 04.05.2024.

ఇంటర్వ్యూ తేదీలు: 11 నుంచి 13.06.2024 వరకు.

Notification & Online Application 

ALSO READ:

TS SSC Pre Final Exams: పదోతరగతి ప్రీఫైనల్‌ పరీక్షల షెడ్యూలు విడుదల, ఎప్పటినుంచంటే?
తెలంగాణలో పదోతరగతి విద్యార్థులకు ప్రీఫైనల్ పరీక్షలు మార్చి 1 నుంచి 11 వరకు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. పరీక్షల షెడ్యూలును శుక్రవారం (ఫిబ్రవరి 9) విడుదల చేసింది. ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు జరుగుతున్నందున పదోతరగతి ప్రీఫైనల్ పరీక్షలను మధ్యాహ్నం సమయాల్లో నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఆయాతేదీల్లో మధ్యాహ్నం 1.45 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మార్చి 1న తెలుగు, మార్చి 2న హిందీ, మార్చి 4న ఇంగ్లిష్, మార్చి 5న గణితం(మ్యాథమెటిక్స్), మార్చి 6న భౌతిక శాస్త్రం(ఫిజిక్స్), మార్చి 7న జీవశాస్త్రం (బయాలజీ), మార్చి 11న సాంఘిక శాస్త్రం (సోషల్ స్టడీస్) పరీక్షలను నిర్వహించనున్నారు.
పరీక్షల పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jimmy Carter Dies: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ కన్నుమూత, ఆయన పేరిట ఎన్నో రికార్డులు
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ కన్నుమూత, ఆయన పేరిట ఎన్నో రికార్డులు
Srikakulam Politics: తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లిన బొత్స, పీక పోయినా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు
తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లిన బొత్స, పీక పోయినా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana Assembly Special Session: నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, సభలో కీలక తీర్మాణం - కేబినెట్ భేటీ వాయిదా
నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, సభలో కీలక తీర్మాణం - కేబినెట్ భేటీ వాయిదా
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jimmy Carter Dies: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ కన్నుమూత, ఆయన పేరిట ఎన్నో రికార్డులు
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ కన్నుమూత, ఆయన పేరిట ఎన్నో రికార్డులు
Srikakulam Politics: తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లిన బొత్స, పీక పోయినా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు
తమ్మినేని సీతారాం ఇంటికి వెళ్లిన బొత్స, పీక పోయినా పవన్ కళ్యాణ్ వైపు వెళ్తారా? ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana Assembly Special Session: నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, సభలో కీలక తీర్మాణం - కేబినెట్ భేటీ వాయిదా
నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం, సభలో కీలక తీర్మాణం - కేబినెట్ భేటీ వాయిదా
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
EPFO New Facilities: నూతన సంవత్సరంలో EPFO నుంచి భలే ఫెసిలిటీస్‌ - అన్నీ హ్యాపీ న్యూస్‌లే!
నూతన సంవత్సరంలో EPFO నుంచి భలే ఫెసిలిటీస్‌ - అన్నీ హ్యాపీ న్యూస్‌లే!
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
AP New CS: ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ నూతన సీఎస్‌గా విజయానంద్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Look Back 2024: IPL వేలంలో సూపర్ హిట్టయిన పంత్, శ్రేయస్- 13 ఏళ్ల చిచ్చరపిడుగుకు ఛాన్స్.. బిగ్ ప్లేయర్లకు షాక్ 
IPL వేలంలో సూపర్ హిట్టయిన పంత్, శ్రేయస్- 13 ఏళ్ల చిచ్చరపిడుగుకు ఛాన్స్.. బిగ్ ప్లేయర్లకు షాక్ 
Embed widget