అన్వేషించండి

MBU: మోహన్ బాబు యూనివర్శిటీలో ఐఈఈఈ అంతర్జాతీయ సదస్సు - క్వాంటం కంప్యూటింగ్ ఆవిష్కరణలపై మేధోమథనం

Mohan Babu University: తిరుపతిలోని ఎంబీయూ యూనివర్శిటీలో ఐఈఈఈ కాన్టెంపరరీ కంప్యూటింగ్ ఇన్నోవేషన్స్ కాన్ఫరెన్స్ ఘనంగా నిర్వహించారు. వివిధ దేశాల నిపుణులు ఈ సదస్సుకు హాజరయ్యారు.

International Conference at Mohan Babu University: తిరుపతిలోని మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఐఈఈఈ కాన్టెంపరరీ కంప్యూటింగ్ ఇన్నోవేషన్స్ కాన్ఫరెన్స్ (CCIC 2026) ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి 6 ,  7 తేదీల్లో దాసరి ఆడిటోరియంలో జరిగిన ఈ అంతర్జాతీయ సదస్సుకు కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం  స్పాన్సర్‌షిప్ అందించింది. ఐఈఈఈ రీజియన్ 10, టెమ్స్  సంస్థలు సాంకేతిక సహకారం అందించాయి.

అంతర్జాతీయ ప్రముఖుల సమక్షంలో మేధోమథనం 

ఈ సదస్సులో ఆస్ట్రేలియాకు చెందిన ఐఈఈఈ కన్స్యూమర్ టెక్నాలజీ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ స్టీఫెన్ మోజర్, ఐఈఈఈ ఇండియా కౌన్సిల్ చైర్ ప్రొఫెసర్ ప్రేరణ గౌర్, చైర్ ఎలక్ట్ ప్రొఫెసర్ ప్రీతి బజాజ్ పాల్గొన్నారు. వీరితో పాటు చెన్నైలోని మలేషియా కాన్సులేట్ జనరల్ శరవణ కుమార్ కుమారవసగం, ఐఈఈఈ టెమ్స్ అధ్యక్షుడు డాక్టర్ సుధీంద్ర కౌశిక్, గుజరాత్ సెక్షన్ చైర్ ప్రొఫెసర్ చిరాగ్ పాన్వాలా పాల్గొన్నారు.  

రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ నిపుణుల ప్రసంగాలు, సాంకేతిక పత్రాల సమర్పణలు, వర్క్‌షాప్‌లు నిర్వహించారు. పరిశ్రమల భాగస్వామ్యంతో ప్రత్యేక సెషన్లు, విద్యార్థులకు ఉపాధి శిక్షణ, స్టార్టప్ ప్రదర్శనలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కృత్రిమ మేధ , డేటా సైన్స్, క్వాంటం కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్‌చైన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి కీలక అంశాలపై లోతైన చర్చలు జరిగాయి.

పరిశోధనల్లో పారదర్శకత 

డేటా సైన్స్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 2,000 పైగా పరిశోధనా పత్రాలు వచ్చాయి. ఐఈఈఈ ప్రమాణాల ప్రకారం కఠినమైన సమీక్ష అనంతరం 383 పత్రాలను ఎంపిక చేశారు. వీటిని ఐఈఈఈ ఎక్స్‌ప్లోర్ డిజిటల్ లైబ్రరీ, స్కోపస్‌లలో పొందుపరుస్తారు. ఆశ్చర్యకరంగా, ఎంపికైన పత్రాలలో కేవలం 5 శాతం మాత్రమే ఆతిథ్య విశ్వవిద్యాలయానికి చెందినవి ఉండటం ఇక్కడి విద్యా ప్రమాణాలకు, పారదర్శకతకు నిదర్శనంగా నిలిచింది.

అకడమిక్ పరిశోధనలకు, పారిశ్రామిక అవసరాలకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడంలో ఇలాంటి సదస్సులు కీలక పాత్ర పోషిస్తాయని విశ్వవిద్యాలయ ట్రస్టీ వినయ్ మహేశ్వరి పేర్కొన్నారు. సాంకేతిక మార్పులను అందిపుచ్చుకుంటూ సమాజ ప్రగతికి తోడ్పడే పరిశోధనలను ప్రోత్సహించడమే వర్సిటీ లక్ష్యమని ఆయన వివరించారు. ఈ సదస్సు యువ పరిశోధకులకు అంతర్జాతీయ నిపుణులతో ముఖాముఖి చర్చించే గొప్ప అవకాశాన్ని కల్పించింది.          

టాప్ హెడ్ లైన్స్

School Holidays: మురసు తుపాను ఎఫెక్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
మురసు తుపాను ఎఫెక్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
JEE Main 2027 Registration: జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
జేఈఈ మెయిన్ జనవరి సెషన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం ఇలా!
AP Inter Exams Schedule: విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల
విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Urban Local Bodies Polling: ఏపీలో 13 పోలింగ్ కేంద్రాల్లో ముగిసిన రీపోలింగ్.. ఈ 3న ఓట్ల లెక్కింపు
ఏపీలో 13 పోలింగ్ కేంద్రాల్లో ముగిసిన రీపోలింగ్.. ఈ 3న ఓట్ల లెక్కింపు
Cyclone Musuru Helpline Numbers: ఏపీకి తుపాను ముప్పు.. మనమిత్ర వాట్సాప్ సహా జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు
ఏపీకి తుపాను ముప్పు.. మనమిత్ర వాట్సాప్ సహా జిల్లాలవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు
Hyderabad Baby Dies: ఛీ ఇంత దారుణమా! పాప చనిపోయినా.. ట్రీట్మెంట్ చేస్తూ బతికున్నట్టు డాక్టర్లు డ్రామా !
ఛీ ఇంత దారుణమా! పాప చనిపోయినా.. ట్రీట్మెంట్ చేస్తూ బతికున్నట్టు డాక్టర్లు డ్రామా !
Congress Politics: జడ్చర్ల ఎమ్మెల్యేపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్.. అనిరుద్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ క్లాస్
జడ్చర్ల ఎమ్మెల్యేపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్.. అనిరుద్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ క్లాస్
Raptadu Girl Attack Case: రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
Upcoming Cars: ఈ నెలలో రాబోతున్న 4 కార్లు.. లగ్జరీ EVల నుంచి తొలి 'ఫ్లెక్స్ ఫ్యూయల్ హైబ్రిడ్' వరకు!
ఈ నెలలో లాంచ్‌ కానున్న 4 కొత్త కార్లు.. ఒక్కో కారుది ఒక్కో ప్రత్యేకత
Viral News: అమ్మా.. నన్ను తీసుకెళ్లు భయమేస్తుంది.. జగిత్యాలలో శిశు సంరక్షణ కేంద్రంలో పసివాడి నరకం
అమ్మా.. నన్ను తీసుకెళ్లు భయమేస్తుంది.. జగిత్యాలలో శిశు సంరక్షణ కేంద్రంలో పసివాడి నరకం
Diwali Home Decoration : దీపావళికి ఇంటిని ఈ లైట్లతో డెకరేట్ చేయండి.. ఆ తప్పులు చేయకండి, కరెంట్ బిల్ తగ్గుతుంది
దీపావళికి ఇంటిని ఈ లైట్లతో డెకరేట్ చేయండి.. ఆ తప్పులు చేయకండి, కరెంట్ బిల్ తగ్గుతుంది
Embed widget