అన్వేషించండి

JEE Main Result 2026 : JEE మెయిన్ ఫలితాలు ఫిబ్రవరి 12న  విడుదల! సెషన్ 1 స్కోర్‌ను ఎలా చెక్‌ చేయాలో తెలుసుకోండి! 

JEE Main Result 2026 : JEE మెయిన్ 2026 సెషన్-1 ఫలితాలు ఫిబ్రవరి 12న విడుదల అవుతుంది, విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.inలో ఫలితాలను చూడొచ్చు.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • JEE మెయిన్ 2026 సెషన్ 1 ఫలితాలు ఫిబ్రవరి 12న విడుదల కానున్నాయి.
  • సెషన్ 1 జనవరి 21-29 తేదీలలో, కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో జరిగింది.
  • సాధారణీకరణ ప్రక్రియ ద్వారా పర్సంటైల్ స్కోర్, ఆల్ ఇండియా ర్యాంక్ నిర్ణయిస్తారు.
  • అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో ఫలితాలు చెక్ చేయాలి.

JEE Main Result 2026 : JEE మెయిన్ 2026 సెషన్ 1 ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. సమాధానాల కీ విడుదలైన తర్వాత, లక్షల మంది విద్యార్థులు ఇప్పుడు ఫలితాల తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, JEE మెయిన్ సెషన్ 1 ఫలితాలు ఫిబ్రవరి 12న ప్రకటిస్తారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.inలో చెక్ చేయాలి. మీ ఫలితాలు ఎలా  తెలుసుకోవాలో ఇక్కడ చూద్దాం.  

NTA ప్రకారం, JEE మెయిన్ 2026 సెషన్ 2 ఏప్రిల్ 2, ఏప్రిల్ 9 మధ్య జరుగుతుంది. సెషన్ 1లో ఆశించిన స్థాయిలో స్కోర్ చేయని విద్యార్థులు సెషన్ 2లో తమ పనితీరును మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది.

JEE మెయిన్ సెషన్ 1 పరీక్ష జనవరి 21-25, జనవరి 28-29 తేదీలలో జరిగింది. పరీక్షా ప్రక్రియ పూర్తిగా సజావుగా జరిగేలా కఠినమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. అభ్యర్థుల గుర్తింపును ధృవీకరించడానికి, పారదర్శకత, ఇబ్బంది లేని ధృవీకరణను నిర్ధారించడానికి పరీక్షా కేంద్రాల్లో ముఖ గుర్తింపు, ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ కన్ఫర్మేషన్‌ను ఉపయోగించారు.

ముందుగా, JEE మెయిన్ ర్యాంకులు ఇప్పుడు వచ్చిన స్కోర్‌ల ద్వారా నిర్ణయించబోరని తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే పరీక్ష చాలా రోజుల పాటు షిఫ్ట్‌ల్లో నిర్వహించారు. దీని వల్ల ఒక్కో రోజు, ఒక్కో షిప్టుల్లో ప్రశ్నాపత్రం ఒక్కోలా ఉంటుంది. ఒకసారి సులభమైన ప్రశ్నాపత్రం వచ్చి ఉంటుంది. మరోసారి కఠినమైన ప్ర్నశ్నాపత్రం వచ్చి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో సులభంగా ప్రశ్నాపత్రం వచ్చిన వాళ్లు కచ్చితంగా మంచి స్కోర్ చేస్తారు. దీని వల్ల కఠినంగా ప్రశ్నాపత్నం వచ్చిన వాళ్లు నష్టపోతారు. అందుకే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి NTA సాధారణీకరణ ప్రక్రియను ఉపయోగిస్తుంది. ఈ సాధారణీకరణ ప్రక్రియ పర్సంటైల్ స్కోర్‌ను నిర్ణయిస్తుంది. దాని ఆధారంగా అఖిల భారత ర్యాంక్ నిర్ణయిస్తారు. 

మీరు మీ స్కోర్ కార్డు చూడాలంటే ఇవి చాలా అవసరం అవుతాయి  

  • అప్లికేషన్ సంఖ్య
  • JEE మెయిన్ సెషన్ 1 రోల్ నంబర్
  • తల్లి పేరు
  • తండ్రి పేరు
  • వర్గం
  • వైకల్య స్థితి (PwD)
  • లింగం
  • పుట్టిన తేదీ
  • జాతీయత
  • అర్హత గల రాష్ట్రాలు
  • గణితంలో పర్సంటైల్ మార్కులు
  • సైన్స్‌లో పర్సంటైల్ మార్కులు
  • భౌతిక శాస్త్రంలో పర్సంటైల్ మార్కులు
  • మొత్తం శాతం మార్కులు

మీరు ఎలా తనిఖీ చేయగలరు?

  • దశ 1: ముందుగా అభ్యర్థులు jeemain.nta.nic.in అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లండి
  • దశ 2: దీని తర్వాత, హోమ్ పేజీలో “జేఈఈ మెయిన్ 2026 ఫలితాల లింక్” లేదా “స్కోర్‌కార్డ్‌ చూడండి” అనే హైపర్ లింక్స్‌పై క్లిక్ చేయండి.
  • దశ 3: ఇప్పుడు అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.
  • దశ 4: స్క్రీన్‌పై కనిపించే క్యాప్చాని సరిగ్గా నమోదు చేయండి.
  • దశ 5: దీని తర్వాత "సమర్పించు" బటన్ పై క్లిక్ చేయండి.
  • దశ 6: మీ JEE మెయిన్ స్కోర్‌కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • దశ 7: స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. తదుపరి అవసరాల కోసం దాని ప్రింటవుట్ తీసుకోండి.

Frequently Asked Questions

JEE మెయిన్ 2026 సెషన్ 1 ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి?

JEE మెయిన్ 2026 సెషన్ 1 ఫలితాలు ఫిబ్రవరి 12న అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in లో విడుదలవుతాయి.

JEE మెయిన్ 2026 సెషన్ 2 ఎప్పుడు జరుగుతుంది?

JEE మెయిన్ 2026 సెషన్ 2 ఏప్రిల్ 2 నుండి ఏప్రిల్ 9 వరకు జరుగుతుంది. సెషన్ 1లో స్కోర్ మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి అవకాశం.

JEE మెయిన్ 2026 ర్యాంకులు ఎలా నిర్ణయిస్తారు?

పరీక్ష వివిధ షిఫ్టులలో నిర్వహించినందున, NTA సాధారణీకరణ ప్రక్రియను ఉపయోగించి పర్సంటైల్ స్కోర్‌ను నిర్ణయిస్తుంది. దీని ఆధారంగా అఖిల భారత ర్యాంక్ నిర్ణయించబడుతుంది.

JEE మెయిన్ స్కోర్‌కార్డ్ చూడటానికి ఏ వివరాలు అవసరం?

స్కోర్‌కార్డ్ చూడటానికి అప్లికేషన్ సంఖ్య, రోల్ నంబర్, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, వర్గం వంటి వివరాలు అవసరం.

టాప్ హెడ్ లైన్స్

Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
AUS Thrashes BAN In 2nd Test: ఐదు సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్.. ఎవ‌రితో అంటే..?
5 సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
AUS Thrashes BAN In 2nd Test: ఐదు సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్.. ఎవ‌రితో అంటే..?
5 సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
Romantic Drama OTT : ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Toxic Pre Release Event : టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
టాక్సిక్ ఈవెంట్‌లో ప్రమాదం - ఇద్దరు విద్యార్థులకు గాయాలు
Embed widget