Results: ఐసీఎస్ఈ, ఐఎస్‌సీ పరీక్షల ఫలితాలు విడుదల, రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే
ICSE: ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ బోర్డు పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 30న విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌తోపాటు డిజిలాకర్‌లోనూ విద్యార్థులు ఫలితాలు చూసుకోవచ్చు.

ICSE 2025 Examination: దేశవ్యాప్తంగా ఐసీఎస్‌ఈ, ఐఎస్‌సీ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షల ఫలితాలను కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్(CISCE) ఏప్రిల్ 30న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమ కోర్సు, యూజర్ ఐడీ, ఇండెక్స్ నెంబరు వివరాలను నమోదుచేసి ఫలితాలు పొందవచ్చు. విద్యార్థులు డిజిలాకర్‌లోనూ తమ ఫలితాలను చూసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 13 నుంచి ఏప్రిల్ 5 వరకు 12వ తరగతి పరీక్షలను; ఫిబ్రవరి 18 నుంచి మార్చి 27 వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించారు.
ఫలితాలు ఇలా చూసుకోండి...
* సీఐఎస్సీఈ అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి- www.cisce.org.
* అక్కడ హోమ్‌పేజీలో ఐసీఎస్ఈ బోర్డు పరీక్ష ఫలితాలు 2024 లేదా ఐఎస్సీ బోర్డు పరీక్ష ఫలితాలు 2024 ఎంచుకోవాలి.
* విద్యార్థులు తమ కోర్సు (ఐసీఎస్ఈ/ఐఎస్సీగా) కోడ్‌ని ఎంచుకోవాలి.
* ఆ తర్వాత యూనిక్ ఐడీ, ఇండెక్స్ నెంబర్, క్యాప్చా వంటి లాగిన్ క్రెడెన్షియల్స్ని నమోదుచేయాలి.
* వివరాలు నమోదుచేసి సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
* ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.అన్ని వివరాలను క్రాస్ చెక్ చేయండి.
* భవిష్యత్తు రిఫరెన్స్ కోసం ఫలితాన్ని డౌన్లోడ్ చేసుకోండి.
ఫలితాలు మే 4 వరకు అందుబాటులో ఉండున్నాయి. ఫలితాలపై సందేహాలుంటే రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా పరీక్షలో తమ మార్కులను మెరుగుపరుచుకోవాలనుకునే అభ్యర్థులు గరిష్టంగా రెండు సబ్జెక్టుల్లో ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. జులైలో ఇంప్రూవ్మెంట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఐసీఎస్ఈ, ఐఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే విద్యార్థులు సబ్జెక్టుల వారీగా వరుసగా కనీసం 35 శాతం, మొత్తం మీద 33 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.





















