By: ABP Desam | Updated at : 23 Jun 2022 05:33 PM (IST)
కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం
Telangana Common Recruitment Board : భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఈ దిశగా కీలకమైన ముందడుగు వేసింది. మరో కొత్త నియామక బోర్డును ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు పేరుతో ఈ నియామక సంస్థ ఏర్పాటయింది. ఈ బోర్డు ద్వారా యూనివర్సిటీల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తారు. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఖాళీల భర్తీని ఈ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు చూసుకుంటుంది. మెడికల్ యూనివర్శిటీలు మినహా మిగిలిన పదిహేను యూనివర్శిటీల్లోనూ ఖాళీలను కూడా కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారానే భర్తీ చేస్తారు. బోర్డు చైర్మన్‌గా ఉన్నత విద్యా మండలి వ్యవహరిస్తారు. కన్వీనర్‌గా కళాశాల విద్యా కమిషన్ మెంబర్, సభ్యులుగా విద్యాశాఖ, ఆర్థిక శాఖ కార్యదర్శులు ఉంటారు.
జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, జీతాలు పెంచాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన
బాసర ఆర్జేయూకేటీ ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో వేల మంది విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేశారు. విద్యార్థుల ఆందోళనతో యూనివర్శిటీల్లో సమస్యలపై కేసీఆర్ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి పూర్తి స్థాయిలో యూనివర్సిటీల్లో ఉద్యోగాల నియామకాలు జరగలేదు. ఇటీవల కేసీఆర్ ప్రకటిచింటిన భారీ ఉద్యోగాల భర్తీలో యూనివర్శిటీలకు సంబందించిన 8,147 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ టీచింగ్ తో పాటు నాన్ టీచింగ్ స్టాఫ్‌కు సంబంధించినవి.
గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ కు షాక్, కాంగ్రెస్ లో చేరిన టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి
టీచింగ్ జాబ్స్‌కుసంబంధించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ యూనివర్సిటీల్లో కలిపి 2,979 అసిస్టెంట్ ప్రొఫెసర్/అసోసియేట్ ప్రొఫెసర్/ ప్రొఫెసర్ పోస్టులకు గానూ 827 మందే పనిచేస్తున్నారని నిరుద్యోగులు చెబుతున్నారు. అంటే 72 శాతం( పోస్టులు ఖాళీగా ఉన్నాయని లెక్కలు చెబుతున్నారు. 2015లో 1,642 డిగ్రీ లెక్చరర్ పోస్టులు, 2017లో యూనివర్సిటీల్లో 1,061 టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చినా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. సమస్యలను అధిగమించాలనే కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు ఆలోచన చేసినట్లుగా తెలుస్తోంది. విశ్వవిద్యాలయాల్లో పరిశోధకులు పెరగాలంటే అధ్యాపకులు సంఖ్య ఎక్కువ ఉండాలి.
సీఎం కేసీఆర్‌కు హైకోర్టు నోటీసులు, మరోనలుగురికి కూడా - గడువు నెల రోజులే
నాన్ టీచింగ్ స్టాఫ్ భర్తీ కూడా కామన్ రిక్రూట్ మెంట్ మెంట్ బోర్డు ద్వారానే జరుగుతుంది కాబట్టి.. ఇక ఆలస్యం లేకుండా ఉద్యోగ నియామకాలు జరుగుతాయని నిరుద్యోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
AP Inter Fees: ‘ఇంటర్’ పరీక్ష ఫీజు చెల్లించడానికి నేడే ఆఖరు, ఆలస్య రుసుముతో ఎప్పటివరకు అవకాశమంటే?
TOSS Results: ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫలితాలు వెల్లడి, ప్రత్యేక ప్రవేశాల గడువు పొడిగింపు
TS SSC Fees: ‘టెన్త్’ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే?
JEE Fee: జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తు ఫీజు పెంపు, కేటగిరీల వారీగా ఫీజు వివరాలు ఇలా
SRM Admissions: ఎస్ఆర్ఎం జాయింట్ ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్-2024 నోటిఫికేషన్ వెల్లడి, ముఖ్యమైన తేదీలివే
Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు
Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!
Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!
Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!
/body>