అన్వేషించండి
Advertisement
High Court Notices To KCR: సీఎం కేసీఆర్‌కు హైకోర్టు నోటీసులు, మరోనలుగురికి కూడా - గడువు నెల రోజులే
టీఆర్ఎస్ హైదరాబాద్ ఆఫీసు కోసం బంజారాహిల్స్ లో 4,935 గజాల స్థలం గజం కేవలం రూ.100కే కేటాయించడంపై పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాలయాలకు భూముల కేటాయింపులపై ఆయనకు హైకోర్టు నోటీసులు అందాయి. ఈ విషయంపై రిటైర్డ్ ఉద్యోగి మహేశ్వర్ రాజ్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. టీఆర్ఎస్ హైదరాబాద్ ఆఫీసు కోసం బంజారాహిల్స్ లో 4,935 గజాల స్థలం ఇవ్వడాన్ని పిటిషనర్ తప్పుబట్టారు. అత్యంత ఖరీదైన భూమిని గజం కేవలం రూ.100కే కేటాయించడంపై పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డితో పాటు సీఎస్, సీసీఎల్‌ఏ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఉన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. నెల రోజుల్లో కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆట
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Dr. Rahul ChaudharyPresident of Administration in NDIIT
Opinion