GHMC Workers Protest : జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, జీతాలు పెంచాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన
GHMC Workers Protest : హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తమకు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు. చలో ప్రగతి భవన్ కు పిలుపునిచ్చారు.
GHMC Workers Protest : హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. జీహెచ్ఎంసీ అవుట్ సోర్సింగ్ఉద్యోగులు ఆందోళనబాట పట్టారు. తమకు కనీస వేతనం రూ. 25 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు ప్రయత్నించారు. రాంకీ అగ్రిమెంట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
చలో ప్రగతి భవన్
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన చేపట్టారు. GHMC కార్యాలయంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అక్కడి నుంచి ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరిన GHMC కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. జీతాలు పెంచాలని కోరుతున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి ప్రగతి భవన్ వరకు ర్యాలీ చేసేందుకు ఉద్యోగులు ప్రయత్నించారు. ప్రగతి భవన్ ముందు చెత్తవేసి నిరసన తెలుపుతామని ఉద్యోగులు అంటున్నారు.
భారీగా మోహరించిన పోలీసులు
తమ సమస్యలు పరిష్కరించాలంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ చలో ప్రగతి భవన్ చేపట్టింది. దీంతో బల్దియా ఆఫీస్ ముందు పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. కార్మికుల నిరసన ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉందన్న కారణంతో పోలీసులు ముందస్తు చర్యగా భారీ భద్రత ఏర్పాటుచేశారు. ఇప్పటికే జీహెచ్ఎంసీకి సంబంధించిన ఆరు జోనల్ ఆఫీసుల ముందు నిరసన చేసిన ఎంప్లాయిస్ యూనియన్ నేతలు ఇవాళ చలో ప్రగతి భవన్ కు పిలుపునివ్వడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే కార్మికులు నిరసన కార్యక్రమాన్ని సజావుగా శాంతియుతంగా జరుపుకోవాలని పోలీసులు హెచ్చరించారు. ముందు జాగ్రత్తగా దాదాపు 200 మందికి పైగా పోలీసులు జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద భద్రత చూస్తున్నారు. కాంట్రాక్టు కార్మికుల ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని, అలాగే జీతాలు పెంచాలని కార్మికులు ఆందోళన చేస్తున్నారు.