అన్వేషించండి

GATE - 2023 Results: నేడే 'గేట్ - 2023' పరీక్ష ఫలితాలు! రిజల్ట్స్ వెల్లడి సమయమిదే!

అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. అయితే గేట్-2023 స్కోరు కార్డులు మాత్రం మార్చి 25 నుంచి అందుబాటులో ఉండనున్నాయి.

*  సాయంత్రం 4 గంటల తర్వాత ఫలితాలు అందుబాటులో

* మార్చి 21 నుంచి స్కోరుకార్డులు 

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2023 పరీక్ష ఫలితాలు మార్చి 16న విడుదల కానున్నాయి. సాయంత్రం 4 గంటల తర్వాత ఫలితాలు అందుబాటులో ఉండనున్నాయి. అభ్యర్థులు తమ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. అయితే గేట్-2023 స్కోరు కార్డులు మాత్రం మార్చి 21 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫలితాలతోపాటు ఫైనల్ కీని కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఐఐటీ కాన్పూర్ ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 21న ఆన్సర్ కీని విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 22 నుంచి ఫిబ్రవరి 25 వరకు అభ్యంతరాలు స్వీకరించింది.  

గేట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 7 ఐఐటీల(బొంబయి, ఢిల్లీ, గువాహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ)తో పాటు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్ ఆఫ్ సైన్స్, ఇతర ప్రభుత్వరంగ విద్యాసంస్థల్లో డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర ప్రైవేట్ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు కూడా గేట్ స్కోరునే ప్రవేశాలకు ప్రామాణికంగా తీసుకుంటాయి. కొన్ని ప్రభుత్వ సంస్థలు గేట్ స్కోరు ద్వారా ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తున్నాయి. గేట్ ద్వారా ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలతో పాటు డాక్టోరల్ పోగ్రామ్స్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. విద్యార్థులు గేట్‌ పరీక్షలో సాధించిన స్కోరు ఫలితాల వెల్లడి నుంచి 3 సంవత్సరాల పాటు వర్తిస్తుంది.

బ్రాంచ్‌లవారీగా కటాఫ్ మార్కులు ఇలా..

➥ కంప్యూటర్ సైన్స్ (సీఎస్): జనరల్ ➜ 25-30 మార్కులు, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ ➜ 22-27 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు ➜ 16-20 మార్కులు. 

➥ సివిల్ ఇంజినీరింగ్ (సీఈ): జనరల్ ➜ 25-32 మార్కులు, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ ➜ 22-28 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు ➜ 16-22 మార్కులు.

➥ మెకానికల్ ఇంజినీరింగ్ (ఎంఈ): జనరల్ ➜ 30-36 మార్కులు, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ ➜ 28-32 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు ➜ 20-25 మార్కులు.

➥ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ (ఈఈ): జనరల్ ➜ 25-32 మార్కులు, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ ➜ 22-30 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు ➜ 16-22 మార్కులు.

➥ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీ): జనరల్ ➜ 25-30 మార్కులు, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ ➜ 22-26 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు ➜ 16-22 మార్కులు.

➥ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీ): జనరల్ ➜ 25-30 మార్కులు, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ ➜ 22-26 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు ➜ 16-22 మార్కులు. 

Also Read:

'బయోటెక్నాలజీ'లో పీజీ, జేఆర్‌ఎఫ్ ప్రవేశాలకు నోటిఫికేషన్, పరీక్షలు ఎప్పుడంటే?
బయోటెక్నాలజీ, దాని అనుబంధ విభాగాల్లో పీజీ కోర్సుల్లో 2023 -24 ప్రవేశాలకు సంబంధించి 'గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ - బయోటెక్నాలజీ (GAT-B) 2023' నోటిఫికేషన్ వెలువడింది. అదేవిధంగా జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ల కోసం నిర్వహించే 'బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (BET)-2023' నోటిఫికేషన్‌ను కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఈ పరీక్షలో సాధించిన మెరిట్‌ ద్వారా వివిధ విద్యాసంస్థలు, యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశ పరీక్షలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 10న ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
ప్రవేశపరీక్షల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
దేశంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో సైన్స్ విభాగంలో లెక్చరర్‌షిప్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్ (జేఆర్‌ఎఫ్) అర్హత కోసం  'సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్' పరీక్ష నిర్వహిస్తున్న సంగతి విదితమే. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్), నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సంయుక్తంగా ఏడాదికి రెండుసార్లు (జూన్, డిసెంబరు) ఈ అర్హత పరీక్షను నిర్వహిస్తాయి. ఈ ఏడాదికి గాను 'సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్- డిసెంబరు 202/ జూన్ 2023' నోటిఫికేషన్ వెలువడింది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 10న ప్రారంభమైంది. అభ్యర్థులు ఏప్రిల్ 10 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తులు సమర్పించవచ్చు.
సీఎస్‌ఐఆర్-యూజీసీ నెట్ దరఖాస్తు కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget