GATE Exam Centers: 'గేట్' అభ్యర్థులకు 'గ్రేట్' న్యూస్, పెరిగిన పరీక్ష కేంద్రాలు - ఆ జిల్లాల్లోనూ సెంటర్లు!
తెలంగాణలో 'గేట్-2023' పరీక్ష కేంద్రాల సంఖ్య పెరిగింది. కొత్తగా 6 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో గేట్ పరీక్ష కేంద్రాల సంఖ్య 7 నుంచి 11కు పెరిగింది.
తెలంగాణలో 'గేట్-2023' పరీక్ష కేంద్రాల సంఖ్య పెరిగింది. కొత్తగా 4 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో గేట్ పరీక్ష కేంద్రాల సంఖ్య 7 నుంచి 11కు పెరిగిందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఈ మేరకు నవంబరు 26న ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా మెదక్, నల్గొండ, అదిలాబాద్, కొత్తగూడెంలలోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గతంలో తాను రాసిన లేఖకు స్పందించారని.. ఈ క్రమంలో గేట్-2023 పరీక్షల నిర్వహణ కమిటీ తాజా నిర్ణయం తీసుకుందని కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడిక విద్యార్థులు పూర్తి సమయాన్ని సన్నద్ధతకు కేటాయించి మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరుతూ ఆయన ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో గతంలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్ నగరాల్లోనే గేట్ పరీక్ష నిర్వహించేవారు. ఈ నేపథ్యంలో పరీక్ష రాసేందుకు తెలంగాణ విద్యార్థులు వ్యయప్రయాసలు ఎదుర్కొంటున్న తీరును వివరిస్తూ కిషన్ రెడ్డి లేఖ రాయడంతో తాజా నిర్ణయం వెలువడింది.
గతంలో నేను రాసినలేఖకు స్పందించి తెలంగాణలో గేట్ పరీక్షాకేంద్రాలను పెంచుతూ నిర్ణయంతీసుకున్న @EduMinOfIndia శ్రీ @dpradhanbjp గారికి,గేట్-2023 పరీక్షలనిర్వహణ కమిటీకి కృతజ్ఞతలు.
— G Kishan Reddy (@kishanreddybjp) November 26, 2022
విద్యార్థులు ఇకపై పూర్తిసమయాన్ని పరీక్షలకు సన్నద్ధంఅవటంపై కేటాయించి మంచిఉత్తీర్ణత సాధించాలనికోరుతున్నాను. pic.twitter.com/jtWBxSD4aW
ఐఐటీ కాన్పూర్ జులై 27న 'గేట్-2023' నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 30 నుంచి అక్టోబరు 14 వరకు దరఖాస్తులు స్వీకరించింది. గేట్-2023 పరీక్షలను 2023లో ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో నిర్వహించనున్నారు. మొత్తం 29 సబ్జెక్టుల్లో గేట్ పరీక్ష నిర్వహిస్తారు. మార్చి 16న ఫలితాలను వెల్లడించనున్నారు.
పరీక్ష విధానం..
✦ మొత్తం 29 సబ్జెక్టుల్లో గేట్ పరీక్ష నిర్వహిస్తారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాలతోపాటు.. ఇతర దేశాలలోని నగరాల్లో కూడా గేట్ పరీక్ష నిర్వహిస్తారు.
✦ ప్రకటించిన తేదీల్లో మొత్తం రెండు సెషన్లలో గేట్ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.
✦ ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే గేట్ పరీక్షలో 100 మార్కులకు 65 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి 10 ప్రశ్నలకుగాను 15 మార్కులు; టెక్నికల్, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ విభాగాల నుంచి 55 ప్రశ్నలకుగాను 85 మార్కులు ఉంటాయి.
✦ నెగెటివ్ మార్కులు కూడా ఉన్నాయి. 1 మార్కు ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానానాకి 1/3 చొప్పున, 2 మార్కుల ప్రశ్నలకు ప్రతి తప్పు సమాధానానాకి 2/3 చొప్పున కోత విధిస్తారు.
గేట్-2023 నోటిఫికేషన్, పరీక్ష పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
క్రాఫ్ట్స్ & డిజైనింగ్ కోర్సుల్లో ప్రవేశాలు, ఐఐసీడీ నోటిఫికేషన్ జారీ!!
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్ (ఐఐసీడీ) 2023 విద్యాసంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. దీని ద్వారా బీ.డిజైన్, ఎం.డిజైన్, ఎం.వొకేషన్ కోర్సుల్లో సీట్ల భర్తీ చేయనున్నారు. కోర్సుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. డిగ్రీ కోర్సులకు ఇంటర్ అర్హత ఉండాలి. పీజీ కోర్సులకు సంబంధి విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సరైన అర్హతలున్న అభ్యర్ధులు జనవరి 21లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
'ఫ్యాషన్' కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు ప్రారంభం- చివరితేది ఎప్పుడంటే?
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ప్రవేశాలకు నిర్దేశించిన 'NIFT-2023' రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబరు 1న ప్రారంభమైంది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబరు 31 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.3000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.1500 చెల్లిస్తే సరిపోతుంది.
నోటిఫికేషన్, కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..