(Source: ECI/ABP News/ABP Majha)
CBSE: అప్పటిదాకా స్కూల్స్ తెరవొద్దు, సీబీఎస్‌ఈ వార్నింగ్!
పాఠశాలల రీఓపెనింగ్ విషయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తన అనుబంధ పాఠశాలలను హెచ్చరించింది. ఏప్రిల్ 1 లోపు పాఠశాలలను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవొద్దని ఆదేశించింది.
పాఠశాలల రీఓపెనింగ్ విషయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తన అనుబంధ పాఠశాలలను హెచ్చరించింది. ఏప్రిల్ 1 లోపు పాఠశాలలను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవొద్దని ఆదేశించింది. కాదని యాజమాన్యాలు క్లాసులు ప్రారంభిస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. పది, పన్నెండో తరగతి విద్యార్థులకు అకడమిక్ సంవత్సరం ప్రారంభానికి ముందే క్లాసులు ప్రారంభిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో సీబీఎస్ ఈ తాజాగా ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
అకడమిక్ సంవత్సరం ప్రారంభానికి ముందే కొన్ని సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలలు క్లాసులు ప్రారంభిస్తున్నాయని మా దృష్టికి వచ్చింది. నిర్దేశించిన సమయం కంటే ముందుగానే సిలబస్ పూర్తి చేసేందుకు ప్రయత్నించడం వల్ల విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో వాళ్లు తీవ్ర అందోళనకు గురవుతారు. ప్రశాంతంగా నేర్చుకునేందుకు వీలుండదు.
సీబీఎస్‌ఈ పాఠశాలల్లో లైఫ్ స్కిల్స్, ఆరోగ్యం, వ్యాయామం, సామాజిక సేవ తదితర బోధనేతర అంశాలపై దృష్టి సారించేందుకు విద్యార్థులకు పాఠశాలలు తగినంత సమయం ఇవ్వడం లేదని, దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అనురాగ్ తెలిపారు. విద్యార్థికి చదువుతోపాటు బోధనేతర అంశాలు కూడా ముఖ్యమే. సీబీఎస్‌ఈ అనుంబంధ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, యాజమాన్యాలు బోర్డు జారీ చేసిన షెడ్యూల్‌ను కచ్చితంగా అమలు చేయాల్సిందే. ఏప్రిల్ 1 నుంచి తిరిగి మార్చి 31 వరకు సీబీఎస్‌ఈ నిర్దేశించిన షెడ్యూల్ యథాతథంగా అమలయ్యేలా వారు చర్యలు తీసుకోవాలి అని అనురాగ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
CBSE warns schools against starting new academic session before April 1: Board Secretary Anurag Tripathi
— Press Trust of India (@PTI_News) March 18, 2023
పదోతరగతి, పన్నెండో తరగతి విద్యార్థులకు సీబీఎస్ఈ ప్రస్తుతం బోర్డు పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ రెండు తరగతులకు ఫిబ్రవరి 15న పరీక్షలు ప్రారంభమయ్యాయి. పదో తరగతి విద్యార్థులకు మార్చి 21న, పన్నెండో తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 5తో పరీక్షలు ముగియనున్నాయి.
Also Read:
ఏపీ పదోతరగతి హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే!
ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 3 నుంచి ప్రారంభంకానున్న పదోతరగతి వార్షిక పరీక్షల హాల్‌టిక్కెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టిక్కెట్లను అందుబాటులో ఉంచారు. ఏపీలో ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదోతరగతి వార్షిక పరీక్షలు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయా తేదీల్లో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు తమ జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీని వివరాలు నమోదుచేసి హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
AP SSC Exams: పదోతరగతి విద్యార్థులకు అలర్ట్, పరీక్షల్లో ఈ సారి కొత్త నిబంధనలు
ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికారులు పరీక్షల షెడ్యూలును కూడా విడుదల చేశారు. మరోవైపు పదోతరగతి వార్షిక పరీక్షల హాల్‌టిక్కెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టిక్కెట్లను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీని వివరాలు నమోదుచేసి హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరీక్షల విభాగం తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..