By: ABP Desam | Updated at : 04 Apr 2023 04:55 PM (IST)
Edited By: omeprakash
పేపరు లీక్‌పై మంత్రి సబిత స్పందన
పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం వాట్సాప్‌లో వైరల్ అవడాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా పరిగణించారు. ఘటనపై ఆరా తీసిన ఆమె.. వరంగల్, హనుమకొండ డీఈవోలతో ఇప్పటికే మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పదోతరగతి పరీక్షలు ప్రారంభమైన తొలి రెండు రోజులు వరుసగా తెలుగు, హిందీ ప్రశ్నపత్రాలు బయటకు రావడంపై ఆమె స్పందిస్తూ.. పరీక్షల నిర్వహణ విషయంలో వ్యవహరించాల్సిన తీరుపై వివిధ శాఖల అధికారులకు ట్విటర్ ద్వారా పలు సూచనలు చేశారు.
పదోతరగతి పరీక్షల విషయంలో జిల్లాల కలెక్టర్లు, విద్యా శాఖ అధికారులు, ఉపాధ్యాయులు, పాఠశాలల యాజమాన్యాలు, పోలీసు విభాగం, పోస్టల్, వైద్యారోగ్య శాఖ, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో పనిచేయాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. 4.95 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బాధ్యతాయుతంగా పనిచేద్దాం. మొదటిసారి బోర్డు పరీక్షలు రాస్తున్న చిన్నారులను గందరగోళానికి గురిచేయాలని ఎవరు ప్రయత్నించినా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. విద్యార్థుల భవిష్యత్తు విషయంలో రాజకీయ, వ్యక్తిగత స్వార్థాన్ని వీడాలి అని మంత్రి సబిత విజ్ఞప్తి చేశారు.
పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రశ్నపత్రాలు బయటకు రావడంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పదోతరగతి పరీక్షల నిర్వహణపై కలెక్టర్లు, ఎస్పీలతో సాయంత్రం 5 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు.
— SabithaReddy (@SabithaindraTRS) April 4, 2023
Also Read:
తెలంగాణలో నేడు హిందీ పేపర్ లీక్ - కాసేపటికే వాట్సప్‌లో చక్కర్లు!
తెలంగాణలో పదో తరగతి పరీక్షల రెండో రోజు కూడా ప్రశ్నపత్రం లీక్ అయింది. నేడు హిందీ పరీక్ష జరుగుతుండగా, పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే హిందీ పేపర్ బయటికి వచ్చింది. దీన్ని వాట్సప్ గ్రూపులో కొందరు షేర్ చేసుకున్నారు. వరంగల్ జిల్లాలో ఈ పేపర్ లీక్ జరిగింది. వరుసగా రెండో రోజు కూడా పదో తరగతి పరీక్షా పత్రం లీక్ కావడం సంచలనంగా మారింది. SSC స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూప్ లో ఈ హిందీ ప్రశ్న పత్రం ప్రత్యక్షం అయినట్లుగా తెలుస్తోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మిగతా 'పది' పరీక్షలు షెడ్యూలు ప్రకారమే, ఇన్విజిలేటర్ల సెల్‌ఫోన్లపై ప్రత్యేక దృష్టి!
వికారాబాద్ జిల్లా తాండూరులోని ప్రభుత్వ పాఠశాల-1లో సోమవారం ఉదయం తెలుగు ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 4న జరిగే పరీక్ష వాయిదా వేసినట్లు సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ కథనాలపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ స్పందించింది. ఏప్రిల్ 4న జరుగనున్న పదోతరగతి పరీక్ష వాయిదా పడలేదని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ఏప్రిల్ 4 నుంచి 13 వరకు అన్ని పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. ఇక తెలుగు ప్రశ్నాపత్రాన్ని వాట్సాప్ ద్వారా బయటకు పంపిన వ్యవహారంలో నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ప్రకటించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
SRTRI: నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ, ఆపై ఉద్యోగాలు!
తెలంగాణలోని గ్రామీణ నిరుద్యోగ యువతకు వివిధ కోర్సులో ఉచిత నైపుణ్య శిక్షణ కోసం యాదాద్రి భువనగిరి జిల్లా జలాల్‌పూర్ గ్రామంలోని స్వామి రామానందతీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ దరఖాస్తులు కోరుతోంది. కేంద్ర ప్రభుత్వ పథకమైన 'దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన' కింద ఈ శిక్షణ కొనసాగనుంది. ఈ నైపుణ్య కోర్సులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉండి.. 8వ తరగతి, ఇంటర్, డిప్లొమా, ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు ఉచిత నివాస, భోజన వసతులు కల్పిస్తారు. ఈ శిక్షణ కోర్సుల్లో ప్రవేశాలు కోరేవారు ఒరిజినల్ సర్టిఫికేట్లతో ఏప్రిల్ 10న సంస్థలో హాజరుకావాల్సి ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
AP RGUKT IIIT admissions 2023: ఏపీ ట్రిపుల్ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, ఎంపిక ఇలా!
AP SSC Exams: నేటి నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!
VIDYADHAN: పేద విద్యార్థులకు సహకారం - ‘విద్యాధన్’ ఉపకారం! ఎంపిక, స్కాలర్షిప్ వివరాలు ఇలా!
CBSE Exams: సీబీఎస్ఈ 10, 12 తరగతి సప్లిమెంటరీ పరీక్షల డేట్ షీట్స్ విడుదల! ఏ పరీక్ష ఎప్పుడంటే?
CMAT Result 2023: సీమ్యాట్-2023 ఫలితాలు విడుదల, స్కోరు కార్డు ఇలా పొందండి!
Coromandel Train Accident: కవచ్ సిస్టమ్ ఉండి ఉంటే ప్రమాదం జరిగేది కాదా? ప్రతిపక్షాల వాదనల్లో నిజమెంత?
Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు- నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!
Jabardasth Prasad Health : 'జబర్దస్త్' ప్రసాద్‌కి సీరియస్, ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు - దాతల కోసం ఇమ్మాన్యుయేల్ పోస్ట్
Coromandel Train Accident: సరిగ్గా 14 ఏళ్ల క్రితం, ఇదే రైలు, శుక్రవారమే ఘోర ప్రమాదం