అన్వేషించండి

CUET UG 2024 Admit Cards: సీయూఈటీ యూజీ 2024 అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్, డౌన్‌లోడ్ చేసుకోండి - పరీక్షల షెడ్యూలు ఇలా

దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ''సీయూఈటీ యూజీ - 2024' పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ' మే 13న విడుదల చేసింది.

CUET UG Admitcards: దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ యూజీ-2024' పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ' మే 13న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచింది. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సిటీ ఇంటిమేషన్ స్లిప్స్‌ను మాత్రమే ఎన్టీఏ విడుదల చేసిన ఎన్టీఏ తాజాగా హాల్‌టికెట్లను విడుదల చేసింది. మొత్తం 261 కేంద్ర, రాష్ట్ర, ప్రైవేటు విశ్వవిద్యాలయ ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఈ పరీక్షలకు 13.4లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

సీయూఈటీ యూజీ 2024 అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి..

పరీక్ష విధానం: యూజీ పరీక్ష మూడు సెక్షన్లుగా జరుగుతుంది. మొదటి సెక్షన్(1ఎ, 1బి) లాంగ్వేజ్‌లో, రెండో సెక్షన్ స్పెసిఫిక్ సబ్జెక్టులో, మూడో సెక్షన్ జనరల్ టెస్ట్‌లో మల్టిఫుల్ ఛాయిస్ ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు 5 మార్కులు. తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. మొదటి సెక్షన్‌లో 50 ప్రశ్నలకు గానూ 40 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. రెండో సెక్షన్‌లోనూ 50 ప్రశ్నలకు గానూ 40 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. మూడో సెక్షన్‌లో 60 ప్రశ్నలకు గానూ 50 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.

సీయూఈటీ యూజీ 2024 పరీక్షల షెడ్యూలు..

ఏపీలోని పరీక్ష కేంద్రాలు: అమలాపురం, అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గుడ్లవల్లేరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లి, మార్కాపురం, నంద్యాల, నెల్లూరు, ఒంగోలు, పాపుంపరే, ప్రొద్దుటూరు, పుట్టపర్తి, పుత్తూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తాడిపర్తి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

తెలంగాణలోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్/సికింద్రాబాద్, జగిత్యాల, జనగామ, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, గద్వాల, హయత్‌నగర్.

"కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ(CUET UG)-2024" నోటిఫికేషన్‌ను 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA)' ఫిబ్రవరి 27న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఫిబ్రవరి 27న ప్రారంభించింది. సరైన అర్హతలున్నవారు మార్చి 26 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తులు సమర్పించవచ్చు. మార్చి 28, 29 తేదీల్లో దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. 

సీయూఈటీ యూజీ స్కోరు ప్రవేశ పరీక్ష స్కోరు ఆధారంగా దేశంలోని కేంద్రీయ వర్సిటీలతోపాటు, ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీలు సైతం ప్రవేశాలు కల్పిస్తాయి. వీటిలో 12 రాష్ట్ర యూనివర్సిటీలు, 11 డీమ్డ్ వర్సిటీలు, 19 ప్రైవేటు యూనివర్సిటీలతో కలిపి మొత్తం 99 యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 13 భాషల్లో సీయూఈటీ యూజీ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఏదైనా ఒక లాంగ్వేజ్ పరీక్షను తప్పక రాయాల్సి ఉంటుంది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాలం, హిందీ, ఉర్దూ, గుజరాతీ, మరాఠీ, అస్సామీ, పంజాబీ, బెంగాళీ, ఒరియా, ఇంగ్లిష్‌లలో ఏదైనా ఒక భాషను ఎంచుకోవచ్చు.

ALSO READ:

ఏఐసీటీఈ అకడమిక్ క్యాలెండర్ విడుదల
దేశంలోని సాంకేతిక విద్యాసంస్థల్లో ఈ ఏడాది ఇంజినీరింగ్ విద్యాసంవత్సర ప్రణాళికను (AICTE Academic Calendar) అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) విడుదల చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 15 నాటికి ఇంజినీరింగ్ మొదటి సంవత్సర తరగతులు ప్రారంభించాలని కళాశాలలకు ఏఐసీటీఈ స్పష్టం చేసింది. ఈ మేరకు 2024-25 విద్యా సంవత్సర ప్రణాళిక తేదీలను ఖరారు చేసింది. ఇంజినీరింగ్ కళాశాలలకు జూన్ 30 నాటికి తుది అనుమతులు జారీ చేస్తామని, ఆయా విశ్వవిద్యాలయాలు, బోర్డులకు జులై 31లోపు అనుబంధ గుర్తింపు (Affiliation) ఇవ్వాలని ఆదేశించింది.
అకడమిక్ క్యాలెండర్ కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

రెండో వన్డేలో టీమిండియాలో భారీ మార్పులు.. సుందర్ స్థానంలో కొత్త ప్లేయర్‌కు ఛాన్స్
రెండో వన్డేలో టీమిండియాలో మార్పులు.. సుందర్ స్థానంలో కొత్త ప్లేయర్‌కు ఛాన్స్
Donald Trump Tariffs: ఇరాన్ తో వ్యాపారం చేస్తే అమెరికా 25 శాతం టారిఫ్.. ఈ దేశాలపై నేరుగా ప్రభావం
ఇరాన్ తో వ్యాపారం చేస్తే అమెరికా 25 శాతం టారిఫ్.. ఈ దేశాలపై నేరుగా ప్రభావం
YS Jagan: బెంగళూరులోనే ఎక్కువ కాలం జగన్ - కుట్రల కోసమేనని టీడీపీ ఆరోపణలు - ఏపీలో ఎందుకు ఉండలేరు?
బెంగళూరులోనే ఎక్కువ కాలం జగన్ - కుట్రల కోసమేనని టీడీపీ ఆరోపణలు - ఏపీలో ఎందుకు ఉండలేరు?
Bangladesh Crime News: బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య, తీవ్ర గాయాలతో మృతదేహం లభ్యం
బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య, తీవ్ర గాయాలతో మృతదేహం లభ్యం

వీడియోలు

Rohit Sharma Records Ind vs NZ ODI | క్రిస్ గేల్ రికార్డును అధిగమించిన హిట్‌మ్యాన్
RCB vs UP WPL 2026 | ఆర్సీబీ సూపర్ విక్టరీ
Washington Sundar Ruled Out | గాయంతో బాధ‌ప‌డుతున్న వాషింగ్ట‌న్ సుంద‌ర్
Devdutt Padikkal record in Vijay Hazare Trophy | దేవదత్ పడిక్కల్ అరుదైన రికార్డు
Haimendorf 39th Death Anniversary | ఆదివాసీల ఆత్మబంధువు పేరు భావి తరాలకు నిలిచిపోయేలా చేస్తాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
రెండో వన్డేలో టీమిండియాలో భారీ మార్పులు.. సుందర్ స్థానంలో కొత్త ప్లేయర్‌కు ఛాన్స్
రెండో వన్డేలో టీమిండియాలో మార్పులు.. సుందర్ స్థానంలో కొత్త ప్లేయర్‌కు ఛాన్స్
Donald Trump Tariffs: ఇరాన్ తో వ్యాపారం చేస్తే అమెరికా 25 శాతం టారిఫ్.. ఈ దేశాలపై నేరుగా ప్రభావం
ఇరాన్ తో వ్యాపారం చేస్తే అమెరికా 25 శాతం టారిఫ్.. ఈ దేశాలపై నేరుగా ప్రభావం
YS Jagan: బెంగళూరులోనే ఎక్కువ కాలం జగన్ - కుట్రల కోసమేనని టీడీపీ ఆరోపణలు - ఏపీలో ఎందుకు ఉండలేరు?
బెంగళూరులోనే ఎక్కువ కాలం జగన్ - కుట్రల కోసమేనని టీడీపీ ఆరోపణలు - ఏపీలో ఎందుకు ఉండలేరు?
Bangladesh Crime News: బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య, తీవ్ర గాయాలతో మృతదేహం లభ్యం
బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య, తీవ్ర గాయాలతో మృతదేహం లభ్యం
Bhartha Mahasayulaku Wignyapthi OTT : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' వచ్చేది ఆ ఓటీటీలోకే - ఈ టీవీ ఛానల్‌లో రవితేజ మూవీ చూసెయ్యండి
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' వచ్చేది ఆ ఓటీటీలోకే - ఈ టీవీ ఛానల్‌లో రవితేజ మూవీ చూసెయ్యండి
యూజ్డ్‌ Hyundai Venue కొనాలనుకుంటున్నారా? ముందుగా ఇవి తెలుసుకోకపోతే మీరు మోసపోతారు!
సెకండ్‌ హ్యాండ్‌ Hyundai Venue కొనే ముందే కారులో ఇవి చూడండి, లేదంటే బోల్తా పడతారు!
Andhra Pradesh News: ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
Human Immortality: మనిషికి మరణం లేకుండా అమృతం తయారు చేస్తున్నారా? ఈ పనిలో ఏయే దేశాలు నిమగ్నమై ఉన్నాయో తెలుసా?
మనిషికి మరణం లేకుండా అమృతం తయారు చేస్తున్నారా? ఈ పనిలో ఏయే దేశాలు నిమగ్నమై ఉన్నాయో తెలుసా?
Embed widget