CUET - UG 2022: రద్దయిన సీయూఈటీ-యూజీ పరీక్షలు ఎప్పుడంటే?
దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యాసంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ల కోసం CUET 2022 నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
సాంకేతికమైన, పరిపాలనాపరమైన సమస్యలు తలెత్తడంతో ఆగస్టు 4 నుంచి 6 వరకు వాయిదా పడిన సీయూఈటీ-యూజీ(CUET-UG ) పరీక్షను ఆగస్టు 24, నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) తెలిపింది. వీరికి కొత్త అడ్మిట్ కార్డులు జారీ చేస్తామని పేర్కొంది. తొలుత ఆగస్టు 12, 14 తేదీల్లో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. కానీ, వరుస పండుగల నేపథ్యంలో పరీక్ష తేదీల్ని మార్చాలని పలువురు విద్యార్థులు విజ్ఞప్తి చేసినట్లు ఎన్టీఏ తెలిపింది. దీంతో కొత్త తేదీల్ని ప్రకటిస్తున్నట్లు పేర్కొంది.
దేశంలోని విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష (CUET-UG ) నిర్వహించారు. సాంకేతికమైన, పరిపాలనాపరమైన సమస్యలు తలెత్తడంతో కొన్ని కేంద్రాల్లో తొలి విడత, మొత్తం 489 కేంద్రాల్లో రెండో విడత పరీక్ష రద్దయ్యింది. ఈ నేపథ్యంలో మరోసారి పరీక్షలు నిర్వహించాల్సి వస్తోంది.
దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యాసంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ల కోసం కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (CUET 2022) నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జులై 15, 16,19, 20; ఆగస్టు 4, 5, 6,7, 8, 10 తేదీల్లో CUET -2022 పరీక్షలను నిర్వహించడానికి ఎన్టీఏ ఈ మేరకు షెడ్యూలు ఖరారుచేసింది. ఈ పరీక్ష కోసం దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విద్యా సంవత్సరం 12వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు CUET UG 2022 పరీక్షలకు హాజరవుతున్నారు.
పరీక్ష విధానం:
- CUET UG 2022 పరీక్ష కోసం UGC ప్రత్యేకంగా సిలబస్‌ను జారీ చేయలేదు. ఈ పరీక్ష NCERT సిలబస్ ఆధారంగా ఉంటుంది. పరీక్ష సిలబస్ పూర్తిగా 12వ తరగతి NCERT సిలబస్‌పై ఆధారపడి ఉంటుంది. CUET 2022లోని 27 సబ్జెక్ట్‌లలో ఒక విద్యార్థి గరిష్టంగా ఆరు డొమైన్‌లను ఎంచుకోవచ్చు.
- CUET UG 2022 ఎగ్జామ్‌లో సెక్షన్-IA, సెక్షన్-IB , సెక్షన్-II (డొమైన్-స్పెసిఫిక్ టాపిక్స్), సెక్షన్-III (జనరల్ టెస్ట్) వంటి నాలుగు సెక్షన్లు ఉంటాయి. మొదటి మూడు సెక్షన్‌లలో మొత్తం 50 ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్-III లో 75 ప్రశ్నలు ఉంటాయి.
- మొదటి మూడు సెక్షన్లకు 45 నిమిషాల చొప్పున సమయం ఉంటుంది. జనరల్ టెస్ట్ సెక్షన్‌కు 60 నిమిషాలు ఉంటుంది. ఇందులో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్, లాజికల్ అండ్ ఎనలిటికల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.
- అభ్యర్థులు హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ, పంజాబీ, ఒరియా, ఇంగ్లిష్ వంటి 13 భాషలలో ఒక భాషను ఎంపిక చేసుకుని పరీక్ష రాయవచ్చు.
Also Read:
హైదరాబాద్ విద్యార్థికి బంపర్ ఆఫర్, ఏకంగా రూ.1.30కోట్ల స్కాలర్‌షిప్!!
బీసీ విద్యార్థులకు గుడ్‌న్యూస్, పీఎం యశస్వీ స్కాలర్‌షిప్ దరఖాస్తులు షురూ!
పేద విద్యార్థుల జీవితాల్లో ‘పరివర్తనం’ - హెచ్‌డీఎఫ్‌సీ పరివర్తన్ స్కాలర్‌షిప్
పేద విద్యార్థులకు 'ఉపకారం' - పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేశారా?
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..