CLAT 2022 : జూన్ నెలలో క్లాట్ ఎగ్జామ్, ముఖ్యమైన తేదీలు, ఫీజు వివరాలు ఇవీ!
CLAT 2022 : దేశంలో న్యాయ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ లా అడ్మిషన్ పరీక్ష వెలువడింది. జూన్ 19న దేశవ్యాప్తంగా పరీక్ష నిర్వహించనున్నారు.
CLAT 2022 : జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల కన్సార్టియం కామన్ లా అడ్మిషన్ టెస్ట్ లేదా CLAT 2022 పరీక్ష వాయిదా పడింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ consortiumofnlus.ac.inలో నోటీసును చూడవచ్చు. CLAT 2022 పరీక్ష మే 8న జరగాల్సి ఉంది. అయితే సవరించిన షెడ్యూల్ ప్రకారం CLAT-2022 UG PG ప్రోగ్రామ్‌ల కోసం జూన్ 19 (ఆదివారం) మధ్యాహ్నం 2.00 నుంచి 4.00 PM మధ్య నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
లాస్ట్ డేట్ మే 9
అంతేకాకుండా CLAT-2022 ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ మే 9 వరకు పొడిగించింది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తులను సమర్పించవచ్చు. న్యాయ విశ్వవిద్యాలయాల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ LLB, LLM కోర్సుల్లో ప్రవేశం కోసం CLAT పరీక్ష నిర్వహిస్తున్నారు. మొత్తం 22 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు (NLUలు) BA LLB, B Sc LLB, BBA LLB, B Com LLB, BSW LLB, LLM ప్రోగ్రామ్‌లలో ప్రవేశం కోసం CLAT స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటాయి. NLUలు LLB కోర్సులో 2,538 సీట్లు, LLM కోర్సులో 742 సీట్లు అందిస్తున్నాయి.
5% సడలింపు
12వ తరగతి ఉత్తీర్ణత లేదా బోర్డ్ పరీక్షలో హాజరయ్యే అభ్యర్థులు CLAT UGకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. LLB పూర్తి చేసిన లేదా LLB ప్రోగ్రామ్ చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులు CLAT LLM కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు అర్హత పరీక్షలో 45% మార్కులు లేదా దానికి సమానమైన గ్రేడ్‌ను స్కోర్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 40% మార్కులు స్కోర్ చేయాల్సి ఉంటుంది. CLAT 2021 PG ద్వారా LLM అడ్మిషన్ కోసం అభ్యర్థులు LLB డిగ్రీలో కనీసం 50% మార్కులు లేదా సమానమైన గ్రేడ్ కలిగిఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు 5% సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుం
జనరల్/OBC/PWD/NRI/PIO/OCI అభ్యర్థులకు ఆన్‌లైన్ దరఖాస్తు రుసుము రూ. 4,000. SC/ST/BPL కేటగిరీ అభ్యర్థులకు రూ. 3,500. అభ్యర్థులు, UG కోర్సుల కోసం దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసే ముందు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది.
CLAT 2022 కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి :
- consortiumofnlus.ac.in అధికారిక వెబ్‌సైట్‌పై క్లిక్ చేయండి
- “CLAT 2022” రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి
- పూర్తి వివరాలు నమోదు చేసుకుని దరఖాస్తు ప్రక్రియను కొనసాగించండి
- రుసుం చెల్లించి, ఫారమ్‌ను సమర్పించండి
- భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ప్రింటవుట్ తీసుకోండి