అన్వేషించండి

SA Exams: సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 పరీక్షల సమయాల్లో మార్పులు, మారిన షెడ్యూలు ఇలా

తెలంగాణలో అక్టోబరు 5 నుంచి ప్రారంభం కానున్న సమ్మేటివ్ అసెస్‌మెంట్(ఎస్ఏ-1) పరీక్షల సమయాల్లో రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) మార్పులు చేసింది.

తెలంగాణలో అక్టోబరు 5 నుంచి ప్రారంభం కానున్న సమ్మేటివ్ అసెస్‌మెంట్(ఎస్ఏ-1) పరీక్షల సమయాల్లో రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) మార్పులు చేసింది. రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల్లో 6, 7, 9, 10 తరగతుల పరీక్షలను ఉదయం, కేవలం 8వ తరగతి పరీక్షలను మధ్యాహ్నం నిర్వహించాలని మొదట ప్రకటించినప్పటికీ.. పరీక్ష సమయాల్లో మార్పులు చేసింది.

కొత్త షెడ్యూలు ప్రకారం ఉదయం సెషన్‌లో 6, 8, 10 తరగతులకు, మధ్యాహ్నం సెషన్‌లో 7, 9 తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. మంగళవారం సవరించిన కాలపట్టిక ద్వారా ప్రకటించారు. గతంలో మాదిరిగానే 1-5 తరగతులకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

ALSO READ:

సీబీఎస్‌ఈ పరీక్షల విధానంలో మార్పులు, కొత్తగా 'స్కిల్' సబ్జెక్ట్ పరీక్ష
ఆంధ్రప్రదేశ్‌లో సీబీఎస్‌ఈ గుర్తింపు ఉన్న వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో 8, 9వ తరగతులకు పరీక్షల విధానంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు నిర్వహిస్తూ వస్తున్న ఫార్మాటివ్, సమ్మేటివ్ పరీక్షలను.. పీరియాడిక్, టర్మ్ పరీక్షలుగా మార్చింది. పీరియాడిక్ రాత పరీక్ష (పీడబ్ల్యూటీ)-2 అక్టోబరు 6 నుంచి 9 వరకు నిర్వహించనున్నారు. సీబీఎస్ఈ గుర్తింపు పొందిన ప్రభుత్వ స్కూళ్లలో ఈ కొత్త పరీక్షల విధానాన్ని అమలు చేయనున్నారు. ఈ కొత్త విధానంలో మొత్తం నాలుగు పీడబ్ల్యూటీలు, రెండు టర్మ్ పరీక్షలు ఉంటాయి. టర్మ్-1 నవంబరులో, టర్మ్-2 పరీక్షలను మార్చిలో నిర్వహిస్తారు. టర్మ్ పరీక్షలో 80 మార్కులకు రాతపరీక్షలు, 20 మార్కులకు అంతర్గత పరీక్షలు నిర్వహిస్తారు. పీడబ్ల్యూటీలో 40 మార్కులకు రాతపరీక్షలు, 10 మార్కులకు అంతర్గత పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులు ప్రతి సబ్జెక్టులోనూ 33 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

ఏపీలో 11 రోజుల దసరా సెలవులు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే? తెలంగాణలో రెండు రోజులు ఎక్కువే!
ఏపీలోని పాఠశాలలకు ఈ సారి 11 రోజులపాటు దసరా సెలవులు ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని అన్ని స్కూల్స్‌కు అక్టోబరు 14 నుంచి 24 వరకు ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. దసరా సెలవుల అనంతరం 25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది. అయితే రాష్ట్రంలో అక్టోబరు 3 నుంచి 6 వరకు నిర్వహించాల్సిన ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ)–2 పరీక్షలను అక్టోబరు 6 నుంచి 9 వరకు నిర్వహించనున్నట్ల పాఠశాల విద్యాశాఖ  ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్ష నమూనాలో చేసిన మార్పులపై విద్యార్థుల్లో అవగాహన కల్పించడం కోసమే తేదీల మార్పులు చేశామని అధికారులు తెలిపారు. అన్ని యాజమాన్యాల ప్రాథమికోన్నత, ఉ­న్న­త పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వి­ద్యా­ర్థులకు నిర్దేశించిన సిలబస్‌ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

ఎన్ఎంఎంఎస్ దరఖాస్తుకు అక్టోబరు 13 వరకు అవకాశం
ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభగల విద్యార్థుల కోసం నిర్దేశించిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్ఎంఎంఎస్) దరఖాస్తుకు అక్టోబరు 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు తెలిపారు. డిసెంబరు 10న జరిగే పరీక్షకు ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే అర్హులని, రెసిడెన్షియల్‌ విధానంలో చదువుతున్న వారికి అర్హత లేదని తెలిపారు. ఈసారి తొలిసారిగా ఎస్టీ రిజర్వేషన్‌ను 6 నుంచి 10 శాతానికి పెంచుతున్నామని వెల్లడించారు. దానివల్ల స్కాలర్‌షిప్‌నకు ఎంపికయ్యే ఎస్టీ అభ్యర్థుల సంఖ్య పెరుగుతుందన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget