APRJC Results: గురుకుల ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్స్ ఇవే
ఏపీలోని గురుకుల జూనియర్ కాలేజీలు, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఆర్జేసీ (APRJC), ఏపీఆర్డీసీ (APRDC), ఏపీఆర్‌ఎస్ క్యాట్ (APRS CAT) ప్రవేశ పరీక్షల ఫలితాలు మే 14న విడుదలయ్యాయి.
APRS CAT and APRJC & DC CET- 2024 Results: ఏపీలోని గురుకుల జూనియర్ కాలేజీలు, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఆర్జేసీ (APRJC), ఏపీఆర్డీసీ (APRDC), ఏపీఆర్‌ఎస్ క్యాట్ (APRS CAT) ప్రవేశ పరీక్షల ఫలితాలు మే 14న విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్, ఏపీఆర్‌ఐసీ సొసైటీ కార్యదర్శి నరసింహారావు ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. అభ్యర్థులు ప్రవేశపరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్లు, స్పెషల్ కేటగిరీ, స్థానికత ఆధారంగా గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. గురుకుల పాఠశాలల్లో 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 25న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్‌డీసీ ప్రవేశ పరీక్షలను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించారు.
APRJC - 2024 ప్రవేశ పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి..
APRDC - 2024 ప్రవేశ పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి..
APRS CAT - 2024 (5వ తరగతి) ప్రవేశ పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి..
APRS CAT - 2024 (6-8వ తరగతి) ప్రవేశ పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి..
➥ ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్షకు మొత్తం 49,308 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. ఆయా కళాశాలల్లో ఇంటర్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఈఈటీ, సీజీటీ గ్రూపుల్లో సీట్లు భర్తీచేస్తారు. ఇంటర్‌లో కోర్సుల వారీగా సీట్లను భర్తీ చేసేందుకు తొలి విడత కౌన్సిలింగ్ మే 22 నుంచి 25 వరకు; మే 28 నుంచి 30 వరకు రెండో విడత; జూన్ 5 నుంచి 7 వరకు మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
➥ నాగార్జునసాగర్ డిగ్రీ కాలేజీలో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీఆర్డీసీ ప్రవేశ పరీక్షకు మొత్తం 963మంది చొప్పున విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలో అర్హత సాధించిన వారికి డిగ్రీ మొదటిసంవత్సరంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. సీట్ల భర్తీ కోసం తొలి విడత కౌన్సెలింగ్ మే 23న, రెండో విడత కౌన్సెలింగ్ మే 31న, మూడో విడత కౌన్సెలింగ్ జూన్ 7న నిర్వహించనున్నారు.
➥ ఏపీఆర్‌ఎస్ క్యాట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు 5వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు కల్పించడంతో పాటు 6,7,8 తరగతుల్లో మిగిలివున్న సీట్లను భర్తీ చేస్తారు.
➥ గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 8వ తరగతి వరకు ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీఆర్ఎస్ క్యాట్ 2024 పరీక్షకు మొత్తం 25,216 మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహణలో ఉన్న పాఠశాలల్లో ప్రవేశాల కోసం 'ఏపీఆర్‌ఎస్ క్యాట్-2024' నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 5వ తరగతితోపాటు 6, 7, 8 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీని చేపట్టనున్నారు. ప్రవేశ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ మార్చి 1న ప్రారంభంకాగా.. విద్యార్థుల నుంచి ఏప్రిల్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను ఏప్రిల్ 17న విడుదల చేశారు. ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష నిర్వహించారు. తాజాగా ఫలితాలు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహణలో ఉన్న జూనియర్ కళాశాలల్లో ఇంటర్‌లో ప్రవేశాల కోసం ఏపీఆర్‌జేసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (APRJC CET) - 2024 నోటిఫికేషన్ మార్చిన విడుదలైన సంగతి తెలిసిందే. పరీక్షకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 1న ప్రారంభమైంది. ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను ఏప్రిల్ 17న విడుదల చేశారు. ఏప్రిల్ 25న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలను మే 14న ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహణలో ఉన్న డిగ్రీ కళాశాలల్లో ఇంటర్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఏపీఆర్‌డీసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (APRDC CET)-2024కు మార్చి 1న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను ఏప్రిల్ 17న విడుదల చేశారు. ఏప్రిల్ 25న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రవేశపరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలను మే 14న ప్రకటించారు.