BA Animation Course: బీసీ ఫైన్‌ఆర్ట్స్ కాలేజీలో బీఏ యానిమేషన్ కోర్సు ప్రవేశాలు, ఇంటర్ పాసైతే చాలు
BA Course: చేవెళ్లలోని బీసీ గురుకుల ఫైన్‌ఆర్ట్స్ కళాశాలలో బీఏ యానిమేషన్ కోర్సులో 2024-25 ఏడాదికి ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
MJPTBCWR Fine Arts College Admission Notification: తెలంగాణ బీసీ గురుకుల ఆధ్వర్యంలోని ఫైన్‌ఆర్ట్స్ కళాశాలల్లో బీఏ యానిమేషన్, వీఎఫ్‌క్స్ కోర్సులో 2024-25 ఏడాదికి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ వెలువడింది. ఇంటర్ పూర్తిచేసిన బాల, బాలికలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దీనిద్వారా బీఏ కోర్సుల్లో మొత్తం 60 సీట్లలో ప్రవేశాలు కల్పిస్తారు. బాలురకు, బాలికలకు వేర్వేరుగా క్యాంపస్‌లు ఉంటాయి. సరైన అర్హతలు, ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 17 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి. అలాగే ఈమెయిల్: mjpanimation45@gmail.com ద్వారా పూర్తిచేసిన దరఖాస్తు స్కానింగ్ కాపీని పంపాల్సి ఉంటుంది. ఏమైనా సందేహాలుంటే 9032644463, 9063242329 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.1.50 లక్షలకు, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.2 లక్షలకు మించకూడదు. సీట్లు పొందినవారికి ఉచిత వసతి సౌకర్యాలు కల్పిస్తారు. క్యాంపస్‌లోకి మొబైల్ ఫోన్లను అనుమతించరు.
వివరాలు..
* బీఏ (యానిమేషన్, వీఎఫ్‌క్స్) కోర్సులో ప్రవేశాలు
కళాశాలలు: బీసీ గురుకుల ఫైన్‌ఆర్ట్స్ కళాశాల (బాలురు), బీసీ గురుకుల ఫైన్‌ఆర్ట్స్ కళాశాల (బాలికలు)
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే (వార్షిక పరీక్షల్లో) ఉత్తీర్ణులై ఉండాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.1.50 లక్షలకు, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.2 లక్షలకు మించకూడదు.
సీట్ల సంఖ్య: 60. (30 + 30).
ఫీజు వివరాలు: సీట్లు పొందిన విద్యార్థులు రిపోర్టింగ్ సమయంలో మెయింటెనెన్స్ ఫీజు కింద రూ.2000, కాజన్ డిపాజిట్ కింద మరో రూ.2000 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో కాజన్ డిపాజిట్ మొత్తాన్ని కోర్సుల పూర్తయిన వెంటనే తిరిగి చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్, ఈమెయిల్ ద్వారా.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
MJPTBCWR Fine Arts College,
Vikarabad, Located at MJPTBCWRS(G),
H.No. 11-53/1/100, Vikarabad Road, Model Colony,
Chevella(M) Ranga Reddy District-501503.
దరఖాస్తు స్కాన్ కాపీ పంపాల్సిన ఈమెయిల్: mjpanimation45@gmail.com
రిపోర్టింగ్ సమయంలో సమర్పించాల్సిన సర్టిఫికేట్లు..
➥ పూరించిన దరఖాస్తు కాపీ
➥ ఇంటర్ ఒరిజనల్ పాస్ సర్టిఫికేట్లు, మార్కుల మెమో
➥ పదోతరగతి ఒరిజనల్ పాస్ సర్టిఫికేట్లు, మార్కుల మెమో
➥ మైగ్రేషన్ సర్టిఫికేట్ (TSBIE నుంచి ఇంటర్ చదవనివారు)
➥ ఇంటర్ కండక్ట్ సర్టిఫికేట్/స్టడీ సర్టిఫికేట్ (సంబంధిత కాలేజీ నుంచి )
➥ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (T.C) (సంబంధిత కాలేజీ నుంచి)
➥ క్యాస్ట్ సర్టిఫికేట్ (తహసీల్దార్ జారీచేసినది)
➥ ఇన్‌కమ్ సర్టిఫికేట్ (తహసీల్దార్ జారీచేసినది)
➥ స్థానిక నివాస ధ్రవీకరణ పత్రం ( తహసీల్దార్ జారీచేసిన ఒరిజినల్ సర్టిఫికేట్)
➥ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ (డాక్టర్ ద్వారా - అసిస్టెంట్ సివిల్ సర్జన్ ర్యాంకుకు తగ్గని వారినుంది)
➥ దివ్యాంగులకు సంబంధించిన సర్టిఫికేట్
➥ బ్లడ్ గ్రూప్ సర్టిఫికేట్
➥ అనాధలు అయితే తల్లిదండ్రుల డెత్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
➥ 15 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు
➥ తల్లిదండ్రులు, విజిటింగ్ గార్డియన్స్ ఫొటోలు
➥ ఆధార్ కార్డు
➥ అన్ని సర్టిఫికేట్లను 3 జతలు జిరాక్స్ కాపీలు సమర్పించాలి.
➥ దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 17.08.2024.