By: ABP Desam | Updated at : 21 Mar 2023 07:05 PM (IST)
Edited By: omeprakash
ఓపెన్ స్కూల్ పరీక్షల హాల్‌టికెట్లు
ఏపీలో ఏప్రిల్‌లో నిర్వహించనున్న ఓపెన్ స్కూల్ పదోతరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లను ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ విడుదల చేసింది. పరీక్షల హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 3 నుంచి 17 వరకు టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ జనరల్, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి ఏప్రిల్ 18 నుంచి 23 వరకు ప్రయోగ పరీక్షలు నిర్వహించనున్నారు.
APOSS - SSC APRIL - 2023 HALLTICKETS
APOSS - INTER APRIL - 2023 HALLTICKETS
ఓపెన్ స్కూల్ పదోతరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 17 వరకు, ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 15 వరకు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
పదోతరగతి పరీక్షల షెడ్యూలు ఇలా..
➥ ఏప్రిల్ 3న: తెలుగు, ఉర్దూ, కన్నడ, ఒరియా, తమిళం.
➥ ఏప్రిల్ 6న: హిందీ.
➥ ఏప్రిల్ 8న: ఇంగ్లిష్
➥ ఏప్రిల్ 10న: మ్యాథమెటిక్స్, ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్
➥ ఏప్రిల్ 13న: సైన్స్ అండ్ టెక్నాలజీ.
➥ ఏప్రిల్ 15న: సోషల్ స్టడీస్, ఎకనామిక్స్.
➥ ఏప్రిల్ 17న: బిజినెస్ స్టడీస్, సైకాలజీ, అన్ని ఒకేషనల్ సబ్జెక్టులకు.
ఇంటర్ పరీక్షల షెడ్యూలు..
➥ ఏప్రిల్ 3న: హిందీ, తెలుగు, ఉర్దూ.
➥ ఏప్రిల్ 6న: బయాలజీ, కామర్స్, హోంసైన్స్.
➥ ఏప్రిల్ 8న: ఇంగ్లిష్.
➥ ఏప్రిల్ 10న: మ్యాథమెటిక్స్, హిస్టరీ, బిజినెస్ స్టాటిస్టిక్స్.
➥ ఏప్రిల్ 13న: ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్/సివిక్స్, సైకాలజీ.
➥ ఏప్రిల్ 15న: కెమిస్ట్రీ, ఎకనామిక్స్, సోషియాలజీ.
➥ ఏప్రిల్ 17న: అన్ని ఒకేషనల్ సబ్జెక్టులకు.
Also Read:
సీయూఈటీ పీజీ రిజిస్ట్రేషన్ ప్రారంభం - దరఖాస్తు, పరీక్ష వివరాలు ఇలా!
దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (సీయూఈటీ-పీజీ-2023) నోటిఫికేషన్ వెలువడింది. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 20న ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 19 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు డెబిట్/క్రెడిట్ కార్డులతో పాటు నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా దరఖాస్తు ఫీజును చెల్లించవచ్చు. పరీక్ష షెడ్యూలును త్వరలోనే వెల్లడించనున్నారు.
దరఖాస్తు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..
ఇంటర్ అర్హతతో ఎంబీఏ, ప్రవేశ ప్రకటన విడుదల చేసిన ఇండోర్ ఐఐఎం
ఇండోర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ఐదేళ్ల 'ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్‌మెంట్(ఐపీఎం)' కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ అర్హత ఉన్నవారు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సులో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి. మొదటి మూడేళ్లు ఫౌండేషన్, తర్వాత రెండేళ్లు మేనేజ్‌మెంట్ విద్యపై దృష్టి సారిస్తారు. తొలి భాగంలో భాష, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు; మేనేజ్‌మెంట్ విద్య ప్రాథమికాంశాలు, నైతిక విలువలు అర్థం చేసుకునే నైపుణ్యం, శారీరక ఆరోగ్యంపై దృష్టి సారిస్తారు. చివరి రెండేళ్లు లక్ష్యం దిశగా బోధన ఉంటుంది.
కోర్సు, పరీక్ష తేదీ వివరాల కోసం క్లిక్ చేయండి.
TS ICET: జూన్ 4న తెలంగాణ ఐసెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?
NLSIU Courses: ఎన్ఎల్ఎస్ఐయూ-బెంగళూరులో పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు!
పీజీ వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్, స్టైపెండ్ పెంచిన సర్కార్ - ఎంత శాతమంటే?
CUET UG Admit Card: సీయూఈటీ యూజీ అడ్మిట్ కార్డులు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
NITW MBA Admissions: నిట్ వరంగల్లో ఎంబీఏ ప్రోగ్రామ్, ప్రవేశం ఇలా!
Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం
IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!
చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్
Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!