అన్వేషించండి

AP TET 2024: ఏపీటెట్ అభ్యర్థులకు అలర్ట్, మాక్ టెస్టులు అందుబాటులోకి వచ్చేశాయ్ - ప్రాక్టీస్ చేయండి

APTET 2024: ఏపీటెట్ జులై 2024 పరీక్షరాసే అభ్యర్థులకు ఆన్‌లైన్‌ మాక్‌ టెస్ట్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు పాఠశాల విద్యా విభాగం అధికారిక వెబ్‌సైట్‌లో మాక్‌ టెస్ట్‌లు అందుబాటులోకి తీసుకొచ్చింది.

AP TET JULY 2024 Mock Tests: ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. అభ్యర్థుల సౌలభ్యం కోసం సెప్టెంబర్‌ 19 నుంచి మాక్ టెస్టులను విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఈ ప్రాక్టీస్ టెస్టుల ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టు పరీక్షలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాయడానికి అధికారులు ఏర్పాట్లుచేశారు. మొత్తం 13 మాక్ టెస్టులను కేటగిరీలవారీగా అందుబాటులో ఉంచారు. ఇందులో పేపర్-2ఎ (మ్యాథ్స్), పేపర్-2ఎ (సోషల్), పేపర్-2ఎ (లాంగ్వేజెస్), పేపర్-2బి, పేపర్-1బి, పేపర్-1ఎ ఎస్జీటీ నమూనా పరీక్షలు ఉన్నాయి. ఏపీటెట్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను సెప్టెంబరు 22న విడుదల చేయనున్నారు.

అక్టోబరు 3 నుంచి టెట్ పరీక్షలు..
రాష్ట్రంలో అక్టోబర్‌ 3 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్న 'టెట్' పరీక్షలకు మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్‌‌లో, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు రెండో సెషన్‌‌లో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.  అయితే పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ కీలు మాత్రం పరీక్ష నిర్వహించిన మరుసటి రోజు నుంచి అంటే.. అక్టోబర్‌ 4 నుంచి విడుదల చేస్తారు. అక్టోబర్‌ 5 నుంచి కీపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఇక అక్టోబర్‌ 27న ఫైనల్ ఆన్సర్ ‘కీ’ విడుదల చేసి, నవంబర్‌ 2న ఫలితాలను ప్రకటించనున్నారు.

మాక్ టెస్టుల కోసం ఈ లింక్స్ క్లిక్ చేయండి..

PAPER_IIA_SOCIAL_ENG Click Here

PAPER_IIA_MATHS_ENG Click Here

PAPER_IIA_LAN_ENG Click Here

PAPER_IIB Click Here

PAPER_IIA_LAN_KM Click Here

PAPER_IIA_LAN_OM Click Here

PAPER_IIA_LAN_TAM Click Here

PAPER_IIA_LAN_TELUGU Click Here

PAPER_IIA_LAN_URDU Click Here

PAPER_IIA_MATHS Click Here

PAPER_IIA_SOCIAL Click Here

PAPER_IB Click Here

PAPER_IA_SGT Click Here

AP TET JULY 2024 Website

పరీక్ష విధానం:

➥  ఒక్కో పేపరుకు 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు లేవు. పరీక్ష సమయం 2.30 గంటలు.
➥ పేపర్-1 ఎలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి.
➥ పేపర్-1 బిలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి.
➥ పేపర్-2 ఎలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్/బయాలజీ/ఫిజిక్స్/సోషల్ స్టడీస్/లాంగ్వేజ్-60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి.
➥ పేపర్-2 బిలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, కేటగిరీ ఆఫ్ డిజెబిలిటీ స్పెషలైజేషన్ అండ్ పెడగోగి -60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి.

కేటగిరీలవారీగా అర్హత మార్కులు..
ఏపీ టెట్ పరీక్షలో అర్హత మార్కులను ఓసీ(జనరల్‌) అభ్యర్థులకు- 60 శాతంగా, బీసీ అభ్యర్థులకు- 50 శాతంగా, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌/ ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు 40 శాతంగా నిర్ణయించారు.

APTET July 2024 - నోటిఫికేషన్, పరీక్ష సిలబస్, పరీక్ష విధానం వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget