AP SSC Exams: మే రెండో వారంలో పదోతరగతి ఫలితాలు!
వాల్యుయేషన్ అనంతరం కార్యక్రమాలు పూర్తి చేసి మే రెండో వారంలో పదోతరగతి ఫలితాలు విడుదల చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి.దేవానందరెడ్డి చెప్పారు.
పదో తరగతి పరీక్షల ఫలితాలను మే రెండో వారంలో విడుదల చేసేలా ప్రణాళిక రూపొందించినట్టు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి.దేవానందరెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని పదోతరగతి పరీక్షా కేంద్రాలను గురువారం (ఏప్రిల్ 13) ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దేవానందరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 3,349 కేంద్రాల్లో 6.64లక్షల మంది విద్యార్థులు పది పరీక్షలు రాస్తున్నారన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, ఇప్పటి వరకు ఆరుగురు విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.
ఏప్రిల్18తో పది పరీక్షలు ముగుస్తాయన్న దేవానందరెడ్డి.. 19 నుంచి 26 వరకు ఎనిమిది రోజుల పాటు రాష్ట్రంలోని 23 జిల్లాల్లో స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుందని తెలిపారు. ఇందులో 30 నుంచి 35 వేల మంది ఉపాధ్యాయులు పాల్గొంటారని చెప్పారు. వాల్యుయేషన్ అనంతరం కార్యక్రమాలు పూర్తి చేసి మే రెండో వారంలో విద్యాశాఖ మంత్రి అనుమతితో పదోతరగతి ఫలితాలు విడుదల చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు దేవానంద్ చెప్పారు.
'టెన్త్' విద్యార్థులకు గుడ్ న్యూస్, 19 నుంచి మూల్యాంకనం - ఎక్కువ రాస్తే, ఎక్కువ మార్కులే!
ఏపీలో పదోతరగతి పరీక్షలు ఏప్రిల్ 3న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 15తో ప్రధాన పరీక్షలు, 17న కాంపోజిట్, 18న ఒకేషనల్ పరీక్షలు ముగియనున్నాయి. జవాబుపత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 19 నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్ 26 వరకు మూల్యాంకన ప్రక్రియ కొనసాగనుంది. ఈ సందర్భంలో మూల్యాంకన ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ పలు మార్గదర్శకాలతో కూడిన మార్గదర్శకాలను జారీ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లా కేంద్రాల్లో మూల్యాంకనకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. అయితే పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, నంద్యాల జిల్లా కేంద్రాలను మినహాయించారు. అన్ని జిల్లాల విద్యా శాఖాధికారులకు మార్గదర్శకాలతో కూడిన బుక్‌లెట్లను కూడా పాఠశాల విద్యాశాఖ అందించింది. ఆయా జిల్లాల్లో మూల్యాంకన కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలన్నిటినీ ఏర్పాటు చేసే బాధ్యతను ఆయా జిల్లాల విద్యా శాఖాధికారులకు అప్పగించింది. మూల్యాంకనం సందర్భంగా అందులో పాల్గొనే సిబ్బంది నిర్వర్తించాల్సిన విధులను తాజా ప్రొసీడింగ్స్‌లో కమిషనర్ వివరించారు. వాటిని తప్పనిసరిగా అమలు చేయాల్సిన బాధ్యత డీఈవోలదేనని స్పష్టం చేశారు.
దీనిప్రకారం.. పరీక్షలో అదనపు జవాబులు రాసిన విద్యార్థులకు తక్కువ మార్కులొచ్చిన సమాధానం తొలగించనున్నారు. ఇక రీ-వెరిఫికేషన్, రీ- కౌంటింగ్‌లో ఏమైనా తేడాలుంటే మూల్యాంకనం చేసిన వారిపై చర్యలు తీసుకోనున్నారు. అసిస్టెంట్ ఎగ్జామినర్లు రోజుకు 40 సమాధాన పత్రాలు మాత్రమే చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. వీరు వేసిన మార్కులను స్పెషల్ అసిస్టెంట్లు లెక్కించాల్సి ఉంటుంది. చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్లు, క్యాంప్ ఆఫీసర్ వాటిని పరిశీలించాలి.
విద్యాశాఖ విడుదల చేసిన మార్గదర్శకాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
ఇంటర్ అర్హతతో ఎంబీఏ ప్రవేశానికి 'జిప్‌మ్యాట్' మార్గం, నోటిఫికేషన్ విడుదల!
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) బోధ్‌గయ, ఐఐఎం జమ్మూ ఉమ్మడిగా అందిస్తున్న 'ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్‌మెంట్(ఐపీఎం)లో ప్రవేశాలకు సంబంధించి జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జిప్‌మ్యాట్) - 2023 నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఇంటర్ అర్హతతో ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఐదేళ్ల ఇంటిగ్రేడెట్ ఎంబీఏ కోర్సులో చేరవచ్చు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..