APMS Exam Result: ఏపీ మోడల్ స్కూల్స్ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
APMS: ఏపీలోని ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశపరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఏప్రిల్ 29న ఫలితాలను విడుదల చేశారు.
APMS Results: ఏపీలోని ఆదర్శ పాఠశాలల్లో (APMS) 6వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశపరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఏప్రిల్ 29న ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఐడీ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 164 మోడల్ స్కూల్స్‌లో ఏప్రిల్ 21న ఈ పరీక్ష నిర్వహించగా.. 31,376 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ప్రవేశాలకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఆయా మోడల్ స్కూల్స్‌లో సంప్రదించాల్సి ఉంటుంది.
APMS 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి..
ఏపీలోని 164 ఆదర్శ పాఠశాలల్లో (Mode Schools) ఆరో తరగతిలో 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశానికి సంబంధించిన నోటిఫికేషన్ మార్చి 1న వెలువడిన సంగతి తెలిసిందే. విద్యార్థులు మార్చి 1 నుండి ఏప్రిల్ 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 21న ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 వరకు మండలాల్లో ఉన్న ఆదర్శ పాఠశాలల్లోనే 5వ తరగతి స్థాయి సిలబస్‌తో తెలుగు/ ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహించారు. అభ్యర్థులు వారివారి మండల కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉన్నాయి. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు అడిగారు. 5వ తరగతి స్థాయిలోనే ప్రశ్నలు ఉన్నాయి. పరీక్షలో అర్హత మార్కులకు ఓసీ, బీసీ విద్యార్థులకు 35గా; ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 30గా నిర్ణయించారు. పరీక్షలో విద్యార్థులు చూపిన ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో మాత్రమే బోధిస్తారు, చదువుకోవడానికి విద్యార్థులు ఎలాంటి ఫీజులు కట్టనవసరం లేదు. ఈ పాఠశాలలన్నీ కూడా సీబీఎస్‌ఈకి అనుబంధంగా ఉన్నాయి.
ALSO READ:
సీబీఎస్‌ఈ విద్యార్థులకు అలర్ట్ - 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలు వచ్చేస్తున్నాయ్, ఎప్పుడంటే?
సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. వారంరోజుల్లో ఫలితాల వెల్లడికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఏర్పాట్లు చేస్తోంది. మే మొదటి వారంలో పరీక్షల ఫలితాలు ప్రకటించనున్నారు. అయితే ఫలితాల వెల్లడి కచ్చితమైన తేదీని, సమయాన్ని మాత్రం సీబీఎస్‌ఈ అధికారికంగా ప్రకటించలేదు. ఫలితాల వెల్లడి తర్వాత విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్లు results.cbse.nic.in, cbse.gov.in ద్వారా ఫలితాలు చూసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు పదోతరగతి పరీక్షలు; ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు 12వ తరగతి పరీక్షలును సీబీఎస్ఈ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది పరీక్షలకు దాదాపు 38 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో పదోతరగతి పరీక్షలకు 22 లక్షలకుపైగా, 12వ తరగతి పరీక్షలకు దాదాపు 16 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. సీబీఎస్‌ఈ నిబంధనల ప్రకారం విద్యార్థులు ఉత్తీర్ణులు కావాలంటే, విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో కనీసం 33 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..