AP LAWCET 2024 Results: ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల, వెబ్‌సైట్‌లో ర్యాంకు కార్డులు అందుబాటులో
AP LAWCET Results: ఆంధ్రప్రదేశ్‌లో లాసెట్, పీజీ ఎల్‌సెట్ - 2024 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు.
AP LAWCET/ PGLCET 2024 Results: ఆంధ్రప్రదేశ్‌లో లాసెట్, పీజీ ఎల్‌సెట్ - 2024 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏపీ లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ బి.సత్యనారాయణ జూన్ 27న ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. లాసెట్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి లాసెట్ ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.ఏపీ లాసెట్-2024 పరీక్షకు మొత్తం 19,224 మంది అభ్యర్థులు హాజరుకాగా.. 17,117 మంది (89.04 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇందులో రెండేళ్ల పీజీ కోర్సులో 99.51 శాతం, మూడేళ్ల ఎల్ఎల్‌బీ కోర్సు లో 89.74 శాతం, ఐదేళ్ల ఎల్ఎల్‌బీ కోర్సులో 80.06 శాతం అభ్యర్థులు ఉతీర్ణత సాధించారు.
లాసెట్ పరీక్షను మొత్తం 120 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహించారు. పరీక్షలో కనీస అర్హత మార్కులను 35 శాతం అంటే 42 మార్కులుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి కనీస అర్హత మార్కులు లేవు. ఇక 120 మార్కులకు పీజీఎల్‌సెట్ పరీక్ష నిర్వహించగా.. అర్హత మార్కులను 25 శాతంగా (30 మార్కులు) నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి కనీస మార్కులు లేవు.
ఏపీ లాసెట్-2024 ఫలితాలు ఇలా చూసుకోండి..
➥ లాసెట్ ఫలితాల కోసం మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి-https://cets.apsche.ap.gov.in/LAWCET/LAWCET/LAWCET_HomePage.aspx
➥ అక్కడ హోంపేజీలో లాసెట్ ఫలితాలకు సంబంధించి 'Results' లింక్ మీద క్లిక్ చేయాలి.
➥ ఆ తర్వాత వచ్చే పేజీలో అభ్యర్థులు తమ లాసెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు వివరాలు నమోదుచేయాలి.
➥ తర్వాత 'View Results' బటన్ మీద క్లిక్ చేయాలి.
➥ లాసెట్ ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి
➥ ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకోవచ్చు.
AP LAWCET 2024 ఫలితాల కోసం క్లిక్ చేయండి..
ఏపీ ఎడ్‌సెట్-2024 ర్యాంకు కార్డులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
➥ లాసెట్ ర్యాంకు కార్డు కోసం మొదట అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి-https://cets.apsche.ap.gov.in/LAWCET/LAWCET/LAWCET_HomePage.aspx
➥ అక్కడ హోంపేజీలో లాసెట్ ర్యాంకు కార్డుకు సంబంధించి 'Download Rank Card' లింక్ మీద క్లిక్ చేయాలి.
➥ ఆ తర్వాత వచ్చే పేజీలో అభ్యర్థులు తమ ఎడ్‌సెట్ రిజిస్ట్రేషన్ నెంబరు, ఎడ్‌సెట్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు వివరాలు నమోదుచేయాలి.
➥ తర్వాత 'View Rank Card' బటన్ మీద క్లిక్ చేయాలి.
➥ లాసెట్ ర్యాంకు కార్డు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
➥ అభ్యర్థులు ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రింట్ తీసుకొని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.
AP LAWCET 2024 ర్యాంకు కార్డుల కోసం క్లిక్ చేయండి..
ఏపీలోని లా కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి మార్చి 22న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి మార్చి 26 నుంచి మే 29 వరకు దరఖాస్తులు స్వీకరించారు. మే 30 నుంచి జూన్ 1 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించారు. ఏపీ లాసెట్/ పీజీఎల్‌సెట్ 2024 పరీక్ష హాల్‌టికెట్లను జూన్ 3న విడుదల చేశారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. జూన్ 9న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏపీ లాసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని జూన్ 10న విడుదల చేశారు. ఆ తర్వాత జూన్ 11 నుంచి జూన్ 12 వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలు స్వీకరించారు. తాజాగా లాసెట్ ఫలితాలను విడుదల చేశారు.