AP LAWCET Results 2021: ఏపీ లాసెట్ 2021 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ కోసం క్లిక్ చేయండి
ఆంధ్రప్రదేశ్‌లో మూడేళ్ల లా కోర్సు, అయిదేళ్ల లా కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్ 2021 ఫలితాలు గురువారం సాయంత్రం విడుదలయ్యాయి.
AP LAWCET 2021 Results: ఏపీలో లాసెట్ 2021 ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ గురువారం సాయంత్రం లాసెట్ ఫలితాలను విడుదల చేశారు. మూడేళ్ల లా కోర్సులో 92.21 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. ఐదేళ్ల లా కోర్సుకు సంబంధించి 76.84 శాతం శాతం అర్హత సాధించారు. 1,991 మంది ఉత్తీర్ణులయ్యారని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ వెల్లడించారు. AP LAWCET 2021 Results చెక్ చేసుకునేందుకు క్లిక్ చేయండి
ఈ సంవత్సరం ఐదేళ్లు, మూడేళ్ల డిగ్రీ కోర్సులో ప్రవేశాల కోసం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లాసెట్ 2021 ప్రవేశ పరీక్షలు నిర్వహించింది. గత నెల 22న నిర్వహించిన లాసెట్ ఎంట్రన్స్ ఫలితాలను తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వ విద్యాలయంలో ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ జమున విడుదల చేశారు. AP LAWCET 2021 Rank Card డౌన్‌లోడ్ చేసుకునేందుకు క్లిక్ చేయండి
Also Read: సీబీఎస్‌ఈ బోర్డు కీలక ప్రకటన.. ఎగ్జామ్ సెంటర్ మార్పునకు ఓకే!
త్వరలో కౌన్సెలింగ్ షెడ్యూల్...
ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల చేసిన అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు. 3 సంత్సరాల లా కోర్సులో చేరేందుకుగానూ 11,153 మంది దరఖాస్తు చేసుకోగా, 9357 మంది ఎంట్రన్స్ టెస్టుకు హాజరయ్యారు. వీరిలో 8628 మంది (92.21 శాతం) అర్హత సాధించారు. కాగా, 5 ఏళ్ల లా కోర్సులో ప్రవేశాల కోసం 3048 మంది దరఖాస్తు చేసుకోగా.. 2591 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,991మంది కోర్సులో చేరేందుకు అర్హత సాధించారు. త్వరలో లాసెట్ కౌన్సిలింగ్ నిర్వహించి సీట్లు భర్తీ చేయనున్నామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్ర రెడ్డి తెలిపారు. Results for AP LAWCET & AP PGLCET 2021
Also Read: దివ్యాంగ విద్యార్థులకు ఏఐసీటీఈ స్కాలర్‌షిప్.. ఏడాదికి రూ.50 వేలు సాయం..
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గత ఏడాది నుంచి ఉద్యోగులతో పాటు విద్యార్థులకు సమస్యలు తలెత్తుతున్నాయి. ఏపీలో టెన్త్, ఇంటర్, డిగ్రీ పరీక్షలకు కరోనా కారణంగా ఇబ్బంది కలగడంతో కొన్ని పరీక్షలు రద్దు చేసి నేరుగా ఫలితాలు ప్రకటించడం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఏపీ లాసెట్ నిర్వహణలో సైతం జాప్యం జరిగింది. గత ఏడాది నిర్వహించిన లాసెట్ 2021 ఫలితాలు నేడు విడుదలయ్యాయి. త్వరలోనే కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.