Inter First Year Supplementary Results: నేడే ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు, రిజల్ట్స్ వెల్లడి సమయం ఇదే
AP Inter Supply Results 2024: ఏపీలో ఇంటర్మీడియెట్ సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్ 26న సాయంత్రం 5 గంటలకు వెలువడనున్నాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచనున్నారు.
AP Inter First Year Supplementary Results: ఏపీలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు (Inter First Year Supplementary Results) నేడు (జూన్ 26) విడుదలకానున్నాయి. ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో సాయంత్రం 5 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షలకు దాదాపు 3.40 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఏపీ ఇంటర్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..
Step 1: ఫలితాల కోసం విద్యార్థులు మొదటగా అధికారిక వెబ్‌సైట్ - https://bie.ap.gov.in/ సందర్శించాలి.
Step 2: అక్కడ హోంపేజీలో 'ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలకు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయాలి.
Step 3: అక్కడ వచ్చే లాగిన్ పేజీలో విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి 'Get Result' బటన్ మీద క్లిక్ చేయాలి.
Step 4: విద్యార్థుల ఫలితాలు మీ స్క్రీన్ మీద కనిపిస్తాయి
Step 5: విద్యార్థులు రిజల్ట్స్ స్కోర్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ఇప్పటికే సెకండియర్ ఫలితాలు వెల్లడి..
ఏపీలో ఇంటర్ సెకండియర్ పరీక్షల ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు జూన్ 18న వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇంటర్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 1,27,190 మంది విద్యార్థులు హాజరు కాగా... 74,868 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 59 శాతం ఉత్తీర్ణల నమోదైంది. ఇంటర్ పరీక్షల ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులతోపాటు, ఇంటప్రూవ్ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మే 24 శుక్రవారం నుంచి జూన్ 3వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే ఇంటర్ సెకండియర సప్లిమెంటరీ ఫలితాలు విడుదలకాగా... జూన్ 26న ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల ఫలితాలను ఇంటర్ బోర్డు ప్రకటించనుంది. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచనున్నారు.
కాగా.. ఏపీలో ఈ ఏడాది మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షల ఫలితాలను ఇంటర్ బోర్డు ఏప్రిల్ 12న విడుదల చేసింది. ఫలితాలకు సంబంధించి ఇంటర్ జనరల్ విభాగంలో మొదటి సంవత్సరం నుంచి 4,61,273 మంది పరీక్షలకు హాజరుకాగా.. వీరిలో 3,10,875 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంటర్ రెండో సంవత్సరం ఫలితాలకు సంబంధించి 3,93,757 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 3,06,528 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక ఇంటర్ ఒకేషనల్ విభాగంలో ప్రథమ సంవత్సరం నుంచి 38,483 మంది పరీక్షలకు హాజరుకాగా.. వీరిలో 23,181 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలకు సంబంధించి 32,339 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 23,000 మంది పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 80 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తంగా చూస్తే.. ఇంటర్ ఫస్టియర్‌లో 67 శాతం, సెకండియర్‌లో 78 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ నిర్వహించి ఇటీవలే వాటి ఫలితాలను బోర్డు విడుదల చేసింది.