Inter Exam Fee: ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు, తత్కాల్ కింద చెల్లించేందుకు అవకాశం
ఏపీలో ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫీజు గడువును ఇంటర్ బోర్డు మరోసారి పొడిగించింది. ఇప్పటివరకు ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థులు తత్కాల్ కింద ఫిబ్రవరి 10 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది.
AP INTER FEE: ఏపీలో ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫీజు గడువును ఇంటర్మీడియట్ బోర్డు మరోసారి పొడిగించింది. ఇప్పటివరకు ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థులు తత్కాల్ కింద ఫిబ్రవరి 10 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. విద్యార్థులు రూ.3 వేల అపరాధ రుసుముతో పరీక్ష ఫీజును చెల్లించవచ్చు. మరోవైపు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 5న ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో రెండు సెషన్లలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సెషనలో, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఈసారి దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు. ఇంటర్ సాధారణ కోర్సులకు ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 11 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. అదేవిధంగా వృత్తి విద్య కోర్సులకు ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 23న ఎన్విరాన్‌మెంటల్ పరీక్ష..
ఇక ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్షను ఫిబ్రవరి 2న నిర్వహించగా.. ఫిబ్రవరి 3న జరగాల్సిన ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను ఫిబ్రవరి 23కు వాయిదావేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అదేవిధంగా సమగ్ర శిక్షా ఒకేషనల్ ట్రేడ్ పరీక్షను ఫిబ్రవరి 22న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు.
పరీక్ష ఫీజు వివరాలు..
➥ ఇంటర్ ఫస్టియర్ జనరల్/ఒకేషనల్ విద్యార్థులకు: రూ.550
➥ ఇంటర్ సెకండియర్ జనరల్/ఒకేషనల్ విద్యార్థులకు: రూ.550
➥ ఇంటర్ జనరల్/ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ ఫీజు: రూ.250
➥ ఇంటర్ జనరల్/ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు విద్యార్థులకు (మ్యాథమెటిక్స్ చదివే బైపీసీ విద్యార్థులకు): రూ.150.
ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు రెండూ రాసేవారికి..
➥ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ థియరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పరీక్ష ఫీజు: రూ.1100.
➥ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ ఫీజు: రూ.500.
➥ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ జనరల్/ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు విద్యార్థులకు (మ్యాథమెటిక్స్ చదివే బైపీసీ విద్యార్థులకు) పరీక్ష ఫీజు: రూ.300.
➥ ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలకు హాజరయ్యేవారికి పరీక్ష ఫీజు: ఆర్ట్స్ గ్రూప్-రూ.1240, సైన్స్ గ్రూప్-రూ.1,440.
మార్చి 1 నుంచి ఇంటర్ థియరీ పరీక్షలు..
ఏపీలో ఈ ఏడాది మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్‌లో ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇంటర్‌తో పాటు పదోతరగతి పరీక్షలనూ మార్చిలోనే నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా తెలిపారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను మార్చి 1 నుంచి మార్చి 19 వరకు నిర్వహించనున్నారు. అదేవిధంగా మార్చి 2 నుంచి ఏప్రిల్ 20 వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగనున్నాయి.
ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూలు..
➥ మార్చి 1- శుక్రవారం - సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
➥ మార్చి 4 - సోమవారం - ఇంగ్లిష్ పేపర్-1
➥ మార్చి 6 - బుధవారం - మ్యాథ్స్ పేపర్-1ఎ, బోటనీ పేపర్-1, సివిక్స్-1.
➥ మార్చి 9 - శనివారం - మ్యాథ్స్ పేపర్-1బి, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1
➥ మార్చి 12 - మంగళవారం - ఫిజిక్స్ పేపర్-1, ఎకనావిుక్స్ పేపర్-1
➥ మార్చి 14 - గురువారం - కెవిుస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, సోషియాలజీ పేపర్-1, ఫైన్ ఆర్ట్స్& మ్యూజిక్ పేపర్-1
➥ మార్చి 16 - శనివారం - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్-1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-1 (బైపీసీ విద్యార్థులకు).
➥ మార్చి 19 - మంగళవారం - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జియోగ్రఫీ పేపర్-1
ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల షెడ్యూలు..
➥ మార్చి 2 - శనివారం - సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2
➥ మార్చి 5 - మంగళవారం - ఇంగ్లిష్ పేపర్-2
➥ మార్చి 7 - గురువారం - మ్యాథ్స్ పేపర్-2ఎ, బోటనీ, సివిక్స్-2.
➥ మార్చి 11 - సోమవారం - మ్యాథ్స్ పేపర్-2బి, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2.
➥ మార్చి 13 - బుధవారం - ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2.
➥ మార్చి 15 - శుక్రవారం - కెవిుస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2, సోషియాలజీ పేపర్-2, ఫైన్ ఆర్ట్స్& మ్యూజిక్ పేపర్-2
➥ మార్చి 18 - సోమవారం - పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, లాజిక్ పేపర్-2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-2 (బైపీసీ విద్యార్థులకు).
➥ మార్చి 20 - బుధవారం - మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జియోగ్రఫీ పేపర్-2