![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
AP ICET 2024 Results: ఏపీఐసెట్ ఫలితాలు ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
AP ICET Results: ఏపీలోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ పరీక్ష ఫలితాలను మే 30న విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను, ర్యాంకు కార్డులను అందుబాటులో ఉంచారు.
![AP ICET 2024 Results: ఏపీఐసెట్ ఫలితాలు ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే AP ICET 2024 Results released check direct link here download rank cards AP ICET 2024 Results: ఏపీఐసెట్ ఫలితాలు ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/30/506f2562698c1b6d56bf48406e0074201717064910794522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఏపీ ఐసెట్ ఫలితాలు మే 30న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. ఫలితాలతోపాటు అభ్యర్థుల ర్యాంకు కార్డులను కూడా అధికారులు విడుదల చేశారు, రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు మే 6న ఐసెస్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరిగింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఐసెట్ ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏపీ ఐసెట్ ఫలితాల్లో 96.71 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ఈ ఏడాది ఐసెట్ పరీక్షకు మొత్తం 48,828 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. అందులో 18,890 మంది బాలురు, 29,938 మంది బాలికలు ఉన్నారు. పరీక్షకు మొత్తం 44,446 మంది (91 శాతం) అభ్యర్థులు హాజరయ్యారు. మే 8న ఐసెట్ ప్రిలిమినరీ కీని విడుదల చేశారు. అభ్యర్థుల నుంచి మే 10 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. తాజాగా ఫలితాలను విడుదల చేశారు. ఐసెట్‌లో విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
AP ICET 2024 ఫలితాలు ఇలా చూసుకోండి..
Step 1: ఏపీ ఐసెట్ ఫలితాల కోసం అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి- https://cets.apsche.ap.gov.in/ICET/ICET/ICET_HomePage.aspx
Step 2: అక్కడ హోంపేజీలో కిందిభాగంలో కనిపించే AP ICET 2024 Results లింక్ మీద క్లిక్ చేయాలి.
Step 3: ఆ తర్వాత వచ్చే పేజీలో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, ఐసెట్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదు చేయాలి.
Step 4: ఐసెట్ ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.
Step 5: ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి.
AP ICET 2024 ఫలితాల కోసం క్లిక్ చేయండి..
AP ICET 2024 ర్యాంకు కార్డుల కోసం క్లిక్ చేయండి..
పరీక్ష విధానం..
మొత్తం 200 మార్కులకు ఐసెట్ ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు. పరీక్షలో మూడు సెక్షన్లు (సెక్షన్-ఎ, బి, సి) ఉంటాయి. వీటిలో సెక్షన్-ఎ: అనలిటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-బి: కమ్యూనికేషన్ ఎబిలిటీ-70 ప్రశ్నలు-70 మార్కులు, సెక్షన్-సి: మ్యాథమెటికల్ ఎబిలిటీ-55 ప్రశ్నలు-55 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు (రెండున్నర గంటలు).
అర్హత మార్కులు..
పరీక్షలో కనీస అర్హత మార్కులను 25% (50 మార్కులు)గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి అర్హత మార్కులు ఉండవు.
ఏపీలోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఐసెట్-2024 నోటిఫికేషన్ మార్చి 3న వెలువడిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 6న ప్రారంభంకాగా.. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 7 వరకు దరఖాస్తులు స్వీకరించారు. రూ.1000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 8 నుంచి 12 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 13 నుంచి 17 వరకు, రూ.3000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 18 నుంచి 22 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అలాగే రూ.5000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 23 నుంచి 27 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇక దరఖాస్తు వివరాల్లో తప్పులుంటే సరిదిద్దుకునేందుకు ఏప్రిల్ 28, 29 తేదీల్లో అవకాశం కల్పించారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 6న ఐసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లను ఇప్పటికే విడుదల చేయగా.. మే 30న ఫలితాలను వెల్లడించనున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)